ETV Bharat / offbeat

తెలంగాణ టూరిజం "సూపర్ ప్యాకేజీ" - తక్కువ ధరకే ఐదు రోజులు ఫుల్ చిల్ అవ్వొచ్చు!

-ఫ్యామిలీతో మంచి టూర్ ప్లాన్ చేస్తున్నారా? - మీకోసమే అద్భుతమైన ప్యాకేజీని అందిస్తోంది తెలంగాణ టూరిజం!

Araku Tour from Hyderabad
Araku Tour (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : February 27, 2026 at 4:25 PM IST

3 Min Read
Choose ETV Bharat

Araku Tour from Hyderabad : వేసవి వస్తుందంటేనే చాలు చాలా మంది ఇప్పటి నుంచే టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. తమ బడ్జెట్​కు తగ్గట్టు నచ్చిన ప్రాంతాలను చుట్టేసి రావాలనుకుంటారు. మరి మీరు కూడా ఈ సమ్మర్​లో ఒక మంచి పర్యాటక ప్రాంతాన్ని వీక్షించాలనుకుంటున్నారా? అలాంటి వారికోసం తెలంగాణ టూరిజం ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. తక్కువ ధరలోనే ఒక వైపు దర్శనీయ ప్రదేశాలు, మరో వైపు బీచ్​ అందాలు, ప్రకృతి సోయగాలను వీక్షించే మంచి అవకాశం కల్పిస్తోంది. ఇంతకీ, ఆ టూర్ ప్యాకేజీ ఏంటి? ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి? టికెట్ ధరలు ఎంత? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తెలంగాణ టూరిజం "Hyderabad - Vizag - Araku ​" పేరుతో ఈ టూర్​ను ఆపరేట్ చేస్తోంది. ఈ పర్యటన మొత్తం నాలుగు రాత్రులు, ఐదు రోజులుగా ఉంటుంది. హైదరాబాద్​ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరకు టూర్​ను ఆపరేట్ చేస్తున్నారు.

Araku Tour
అరకు టూర్ (Getty Images)

ఈ టూర్ కొనసాగనుందిలా..

డే 1 :

మొదటి రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్​లో IRO పర్యాటక భవన్‌ నుంచి బస్సు స్టార్ట్ అవుతుంది. 6.30 గంటలకు CRO బషీర్‌బాగ్‌ చేరుకుని అక్కడి నుంచి తిరిగి జర్నీ కంటిన్యూ అవుతుంది. ఆ రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది. మార్గమధ్యలో భోజనం ఉంటుంది.

డే 2 :

రెండో రోజు మార్నింగ్ 6 గంటలకు వైజాగ్​ రీచ్ అవుతారు. అక్కడ ఓ ప్రైవేట్ హోటల్​లో ఫ్రెషప్ అవుతారు. ఆ తర్వాత టిఫెన్ తిని సైట్ విజిటింగ్​కి వెళ్తారు. కైలాసగిరి, సింహాచలం దేవాలయాలు సందర్శిస్తారు. ఆపై రుషికొండ, సబ్‌మెరైన్‌ మ్యూజియం చూస్తారు. ఇక సాయంత్రం వైజాగ్‌ బీచ్​కు వెళ్లి అక్కడ ఎంజాయ్​ చేస్తారు. అనంతరం​ తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. ఆ రాత్రి భోజనం తర్వాత వైజాగ్​ హోటల్​లోనే స్టే చేస్తారు.

సమ్మర్​ టూర్​ ప్లాన్​ చేస్తున్నారా? - వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Araku Tour
బొర్రా గుహలు (Getty Images)

డే - 3 :

మూడో రోజు ఉదయం టిఫెన్ చేశాక రోడ్డు మార్గంలో అరకు టూర్‌ స్టార్ట్​ అవుతుంది. అక్కడకి చేరుకున్న తర్వాత ట్రైబల్‌ మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్‌, బొర్రా గుహలు విజిట్​ చేస్తారు. రాత్రికి ధింసా డ్యాన్స్‌ వీక్షిస్తారు. ఆ రోజు రాత్రికి అరకులోనే బస చేస్తారు.

డే - 4 :

నాలుగో రోజు మార్నింగ్ అరకు నుంచి అన్నవరానికి జర్నీ స్టార్ట్ అవుతుంది. అక్కడ సత్యనారాయణ టెంపుల్​ సందర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్​కు​ రిటర్న్ జర్నీ ఉంటుంది. ఆ రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.

డే - 5 :

ఐదో రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్​ రీచ్ అవ్వడంతో మీ అరకు పర్యటన కంప్లీట్ అవుతుంది.

టికెట్ ధరలు చూస్తే..

తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తున్న హైదరాబాద్ - వైజాగ్ - అరకు టూర్ ప్యాకేజీలో పెద్దలకు ఒక్కొక్కరికి రూ.7,500గా నిర్ణయించారు. అదే, 5 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు రూ.600 చెల్లించాలి.

Araku Tour
అరకు టూర్ (Getty Images)

ప్యాకేజీలో ఉండేవి ఇవే :

  • నాన్ ఏసీ వెహికల్​లో జర్నీ ఉంటుంది.
  • వైజాగ్​లో ఏసీ హోటల్​లో, అరకులో నాన్ ఏసీ హోటల్‌లో వసతి సౌకర్యం ఉంటుంది.
  • వైజాగ్, అరకు సైట్ సీయింగ్, గైడ్ ఛార్జీలు కూడా కవర్ అవుతాయి.
  • ఫుడ్, ఎంట్రీ టికెట్స్, దర్శనం టికెట్లు, బోటింగ్ ఛార్జీలు, లాండ్రీ ఛార్జీలు వంటివి మాత్రం టూర్ ప్యాకేజీలో ఉండవని గుర్తుంచుకోవాలి. అంటే, వీటిని ప్రయాణికులే చెల్లించాల్సి ఉంటుంది.
  • ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అరకు టూర్​ ప్యాకేజీ మార్చి 5వ తేదీన అందుబాటులో ఉంది.
  • అది మిస్​ అయితే మార్చి​ 12, 19, 26, ఏప్రిల్ 2వ తేదీల్లోనూ పర్యాటకులకు అందుబాటులో ఉంది.
  • ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన టికెట్ల బుకింగ్, మరిన్ని వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేసి తెలుసుకోవచ్చు.

"డబ్బులు ఊరికే రావు" ఇలా చేశారంటే మీ టూర్ ప్లాన్ సక్సెస్ - నిపుణులు సూచిస్తున్న చిట్కాలివే!

"అరుణాచలం" వెళ్లాలనుకుంటున్నారా? - తక్కువ ధరకే IRCTC టూర్ ప్యాకేజీ!