"రొయ్యల కర్రీ" ఈజీగా ఇలా చేసి చూడండి - సింపుల్ రెసిపీ, పర్ఫెక్ట్ టేస్ట్!
ఎగ్ కర్రీ చేసినంత సింపుల్‌గా రొయ్యల ఇగురు చేసేయొచ్చు - ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో చేయండి!

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 11, 2026 at 8:30 AM IST
SIMPLE PRAWN RECIPES : ఎగ్ కర్రీ చేసినంత ఈజీగా రొయ్యల కర్రీ సింపుల్‌గా చేసేయొచ్చు. చాలా మంది రొయ్యల కర్రీ అంటే చేపల కర్రీ మాదిరిగా అనుకొని అస్సలు ప్రయత్నించరు కానీ, ఇలా చేశారంటే 15 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఈ ఆదివారం చికెన్, మటన్ బదులుగా ఎక్కువ పదార్థాలేమీ వాడకుండానే సింపుల్‌గా ఓ సారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి.
కర్ణాటక స్పెషల్ "మసాలా చిత్రాన్నం" - ఈ పండగ వేళ ఇలా ట్రై చేయండి!

కావల్సిన పదార్థాలు :
- రొయ్యలు - అర కేజీ
- ఉప్పు - కొద్దిగా
- నిమ్మరసం - అర చెక్క
- పసుపు - పావు స్పూన్
కర్రీ కోసం :
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావు స్పూన్
- పచ్చిమిర్చి - 3
- ఉల్లిపాయ - 2
- కరివేపాకు - 1 రెమ్మ
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- కారం - 2 స్పూన్లు
- ధనియాల పొడి - 1 స్పూన్
- జీలకర్ర పొడి - అర టీ స్పూన్
- గరం మసాలా - అర టీ స్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం :
- ముందుగా రొయ్యలను బాగా క్లీన్ చేసుకోవాలి. నీళ్లలో ఉప్పు, నిమ్మరసం, పసుపు వేస్తే రొయ్యలు బాగా క్లీన్ అవుతాయి.
- ఇపుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. వేడెక్కగానే క్లీన్ చేసిన రొయ్యలు వేసుకోవాలి. నీళ్లు ఇగిరిపోయే వరకు మూతపెట్టుకుని మీడియం ఫ్లేమ్‌లో ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

- ఆ తర్వాత మూత తీసి రొయ్యలను పక్కకు తీసుకోవాలి. ఇపుడు అదే కడాయిలో మరి కొద్దిగా నూనె పోసుకుని వేడెక్కగానే పచ్చిమిర్చి చీలికలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి.
- ఆ తర్వాత ఉప్పు వేసి కలిపి వేయిస్తే ఉల్లిపాయలు తొందరగా మెత్తబడిపోతాయి. ఇపుడు కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ప్యాన్ పై మూత పెట్టి మెత్తబడే వరకు ఉడికించాలి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.

- ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రెండు నిమిషాలు వేయిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోతుంది. ఈ టైంలో ముందుగా ఉడికించి తీసుకున్న రొయ్యలు వేసుకుని కలపాలి.
- బాగా కలిపాక పసుపు, కారం వేసుకుని కలపాలి. 2 నిమిషాల పాటు కారం రొయ్యలకు పట్టేలా ఫ్రై చేయాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. ఇపుడు మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టి గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. ఇపుడు ఉప్పు, కారం టేస్ట్ చెక్ చేసుకోవాలి.

- ఆ తర్వాత కర్రీ దగ్గర పడి నూనె తేలే వరకు ఉడికించాలి. చివరగా గరం మసాలా వేసుకుని కలిపి కొత్తిమీర తరుగు వేసుకుని మరో 2 నిమిషాల తర్వాత దించుకుంటే చాలు! చాలా సింపుల్‌గా కుక్ చేసుకోవచ్చు.
"సేమియా ఉప్మా" పిల్లలు నచ్చట్లేదా? - ఓ సారిలా మార్చి చేశారంటే ఇష్టంగా తింటారు!
నోట్లో వేసుకోగానే కరిగిపోయే "అరిసెలు" - ఈ సంక్రాంతికి ఇంట్లోనే తియ్యని వేడుక చేసుకోండి! !

