ETV Bharat / offbeat

ఆంధ్రా స్టైల్ "పాలకూర పప్పు" - వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే అమృతమే!

పాలకూరతో ఇంట్లోనే సింపుల్​గా చేసుకునే రెసిపీ - ఒక్కసారి తింటే ఎప్పుడూ ఇలానే చేసుకుంటారు!

Palakura Pappu
Palakura Pappu (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 1, 2026 at 10:25 AM IST

2 Min Read
Choose ETV Bharat

Palakura Pappu in Telugu : పాలకూరతో వివిధ రకాల రెసిపీలు చేస్తుంటారు. వీటితో పప్పు, ఫ్రై ఎక్కువగా చేస్తారు. ఇందులోనూ పాలకూర పప్పును ఒక్కొక్కొరు ఒక్కొ స్టైల్లో చేస్తుంటారు. అయితే ఎప్పుడూ ఓకేలా కాకుండా ఈసారి కొత్తగా ఆంధ్రా స్టైల్లో చేశారంటే తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. ఇక వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి తిన్నారంటే ఆ రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఘుమఘుమలాడే ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా?

కరకరలాడే "నువ్వుల చెగోడీలు" - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!

Palakura Pappu
పాలకూర (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • పాలకూర తరుగు - 8 కప్పులు
  • కందిపప్పు - 4 కప్పులు
  • వెల్లుల్లి రెబ్బలు - 20
  • ఆవాలు - 2 టీ స్పూన్లు
  • జీలకర్ర - 2 టీ స్పూన్లు
  • పసుపు - 1 టీ స్పూన్
  • పచ్చిమిర్చి - 16
  • ఉల్లిపాయలు - 4
  • ఎండుమిర్చి - 8
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - 4 టీ స్పూన్లు
  • ధనియాల పొడి - 4 టీ స్పూన్లు
  • చింతపండు రసం - ఒక కప్పు
  • ఆయిల్ - తగినంత
  • కరివేపాకు - కొద్దిగా
Palakura Pappu
కందిపప్పు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా కావాల్సిన పరిమాణంలో పాలకూరను తరిగి ఉంచాలి. అలాగే నాలుగు ఉల్లిపాయలు, 16 పచ్చిమిర్చి, 20 వెల్లుల్లి రెబ్బలను ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • ఇంకో గిన్నెలో నాలుగు కప్పుల కందిపప్పు వేసి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసి 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
  • ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్​లో నానబెట్టిన కందిపప్పు, 10 టీ స్పూన్ల ఆయిల్, ఒక టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు వేసి మూతపెట్టాలి. అనంతరం మంటను హై ఫ్లేమ్​లో ఉంచి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
Palakura Pappu
ఉల్లిపాయ ముక్కలు (Getty Images)
  • 3 విజిల్స్ వచ్చిన అనంతరం పప్పు మిశ్రమాన్ని పప్పుగుత్తితో మెత్తగా రుబ్బాలి. ఇందులోనే నాలుగు కప్పుల నీళ్లు పోసి ఓసారి బాగా మిక్స్ చేయాలి.
  • అనంతరం స్టవ్ ఆన్ చేసి పాన్​లో ఎనిమిది టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఇవి వేగాక రెండు టీ స్పూన్ల ఆవాలు, ఎనిమిది ఎండుమిర్చి, రెండు టీ స్పూన్ల జీలకర్ర, తరిగి ఉంచిన పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసి ఫ్రై చేయాలి.
Palakura Pappu
పచ్చిమిర్చి (Getty Images)
  • ఈ మిశ్రమం దోరగా వేగాక తరిగి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆనియన్స్ వేగాక రుచికి సరిపడా ఉప్పు, నాలుగు టీ స్పూన్ల కారం, నాలుగు టీ స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసి కలపాలి. అనంతరం మంటను లో ఫ్లేమ్​లో ఉంచి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఎనిమిది కప్పుల పాలకూర తరుగు వేసి మూడు నిమిషాల పాటు వేయించాలి. 3 నిమిషాల అనంతరం ఉడికించిన కందిపప్పు మిశ్రమం, నాలుగు కప్పుల నీళ్లు పోసి కలపాలి. ఆపైన కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసి మరోసారి మిక్స్ చేయాలి.
Palakura Pappu
కరివేపాకు (Getty Images)
  • అనంతరం మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి 10 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • అంతే ఆంధ్రా స్టైల్ పాలకూర పప్పు మీ ముందుంటుంది!

సొరకాయ పొట్టుతో "పచ్చడి" - ఎన్నడూ తినని సరికొత్త రుచిని ఆస్వాదిస్తారు!

ఉల్లి, వెల్లుల్లి లేకుండానే "దహీ కిచిడీ" - ఒక్కసారి తింటే టేస్ట్​కు ఫిదా!