ఆంధ్రా స్పెషల్ "ముల్లంగి మజ్జిగ పులుసు"- ఈ సరికొత్త రుచికి ఫిదా అయిపోతారు!
ఘుమఘుమలాడే మజ్జిగ పులుసు - ఈ పద్ధతిలో చేస్తే ఇష్టంగా తింటారు
Majjiga Pulusu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 2, 2026 at 9:24 AM IST
Majjiga Charu in Telugu : మజ్జిగ పులుసు చాలా మందికి ఇష్టమైన రెసిపీ. వీటిని వివిధ రకాలుగా చేస్తుంటారు. అయితే ఈసారి కొత్తగా ఆంధ్రా స్పెషల్ మజ్జిగ పులుసు ట్రై చేశారంటే అద్దిరిపోతుంది. ఈ విధంగా ఇంట్లో చేసి పెడితే ఇంకోసారి చేయమని అడుగుతారు. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
స్పైసీ "ఎగ్ ఫ్రైడ్ రైస్" - ఇలా ట్రై చేస్తే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ టేస్ట్ ఇంట్లోనే!

కావాల్సిన పదార్థాలు :
- పెరుగు - అర లీటర్ (500 ఎంఎల్)
- జీలకర్ర - 1 టీ స్పూన్
- ధనియాలు - 2 టీ స్పూన్లు
- శనగపప్పు - 2 టీ స్పూన్లు
- ఆవాలు - 1 టీ స్పూన్
- మెంతులు - ముప్పావు స్పూన్
- మిరియాలు - 1 టీ స్పూన్
- బియ్యం - 1 టీ స్పూన్
- ఎండుమిర్చి - 2
- మునక్కాయ - 1
- ముల్లంగి ముక్కలు - పావు కప్పు
- వంకాయ - 1
- పచ్చిమిర్చి - 2
- బెండకాయ - 1
- సొరకాయ ముక్కలు - 1 కప్పు
- టమోటా - 1
- చింతపండు - కొద్దిగా
- ఉప్పు - రుచికి సరిపడా
- కరివేపాకు - కొంచెం

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మునక్కాయ, రెండు పచ్చిమిర్చి, ఒక బెెెెండకాయ, ఒక వంకాయ, ఒక టమోటాను తరిగి ఉంచాలి. అలాగే కావాల్సిన పరిమాణంలో ముల్లంగి, సొరకాయను కట్ చేసి పెట్టుకోవాలి.
- అలాగే కప్పులో కొద్దిగా చింతపండు, సరిపడా నీళ్లు పోసి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. పదిహేను నిమిషాల తర్వాత చింతపండును పిండి అర కప్పు వచ్చేవరకు వాటర్ యాడ్ చేస్తూ రసం తీసి పక్కనుంచాలి.

- మరోవైపు కప్పులో ఒక టీ స్పూన్ జీలకర్ర, రెండు టీ స్పూన్ల ధనియాలు, రెండు టీ స్పూన్ల శనగపప్పు వేయాలి. అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు, ముప్పావు స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ మిరియాలు యాడ్ చేయాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ బియ్యం, రెండు ఎండుమిర్చి, సరిపడా నీళ్లు పోసి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. అర గంట తర్వాత వీటిని మిక్సీజార్‌లో ఈ మిశ్రమాన్ని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి.
- ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో 750 ఎంఎల్ వాటర్ పోయాలి. ఇందులో తరిగి ఉంచిన మునక్కాయ, బెండకాయ, వంకాయ, టమోటా, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి.
- ఇందులోనే కప్పు సొరకాయ ముక్కలు, పావు కప్పు ముల్లంగి ముక్కలు, అర కప్పు చింతపండు రసం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కరివేపాకు వేసి మూతపెట్టి ముక్కలను మెత్తగా ఉడికించాలి.

- అదేవిధంగా మిక్సింగ్ బౌల్లో అర లీటర్ పెరుగు వేయాలి. అలాగే గ్రైండ్ చేసుకున్న ఆవాలుధనియాల పేస్ట్‌లో 100 ఎంఎల్ నీళ్లు పోసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెరుగులో పోసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి.
- కూరగాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేయాలి. ఇందులోనే కొద్దిగా నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మూతపెట్టాలి. ఆ తర్వాత మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ 20 నిమిషాల పాటు మరిగించాలి.
- ఇంకోవైపు తాలింపు కోసం పాన్‌లో రెండు టీ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ జీలకర్ర, ఐదు వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి.

- ఈ తాలింపును మరుగుతున్న మజ్జిగ మిశ్రమంలో వేసి కలపాలి. అనంతరం మూతపెట్టి ఒక నిమిషం పాటు మరగనివ్వాలి.
- ఒక నిమిషం తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- ఇక అంతే ఆంధ్రా స్పెషల్ మజ్జిగ పులుసు రెడీ అయినట్లే!
చిక్కటి గ్రేవితో "సోయా గోంగూర కర్రీ" - అన్నంలోకి యమా టేస్టీగా ఉంటుంది!
బెండకాయలు పెంకపై కాల్చి ఇలా చట్నీ చేయండి - ఈ రోటి పచ్చడి ట్రై చేశారా?

