ETV Bharat / offbeat

బెల్లంతో జ్యూసీ జ్యూసీగా "ఉసిరికాయ మురబ్బా" - తయారీ చాలా సింపుల్, ఏడాది నిల్వ!

ఆరోగ్యాన్నిచ్చే కమ్మని "ఆమ్లా మురబ్బా" - అప్పటికప్పుడు ఈజీగా చేసుకోండిలా!

Amla Sweet Recipe
Amla Sweet Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : November 13, 2025 at 3:05 PM IST

3 Min Read
Choose ETV Bharat

Amla Sweet Recipe in Telugu : నార్మల్​గా మనందరం ఈ సీజన్​లో విరివిగా దొరికే ఉసిరికాయలతో నిల్వ పచ్చడి, రోటి పచ్చడి, పులిహోర, పప్పు అంటూ రకరకాల రెసిపీలు ప్రిపేర్ చేసుకుంటుంటాం. అవి మాత్రమే కాకుండా ఉసిరికాయలతో కమ్మగా రెడీ చేసుకునే ఒక సూపర్ స్వీట్ రెసిపీ ఉంది. అదే, నోరూరించే "ఉసిరికాయ ముక్కల మురబ్బా". బెల్లంతో సింపుల్​గా చేసుకునే ఈ ఆమ్లా మురబ్బా తియ్య తియ్యగా, భలే రుచిగా ఉంటుంది.

ఎవరైనా దీన్ని చాలా తక్కువ టైమ్​లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. జ్యూసీ జ్యూసీగా, కమ్మగా ఉండే ఈ స్వీట్​ను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే, నార్మల్ స్వీట్స్​తో పోల్చితే ఇది ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు, ఈ స్వీట్ రెసిపీని ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుంది! మరి, ఈ సీజనల్ స్పెషల్ స్వీట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Amla Murabba with Jaggery
ఉసిరికాయలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • ఉసిరికాయలు - అరకిలో
  • బెల్లం - అరకిలో(రుచికి తగినంత)
  • యాలకులు - ఆరేడు
  • ఉప్పు - కొద్దిగా
  • నిమ్మరసం - నాలుగైదు టీస్పూన్లు

పచ్చికారంతో ఉసిరికాయ "నిల్వ పచ్చడి" - రుచి అద్భుతం, ఏడాది నిల్వ కూడా!

Amla Murabba with Jaggery
బెల్లం (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రుచికరమైన ఉసిరికాయ స్వీట్ తయారీ కోసం ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి పక్కనుంచాలి.
  • తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి బౌల్​లో ఐదారు కప్పుల నీళ్లు తీసుకుని బాగా వేడి చేసుకోవాలి.
  • వాటర్ బాగా వేడెక్కి బబుల్స్ వస్తున్నప్పుడు బౌల్​​పై ఒక చిల్లుల గిన్నె(జల్లి గిన్నె) ఉంచి దానిలో కడిగిపెట్టుకున్న ఉసిరికాయలను వేసి మూతపెట్టి ఆవిరిపై మీడియం ఫ్లేమ్​లో 12 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • ఇలా ఉడికించుకునే క్రమంలో ఏడెనిమిది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఉసిరికాయలను మరో వైపునకు టర్న్ చేసి మూతపెట్టి మిగతా టైమ్​ ఉడికించుకోవాలి.
Amla Murabba with Jaggery
యాలకులు (Getty Images)
  • ఆవిధంగా ఉడికించుకున్నాక మూతతీసి ఒక ఉసిరికాయను ఫ్లోర్క్ చెంచాతో గుచ్చి అవి చక్కగా ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి.
  • ఉసిరికాయలు ఆవిరి మీద మంచిగా ఉడికిన తర్వాత వాటిని ఒక వెడల్పాటి ప్లేట్​లోకి తీసుకుని చల్లార్చుకోవాలి.
  • అవి చల్లారిన తర్వాత ఉసిరికాయల్లో ఉండే గింజలను తీసేసి ముక్కలుగా చేసుకుని పక్కనుంచాలి. అలాగే, బెల్లాన్ని సన్నగా తురుముకోవాలి.
  • ఇప్పుడు కాస్త మందంగా ఉండే ఒక వెడల్పాటి స్టీల్ గిన్నె తీసుకుని అందులో ఉసిరికాయ ముక్కలు, బెల్లం తురుము వేసుకుని ఒకసారి బాగా కలపాలి.

నిగనిగలాడే ఉసిరితో నోరూరించే కారం పొడి! - కూరలు పక్కనపెట్టి తినేస్తారు!

Amla Murabba with Jaggery
ఉప్పు (Getty Images)
  • అనంతరం ఆ గిన్నెను స్టవ్ మీద ఉంచి మూత పెట్టి లో ఫ్లేమ్​లో మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి.
  • ఐదారు నిమిషాలకు బెల్లం పూర్తిగా కరిగిపోయి జ్యూసీ జ్యూసీగా అవుతుంది.
  • బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత అందులో మంచి ఫ్లేవర్ కోసం కచ్చాపచ్చాగా దంచిన యాలకులు, రుచికోసం కొద్దిగా ఉప్పు వేసుకుని కలిపి పాకం మిశ్రమం అనేది లేత బంగారు రంగులోకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి.
  • ఇలా ఉడికించుకునే క్రమంలో మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. పాకం సరైన కన్సిస్టెన్సీలోకి రావడానికి 12 నుంచి 15 నిమిషాల టైమ్ పట్టొచ్చు.
Amla Murabba with Jaggery
నిమ్మరసం (Getty Images)
  • బెల్లం పాకం బాగా మరిగి గోల్డెన్ కలర్​లో ముదురు తీగ పాకం వచ్చిందనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని చివరగా నిమ్మరసం యాడ్ చేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపి చల్లార్చుకోవాలి.
  • అది పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్​ జార్​లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే చాలు. అంతే, జ్యూసీ జ్యూసీగా నోరూరించే "ఉసిరికాయ ముక్కల మురబ్బా" సింపుల్​గా రెడీ అవుతుంది!
  • ఇక్కడ మీరు మొత్తం బెల్లం వద్దనుకుంటే సగం చక్కెర, సగం బెల్లాన్ని అయినా తీసుకుని ఈ స్వీట్​ను రెడీ చేసుకోవచ్చు. ఏదీ తీసుకున్నా ఉసిరికాయల క్వాంటిటీని బట్టి మీ రుచికి తగిన పరిమాణంలో బెల్లం లేదా చక్కెర తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.

బియ్యం, మజ్జిగతో కరకరలాడే "వడలు" - నూనె తక్కువ, రుచి ఎక్కువ!