ETV Bharat / offbeat

పుల్ల పుల్లగా నోరూరించే "ఉసిరికాయ పోహా" - ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చుతుంది!

ఆమ్లాతో అద్దిరిపోయే "పోహా" - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేయమనడం పక్కా!

Usirikaya Poha Recipe
Usirikaya Poha Recipe (ETV Abhiruchi)
author img

By ETV Bharat Telangana Team

Published : January 10, 2026 at 10:36 AM IST

3 Min Read
Choose ETV Bharat

Usirikaya Poha Recipe in Telugu : వింటర్​లో విరివిగా లభించే ఉసిరికాయలతో మనందరం పచ్చడి, పులిహోర, పప్పు అంటూ రకరకాల వెరైటీలు ప్రిపేర్ చేసుకుని ఆస్వాదిస్తుంటాం. అవి మాత్రమే కాకుండా మీరు ఈ సీజన్​లో ట్రై చేయాల్సిన మరో సూపర్ రెసిపీ ఉంది. అదే, నోరూరించే "ఉసిరికాయ పోహా". ఇది నార్మల్​గా చేసుకునే అటుకుల ఉప్మాతో పోల్చితే పుల్ల పుల్లగా, భలే కమ్మగా ఉంటుంది.

నెయ్యి ఫేవర్​తో ఘుమఘుమలాడే దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు, రోజూ చేసుకునే ఇడ్లీ, దోశ, వడ వంటివి బోరింగ్​గా అనిపించినప్పుడు ఈ రెసిపీ సరికొత్త రుచినిస్తుంది. ఈ పోహా మంచి రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే, దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టదు! మరి, లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ ఉసిరికాయ పోహాను ఎలా చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

Usirikaya Poha Recipe
Usirikaya Poha Recipe (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • పెద్ద ఉసిరికాయలు - ఐదారు
  • అటుకులు - ఒక కప్పు
  • పచ్చిమిర్చి - ఐదారు
  • ఉల్లిపాయ - ఒకటి(చిన్న సైజ్​ది)
  • ఆవాలు - అర చెంచా
  • కరివేపాకు - కొద్దిగా
  • మినప్పప్పు - ఒక చెంచా
  • శనగపప్పు - ఒక చెంచా
  • నెయ్యి - ఒక చెంచా
  • ఉప్పు - రుచికి తగినంత

తెలంగాణ స్పెషల్ "సకినాలు" - పిండి ఇలా కలిపి చేస్తే కరకరలాడుతూ అద్దిరిపోతాయి!

Usirikaya Poha Recipe
Usirikaya Poha Recipe (Getty Images)

తయారీ విధానం :

  • ఈ టేస్టీ అండ్ హెల్దీ ఆమ్లా పోహా తయారీకి ముందుగా ఉసిరికాయ గుజ్జును రెడీ చేసుకోవాలి.
  • ఇందుకోసం స్టవ్ మీద ఒక గిన్నెలో పెద్ద సైజ్ తాజా ఉసిరికాయలను తీసుకుని అవి మునిగేవరకు వాటర్ పోసుకుని మూతపెట్టి మెత్తగా ఉడికించుకోవాలి.
  • చిన్న ఉసిరికాయలతో పోల్చితే పెద్ద ఉసిరికాయలు కాస్త వగరు తక్కువగా ఉంటాయి. కాబట్టి, ఈ రెసిపీకి పెద్ద ఉసిరికాయలను తీసుకోవడం బెటర్.
  • ఉసిరికాయలు ఉడికేలోపు రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకుని పక్కనుంచాలి.
Usirikaya Poha Recipe
Usirikaya Poha Recipe (ETV Bharat)
  • ఇప్పుడు చక్కగా ఉడికిన ఉసిరికాయలను ఒక ప్లేట్​లోకి తీసుకుని కాస్త చల్లారనివ్వాలి.
  • అవి చల్లారేలోపు ఒక గిన్నెలో మందపాటి అటుకులను తీసుకుని లైట్​గా కడిగి కొన్ని నీళ్లు పోసి రెండు నిమిషాలు నానబెట్టుకోవాలి.
  • ఆలోపు చల్లారిన ఉసిరికాయలను గింజలు వేరు చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • తర్వాత ఉసిరికాయ ముక్కలను మిక్సీ జార్​లోకి తీసుకుని మెత్తని గుజ్జులా గ్రైండ్ చేసుకుని పక్కనుంచాలి.
  • ఇప్పుడు రెండు నిమిషాలు నానిన అటుకులను స్టెయినర్​లో వేసి అదనపు వాటర్ తొలగిపోయేలా కాసేపు పక్కనుంచాలి.
Usirikaya Poha Recipe
Usirikaya Poha Recipe (Getty Images)
  • అనంతరం ఆమ్లా పోహా తయారీకి స్టవ్ మీద పాన్ పెట్టి మూడు చెంచాల నూనె, ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగి ఆ మిశ్రమం వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
  • అవి చక్కగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఆనియన్స్ కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి.
  • ఆనియన్స్ వేగాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ గుజ్జు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని మొత్తం కలిసేలా ఒక నిమిషం కలుపుతూ వేయించాలి.
Usirikaya Poha Recipe
Usirikaya Poha Recipe (Getty Images)
  • ఆ తర్వాత నానబెట్టి పక్కనుంచిన అటుకులను వేసి ఒకసారి మిశ్రమం మొత్తం మంచిగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆపై స్టవ్​ను లో టూ మీడియం ఫ్లేమ్​లో ఉంచి రెండు మూడు నిమిషాలు మధ్యమధ్యలో కలుపుతూ కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలు.
  • అంతే, పుల్ల పుల్లగా నోరూరించే కమ్మని "ఉసిరికాయ పోహా" రెడీ అవుతుంది!
  • మరి, నచ్చితే మీరూ ఈ సీజన్​లో ఓసారి తప్పకుండా అద్దిరిపోయే ఆమ్లా పోహాను ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ వావ్ సూపర్ అంటూ లొట్టలేసుకుంటూ తింటారు.

ఎర్రకారంతో అద్దిరిపోయే "అలసందల దోశలు" - పిండి పులియబెట్టకుండానే అప్పటికప్పుడు రెడీ!

పొట్టు మినప్పప్పుతో "వడలు" - అమ్మమ్మల పద్ధతిలో నూనె పీల్చకుండా, భలే రుచిగా!