ETV Bharat / offbeat

ప్లాస్టిక్ వ్యర్థాలతో 'ప్రొటీన్ రిచ్ కుకీలు'! - అమెరికా శాస్త్రవేత్తల మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీ!

పాత సామాన్ల బండికి వేసే ప్లాస్టిక్​తో 'పసందైన కుకీలు'! - సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసి శాస్త్రవేత్తలు!

Plastic Waste Cookies
ప్లాస్టిక్ వ్యర్థాలు (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 26, 2026 at 12:03 PM IST

3 Min Read
Choose ETV Bharat

Plastic Waste Cookies : ప్లాస్టిక్‌తో మానవాళికి, పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోంది. వద్దని ఎంత చెబుతున్నా, ప్లాస్టిక్ వస్తువులు, కవర్ల వినియోగం అంతకంతకూ పెరుగుతుందే గానీ తగ్గడంలేదు. నిత్యకృత్యంగా మారిన ప్లాస్టిక్‌ వాడకాన్ని నిలువరించడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రయోజనకర ఉత్పత్తులుగా మార్చేందుకు ప్రపంచవ్యాప్తంగా కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగానే అమెరికా శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకేసి ప్లాస్టిక్‌ వ్యర్థాలను తినుబండారాలుగా మార్చే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. ప్లాస్టిక్​తో తినుబండారాలు ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

నార్మల్​గా మనందరం ఇళ్లలో వాడి పారేసే ప్లాస్టిక్ బాటిల్స్, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను బయట చెత్తలో పడేస్తాం. లేదంటే పాత సామాన్ల బండి వచ్చినప్పుడు కేజీల చొప్పున అమ్మేస్తుంటాం. కానీ, మనం పనికిరావని పడేసే ఆ ప్లాస్టిక్ వ్యర్థాలతో అమెరికా శాస్త్రవేత్తలు తినుబండారాలను తయారు చేస్తున్నారు. అమెరికాలోని 'దక్షిణ ఇల్లినోయీ విశ్వవిద్యాలయ' శాస్త్రవేత్తలు ప్లాస్టిక్‌ వ్యర్థాలను తినుబండారాలుగా మార్చే సరికొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు.

Plastic Waste Cookies
ప్లాస్టిక్ వ్యర్థాలతో కుకీలు (Eenadu)

మొదట వాటర్‌ బాటిళ్లలోని పీఈటీ ప్లాస్టిక్‌ను, మొక్కజొన్న వ్యర్థాలు, ఇతర బయోమాస్‌ను ఆక్సిడేటివ్‌ హైడ్రోథర్మల్‌ డిజల్యూషన్‌ అనే పద్ధతి ద్వారా ప్రాసెస్‌ చేశారు. ఈ విధానం ద్వారా కఠిన పదార్థాలను చిన్న చిన్న తునకలుగా మార్చేశారు. అనంతరం వాటిని ప్రత్యేకంగా ప్రోగ్రామ్‌ చేసిన ఈస్ట్‌కు అందించారు. వ్యర్థాల నుంచి వచ్చిన పదార్థాలను ఆహార సంబంధ ముడిసరకులుగా మార్చే కెపాసిటీ ఈస్ట్ కణాలకు ఉంది. అప్పుడు అవి ప్రాసెస్డ్‌ వ్యర్థాలను ప్రొటీన్లు, యాసిడ్లు, ఫ్యాట్‌లు, ఫ్లేవరింగ్‌ పదార్థాలుగా మార్చాయి. తర్వాత శాస్త్రవేత్తలు వీటికి ఫైబర్, స్టార్చ్, స్వీటెనర్‌లను యాడ్ చేశారు. నెక్ట్స్ ఆ మిశ్రమాన్ని త్రీడీ ప్రింటర్‌ సాయంతో కుకీలుగా మార్చారు శాస్త్రవేత్తలు.

ఫోన్​ కింద పడేసే వారిలో మహిళలే ఎక్కువ! - సర్వేలో మొబైల్ వాడకంపై కీలక విషయాలు!

టేస్టీగా మార్చేందుకు ప్రయత్నాలు :

ప్రొటీన్‌ ఎక్కువగా ఉన్న ఈ కుకీలను మైక్రోబైట్లుగా పిలుస్తున్నారు. అమెరికా శాస్త్రవేత్తలు వీటిని మరింత టేస్టీగా మార్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యర్థాల నుంచి అదనపు ఆహార సంబంధ ముడిసరకులను ఉత్పత్తి చేసే ప్రత్యేక ఈస్ట్‌లను వారు డెవలప్ చేశారు. ఉదాహరణకు, మొక్కల బయోమాస్‌ నుంచి వెనీలా ఫ్లేవరింగ్‌ను ఉత్పత్తి చేసేలా బేకర్‌ ఈస్ట్‌ను ప్రోగ్రామ్‌ చేశారు అమెరికా శాస్త్రవేత్తలు. మరో ఈస్ట్‌ రకంతో పీఈటీలోని ఇథలీన్‌ గ్లైకాల్‌ నుంచి బీటా కెరోటిన్‌ను ఉత్పత్తి చేయవచ్చని కనుగొన్నారు. ఇది చాలా అవసరం. మానవశరీరం దీన్ని 'ఎ' విటమిన్‌గా మార్చుకుంటుంది.

Plastic Waste
ప్లాస్టిక్ వ్యర్థాలు (Getty Images)

ప్లాస్టిక్ పునర్వినియోగంతోనే మేలు!

ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూమిలో కలవడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఈ క్రమంలో ప్లాస్టిక్‌ను పునర్వినియోగించడమే మేలు అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. అయితే, మన దేశంతో పోల్చితే పలు దేశాల్లో ప్లాస్టిక్‌ పునర్వినియోగం ఎక్కువగా ఉంటోంది.

జర్మనీలో ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ 70 శాతానికి చేరింది. అక్కడ ప్లాస్టిక్‌ బాటిల్, క్యాన్‌ కొన్నప్పుడు అదనంగా డబ్బులు తీసుకుని, ఖాళీ బాటిల్‌ తిరిగిచ్చినప్పుడు ఆ డిపాజిట్‌ డబ్బు తిరిగి ఇచ్చేస్తారు. దాంతో బాటిళ్ల సేకరణ సుమారు 90శాతానికి పైగా ఉంటుందని అంచనా. అలాగే, అక్కడ ఇంటివద్దే రకరకాల చెత్తను వేరు చేస్తారు. AI, సెన్సర్‌ టెక్నాలజీతో చెత్తలో ప్లాస్టిక్‌ రకాల్ని డివైడ్ చేస్తారు. దీంతో నాణ్యతగత రీసైక్లింగ్‌ సాధ్యం అవుతోందని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి.

మరో దేశం దక్షిణ కొరియాలోనూ వ్యర్థాల నిర్వహణ కఠినంగా ఉంటుంది. ఇక్కడ దాదాపు 70 శాతం ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ అవుతోందని పీసీబీ(పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్) చెబుతోంది. ఎంత చెత్త వేస్తే అంత డబ్బు చెల్లించే విధానం దక్షిణ కొరియాలో ఉంది. చెత్తను సరిగా వేరు చేయకపోతే భారీ ఫైన్లు, ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌ సంస్థలే వాటి రీసైక్లింగ్‌ బాధ్యత వహించడం వంటి విధానాలు ఇక్కడ అమలులో ఉన్నాయి. వీటితో పాటు బల్గేరియాలో 59 శాతం, స్లొవేనియాలో 56 శాతం ప్లాస్టిక్‌ వ్యర్థాలను పునర్వినియోగిస్తున్నట్లు పీసీబీ చెబుతోంది.

ఒకే ఒక్క యాప్ చాలు! - స్కాలర్​షిప్స్, లోన్లు, బీమా పథకాలు, బిజినెస్ వివరాలన్నీ!

వాన నీటి కోసం ఇంట్లో ఈ 'ఫిల్టర్​' ఉంటే - విద్యుత్తు, నీటి బిల్లులు ఆదా!