ETV Bharat / offbeat

"పిల్లల ఆధార్ బయోమెట్రిక్" అప్‌డేట్ చేయించారా? - తొందరపడాల్సిందే! ఎందుకంటే!

ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ ఎందుకు అవసరం? - ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

aadhaar_update
aadhaar_update (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 3, 2026 at 3:18 PM IST

2 Min Read
Choose ETV Bharat

AADHAAR UPDATE : మీరు మీ పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్​డేట్ చేయించారా? లేదంటే త్వరపడండి. ఈ ఉచిత అవకాశం సెప్టెంబర్ 30 వరకు మాత్రమే. ఆధార్ ఎందుకు అప్​డేట్ చేయించాలంటే పిల్లలు పెరిగేకొద్దీ వారి వేలిముద్రలు, కనుపాపల నమూనాలు, ముఖ లక్షణాలలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. అందువల్ల, కచ్చితమైన గుర్తింపు ధ్రువీకరణ కోసం బయోమెట్రిక్ అప్‌డేట్‌ తప్పనిసరి. భవిష్యత్ లావాదేవీల్లో గుర్తింపు ధ్రువీకరణలో అడ్డంకులు రాకుండా ఉండాలంటే ఈ అప్‌డేట్‌ తప్పనిసరి.

పాఠశాల అడ్మిషన్లు, నీట్/జేఈఈ వంటి పోటీ పరీక్షలతో పాటు ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లను పొందడానికి ఆధార్ తప్పనిసరి. ఆధార్ బయోమెట్రిక్స్ చేయించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

హిమాలయాల్లో దర్శనమిచ్చిన "కాస్పియన్ కోబ్రా" - ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము!

మధ్యాహ్న భోజనం, ఆరోగ్య బీమా (ఆయుష్మాన్ భారత్) ఇంకా పిల్లల సబ్సిడీల వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు చెల్లుబాటు అయ్యే ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి. పాత బయోమెట్రిక్ రికార్డు ఈ ప్రయోజనాలను పొందడంలో అంతరాయం కలిగించవచ్చు. UIDAI మార్గదర్శకాల ప్రకారం, బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేయకపోతే, ఆర్థిక లావాదేవీల (ఉదా, బ్యాంకు ఖాతాలు తెరవడం) లేదా ప్రయాణ పత్రాల దరఖాస్తుల సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

అర్హత, అవసరమైన పత్రాలు

వయస్సు ప్రమాణం : వయస్సు పెరుగుతున్నపుడు పిల్లల్లో శారీరక మార్పులు అనివార్యం. దీంతో బయోమెట్రిక్స్ వేలి ముద్రలు, కళ్లు, ముఖం మారుతుంది. అందుకే 5నుంచి 17ఏళ్ల వయస్సులోపు పిల్లలకు ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి.

కావల్సిన పత్రాలు : పిల్లలు, వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఒరిజినల్ ఆధార్ కార్డు, దాంతో పాటు బర్త్ సర్టిఫికెట్ లేదా స్కూల్ ఐడీ కార్డు తప్పనిసరిగా అవసరం ఉంటుంది. అప్​డేట్ చేసే క్రమంలో OTP ప్రామాణీకరణ కోసం ఆధార్‌కు అనుసంధానించబడిన మొబైల్ నంబర్ తప్పనిసరి. ఇక దత్తత తీసుకున్న చిన్నారులకు సంబంధించి వారి సంరక్షకులు ప్రభుత్వం ధ్రువీకరించిన సర్టిఫికెట్లను చూపించాల్సి ఉంటుంది.

దశలవారీగా అప్‌డేట్ ప్రక్రియ

ముందుగా మీకు దగ్గర్లోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. రద్దీని నివారించడానికి UIDAI పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో షెడ్యూల్ చేసుకోవచ్చు. ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండా వచ్చేవారిని అనుమతించరు కాబట్టి రద్దీ సమయాల్లో, వారాంతాల్లో పొడవైన క్యూల నుంచి తప్పించుకోవచ్చు.

బయోమెట్రిక్ క్యాప్చర్ : ఆధార్ అప్​డేట్​లో భాగంగా 10 వేలిముద్రలు, కనుపాప నమూనాలు, అధిక రిజల్యూషన్ ఉన్న ఫొటో స్కాన్ చేస్తారు.

అప్‌డేట్ తర్వాత తల్లిదండ్రులు mAadhaar యాప్ లేదా SMS ద్వారా స్థితిని తెలుసుకోవచ్చు. ఈ మేరకు ట్రాక్ చేయడానికి అప్‌డేట్ అభ్యర్థన సంఖ్య (URN)తో కూడిన రసీదును అందుకుంటారు. సాధారణంగా 30నుంచి 60 రోజుల్లో అప్​డేట్ కనిపిస్తుంది.

మీరు ఇప్పుడే ఎందుకు తొందరపడాలంటే!

ఆధార్ అప్​డేషన్ ఉచిత సేవ సెప్టెంబర్ 30న ముగుస్తుంది. గడువు తర్వాత నిర్ణీత సేవలకు ఫీజు వసూలు చేసే అవకాశాలున్నాయి. బయోమెట్రిక్ అప్‌డేట్‌ల కోసం కనీసం రూ.50 నుంచి 100 వరకు వసూలు చేయొచ్చు. ఓ వైపు వర్షాలు, మరో వైపు పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో ముందుగానే అప్​డేట్ చేయించడం మంచిది. వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల కోసం ఆధార్ అప్​డేట్​ తప్పనిసరి అనే నిబంధన పెట్టే అవకాశాలున్నాయి.

మీరు ఆధార్ లాక్ చేశారా? - దుర్వినియోగం కాకుండా వెంటనే ఇలా చేసేయండి!

నేటి నుంచి UIDAI కొత్త నిబంధనలు - ఆధార్​కార్డుల్లో మార్పులు ఇక ఇంటి నుంచే చేసుకోవచ్చు!