బోరింగ్ వ్యాయామాలతో విసిగెత్తిపోతున్నారా? - జుంబా డ్యాన్స్‌తో ఫన్ అండ్ ఫిట్నెస్!
-జిమ్‌కు వెళ్లే పనిలేకుండా ఇంట్లో వర్కౌవుట్స్ - బరువు, ఒత్తిడిని తగ్గించుకోవచ్చట!

Published : October 31, 2025 at 12:17 PM IST
|Updated : October 31, 2025 at 12:34 PM IST
Zumba Dance Benefits: రోజూ జిమ్‌కు వెళ్లడం, వాకింగ్ చేయడాన్ని బోరింగ్‌గా ఫీలయ్యే వారు చాలా మంది ఉంటారు. ఇలాంటి వారికి అటు ఫన్‌తో పాటు ఫిట్నెస్ అందించేందుకు జుంబా సెంటర్లు మంచి వేదికలుగా మారుతున్నాయి. 12 ఏళ్ల చిన్నారుల నుంచి 50 ఏళ్ల గృహిణుల వరకు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. థైరాయిడ్, పీసీఓడీ, అధిక బరువు, తదితర ఇబ్బందులతో బాధపడే మహిళలు జుంబా వ్యాయామంతో నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మహిళలకే ప్రత్యేకమైన జుంబా సెంటర్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మహిళలు అధికంగా ఈ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో జుంబా డ్యాన్స్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం!
ఫన్‌తో ఫిట్నెస్ : జుంబాలో ఫాస్ట్, స్లో డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయి. శరీరంలో ప్రతి అవయవ కండరాన్ని ఈ వ్యాయామం కదిలిస్తుంది. కండరాలను పటిష్ఠం చేస్తుంది. రోజూ ఈ వ్యాయామం చేయడం ద్వారా సామర్థ్యం పెరిగి, నిస్సత్తువ దూరమవుతుందంటున్నారు నిపుణులు. ఈ డ్యాన్స్ సక్రమంగా చేయించేందుకు ఓ సర్టిఫైడ్ మహిళా ట్రైనర్ కూడా ఉంటారని చెబుతున్నారు. శరీరమంతా కదిలేలా, విసుగు చెందకుండా స్టెప్పులు వేయిస్తూ, వ్యాయామం చేయిస్తారని తెలియజేస్తున్నారు. శరీరంలో ఎక్కడ అధిక మోతాదులో కొవ్వు ఉన్నా.. కండరాల బలోపేతం (బాల్ వర్కవుట్), తొడల బలోపేతం(స్టెప్పర్), కోర్ స్ట్రెంగ్త్ వంటి వ్యాయామాలు చేయిస్తారని వివరిస్తున్నారు.
పేపర్ vs స్క్రీన్ - ఎలా చదివితే ఎక్కువ కాలం గుర్తుంటాయి!
జుంబా డ్యాన్స్ గుండె కొవ్వు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. రోజుకు ఒక గంట జుంబా చేస్తే, 300 నుంచి 600 క్యాలరీలను కరిగించవచ్చు. ఏరోబిక్స్ కంటే, జుంబా ద్వారా ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. సాధారణంగా శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ను అందేలా చూసుకోవాలి. జుంబా చేసిన తర్వాత కూల్ డ్రింక్స్, మద్యం, హోం స్ట్రింగ్స్, జంక్ ఫుడ్ తీసుకోకూడదు. ఆహార నియంత్రణపై అవగాహన కలిగి ఉండాలి. అవసరమైతే నిపుణులను సంప్రదించాలి. గుండె, ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు నిపుణుల పర్యవేక్షణలో జుంబా చేయాలి-పి. దర్పిత, డైటీషియన్
ప్రత్యేకంగా డైట్ ఛార్ట్ : అరగంటపాటు జుంబా డ్యాన్స్ చేస్తే క్యాలరీలు కరుగుతాయంటున్నారు నిపుణులు. వీటికి సరిపడా క్యాలరీలు దొరికే డైట్ ఛార్ట్‌ను సెంటర్లోని న్యూట్రిషనిస్ట్ సూచిస్తారని చెబుతున్నారు. జుంబా చేసే సమయంలో కాస్త నీరసానికి గురయినా, బీట్రూట్, క్యారెట్, కీరాతో చేసిన డ్రింక్‌లను తక్షణ శక్తి కింద ఇస్తారని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా, శరీర సామర్థ్యాన్ని బట్టి మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, పండ్లు, బ్రౌన్ రైస్, సీడ్స్ వంటి ఆహారాన్నీ సూచిస్తారు.
ప్రయోజనాలు :
- జుంబా డ్యాన్స్‌తో శ్రమ పడినట్లు తెలియకుండానే శరీరానికి అవసరమైనంత వ్యాయామం అందుతుంది.
- శరీరంలో కొవ్వు పరిమాణం తగ్గి నాజూగ్గా తయారవుతారు.
- శరీరం దృఢంగా, మానసికంగా, ప్రశాంతంగా ఉంటారు.
- కండరాలు పటిష్ఠంగా తయారవుతాయి.
- ఈ డ్యాన్స్‌తో ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.
- పెద్ద పెద్ద బరువులు ఎత్తకుండానే బరువు తగ్గొచ్చు.
- మహిళలు థైరాయిడ్, పీసీఓడీ నుంచి బయటపడొచ్చు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పిల్లలను అతి గారాబం చేస్తున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!
అబ్బాయిలూ పాత్రలు కడుగుతున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

