ETV Bharat / lifestyle

ఉద్యోగంపై ఆసక్తి తగ్గుతోందా? - ఈ టిప్స్ పాటిస్తే బెటర్ అంటున్న ఎక్స్​పర్ట్స్​!

- జాబ్​ బోర్ కొడుతోందా? ​ ఓ సారి ఇలా ప్రయత్నించండి

lost interest in your job
lost interest in your job (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : June 19, 2026 at 11:30 AM IST

3 Min Read
Choose ETV Bharat

What to do when you’ve lost interest in your job : చాలామంది కొత్తగా జాబ్​లో చేరినప్పుడు ఎక్కడలేని ఉత్సాహంతో ఆఫీస్​కు వెళ్తుంటారు. ఎంత పనైనా బోర్ కొట్టకుండా చేస్తుంటారు. కానీ, రోజులు గడిచే కొద్ది కేవలం జీతం కోసమే వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఒకప్పుడు ఎంతో ఇష్టపడి చేరిన ఉద్యోగంలో అనుకున్నంత ఉల్లాసంగా, ఉత్సాహంగా పని చేయలేకపోతుంటారు. ఏదో తెలియని ఒత్తిడి, ఆందోళనకు గురవుతుంటారు. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడచ్చంటున్నారు నిపుణులు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!

కారణాన్ని గుర్తించండి : ఆఫీసులో చేస్తున్న పని మీద ఆసక్తి తగ్గిపోవడానికి మీరు ఏదో విషయంలో ఒత్తిడికి గురవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. లేకుంటే మీరు పని చేస్తున్న రంగం మీద కాకుండా వేరే రంగం మీద ఆసక్తి ఉండడమో కారణం కావచ్చని అంటున్నారు. ఇలాంటప్పుడు అసలు కారణాన్ని తెలుసుకుని, ఆ దిశగా పరిష్కారం కోసం ప్రయత్నించాలని పేర్కొంటున్నారు. సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే ఒక్కొసారి కెరీరే ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మీకు తగ్గట్టుగా మల్చుకోండి : రోజూ రోటీన్ జాబ్ చేస్తున్నామనే భావన కలుగుతోందా? పనిలో ఆసక్తి తగ్గడానికి అదే కారణమని భావిస్తున్నారా.. అయితే, రోజూ చేసే పనినే విభిన్నంగా చేయడానికి ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. అంతకు మించి.. చేస్తున్న పనిలోనే రోజుకో కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ట్రై చేయాలని సూచిస్తున్నారు.

"స్కూల్ టైం" పిల్లల్లోనూ కనిపించని ఒత్తిడి - పేరెంట్స్ బాధ్యతలు తెలుసుకోవాల్సిందే!

అందరితో కలుపుగోలుగా : కొలీగ్స్​తో విభేదాలే ఆఫీసు పనిలో అనాసక్తిని, నిస్పృహను కలిగిస్తున్నట్లయితే.. అలాంటి విభేదాలను సాధ్యమైనంత వరకు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. స్నేహ పూర్వకమైన వాతావరణంలో అందరితో కలుపుగోలుగా ఉంటూ ఉత్సాహంగా పనిచేయాలని సలహా ఇస్తున్నారు.

కష్టపడి పని చేయండి : ఒకవేళ జీతభత్యాలు, పదోన్నతి విషయాల్లో తగిన ప్రతిఫలం అందడం లేదనే భావనే పనిలో అనాసక్తిని కలిగిస్తున్నట్లయితే.. అటువంటప్పుడు ఇంకా కష్టపడి పని చేయడానికి ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. మీకు ఉన్న నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మీకంటూ ఆఫీసులో ఒక గుర్తింపు వస్తుందని తెలియజేస్తున్నారు. అన్ని అంశాల్లోనూ కంపెనీ పురోభివృద్ధిని కోరుకొనే వారినే సంస్థ ప్రోత్సహిస్తుందని గుర్తించుకోవాలట.

వ్యక్తిగత కారణాలు : ఈ క్రమంలో ఏవైనా కుటుంబ, వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతున్నప్పుడు వాటి గురించే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవద్దంటున్నారు నిపుణులు. వాటి ప్రభావం ఆఫీసులో మీ పని మీద పడకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా పని మీద దృష్టి కేంద్రీకరించలేక పదేపదే తప్పులు చేస్తూ ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు.

వాయిదా వేయవద్దు : కొన్ని సందర్భాలలో సరైన ప్లానింగ్ ప్రకారం పని చేయకపోవడం కూడా మీ అనాసక్తికి కారణం కావచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీకిచ్చిన పనిని నిర్ణీత ప్రణాళిక ప్రకారం సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు. అప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉండదని చెబుతున్నారు. పని పైన ఆసక్తి కూడా పెరుగుతుందని తెలియజేస్తున్నారు.

మరో ముఖ్యమైన విషయమేమింటే, పని చేయడానికి బద్ధకం పెంచుకున్నా కూడా వర్క్​ చేయడంలో ఆసక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే పనులను వాయిదా వేయడం, ఆలస్యంగా పనులను ప్రారంభించడం వంటివి చేయకూడదని పేర్కొంటున్నారు.

దాంపత్య బంధానికీ "విశ్రాంతి" అవసరమే! - ఎందుకో తెలుసా?

అందం కోసం ఆ 'మందం' తొలగించాల్సిందే! - మొటిమలకూ అదే కారణమంటున్న నిపుణులు!