ETV Bharat / lifestyle

"పని భారం, ఒత్తిడి"తో అలసిపోతున్నారా? - మీ ప్రాధాన్యతలను మార్చుకోమంటున్నారు నిపుణులు!

మహిళల పని ఒత్తిడికి అసలు కారణం ఇదేనా? - వీటికి చోటివ్వడం మరచిపోకండి!

Women Work Life
Women Work Life (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : June 22, 2026 at 5:24 PM IST

2 Min Read
Choose ETV Bharat

Women Work Life Balance Priority Check : 'రోజులో 17,18 గంటలు పనిచేసినా సంతృప్తి లేదు. ఇక పని భారం ఎక్కువవుతుంది. ఒత్తిడి తట్టుకోలేకున్నా, అవకాశాలు రావడం లేదు' అంటూ ఎన్ని సమస్యలు చెబుతుంటారు మహిళలు. ఇవన్నీ నిజమే కానీ, వీటికి ప్రధాన కారణం మాత్రం సరైన ప్రాధాన్యతల్ని పాటించకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో మీరీ ప్రాధాన్యతల్ని పాటిస్తున్నారో లేదో చెక్ చేసుకోమంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

టైం కేటాయించుకోకపోవడం : లేడికి లేచిందే పరుగు అన్నట్లు రోజులో తమకంటూ అరగంటైనా కేటాయించుకోవడానికి వెనకడుగు వేస్తారు. టైం లేదంటూ సరిపెట్టుకుంటారు. అందుకే చిన్నచిన్న అపజయాలకే కుంగిపోతుంటారు. 'నేనింత కష్టపడుతున్నా ఏం లాభం లేదంటూ' నిట్టూరుస్తుంటారు. దీనికి ప్రధాన కారణం ఆత్మసంతృప్తి లేకపోవడమే అంటున్నారు నిపుణులు. అందుకే, మీకంటూ అరగంటైనా కేటాయించుకుని, తర్వాత రోజుని మొదలుపెడితే ఏ సమస్యా ఉండదని చెబుతున్నారు.

వయస్సు పెరిగే కొద్ది వేధించే చర్మ సమస్యలు - ఇలా చేస్తే సహజంగా తగ్గించుకోవచ్చట!

బాధ్యతలు తీసుకోకపోవడం : చాలామంది ఆడవాళ్లు ఎంత పనైనా చేస్తారు కానీ, నాయకత్వ బాధ్యతలు మాత్రం మాకొద్దు అంటుంటారు. మేం అందుకు అర్హులం కాదు, అదనపు ఒత్తిడి, సహకారం ఉండదు వంటి కారణాలు చెబుతారు. కానీ, అవకాశం వచ్చినప్పుడు బాధ్యతలు తీసుకోవడానికి వెనకాడకూడదని నిపుణులు చెబుతున్నారు. విజయం సాధించడానికి పరిమితుల్ని దాటి ప్రయత్నం చేయాలంటున్నారు.

అంతటితో ఆగిపోవడం : ' నా దగ్గర చాలా డిగ్రీలు ఉన్నాయి. నా ఉద్యోగానికి ఎలాంటి ఢోకా లేదు' అంటూ జాబ్​లో చేరిన కొన్నాళ్లకే కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపనను వదిలేస్తారు. దీనివల్ల తమ కెరీర్​ గ్రోత్​లో వెనకబడిపోతుంటారు. ఈ క్రమంలో రంగమేదైనా నిత్య విద్యార్థిలా ఉండాలంటున్నారు నిపుణులు. కొత్త నైపుణ్యాలు, పుస్తకాలు, అనుభవాలు, శిక్షణలు అందిపుచ్చుకునేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.

వెనకడుగు వేయడం: ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటారు. అవి ఏమాత్రం బెడిసి కొట్టినా తమని తాము నిందించుకుంటారు. కొంతమంది అయితే తమ నిర్ణయాల వల్ల ఎదుటి వాళ్లు ఎక్కడ బాధపడుతారని వెనకడుగు వేస్తుంటారు. అయితే, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం అందరినీ సంతోషపెట్టలేదని తెలుసుకుని ముందడుగు వేయాలంటున్నారు నిపుణులు. మనం చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్లే ధైర్యాన్ని కూడగట్టుకోవడమే విజయానికి తొలిమొట్టుని చెబుతున్నారు.

  • అలాగే, సమతులాహారం, మానసిక ఆరోగ్యం, విశ్రాంతి, సరైన నిద్ర కూడా ఆరోగ్యకర జీవనంలో భాగమేనని మరచిపోకూడదు. రోజులో వీటి ప్రాధాన్యాన్ని తగ్గించకూడదు.
  • డబ్బును సంపదించడమే కాదు, దాన్ని పొదపు - మదుపు చేయడం, పెట్టుబడులు పెట్టడం, భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకోవడం కూడా ముఖ్యమంటున్నారు నిపుణులు.
  • ఈ క్రమంలో లక్ష్యాలు పెట్టుకుని, ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండాలి. చిన్న చిన్న విజయాల్ని కూడా ఆస్వాదించగలిగిన్నప్పుడే ఒత్తిడి, డిప్రెషన్, అసంతృప్తులు మీ దరి చేరవట.

ఉద్యోగంపై ఆసక్తి తగ్గుతోందా? - ఈ టిప్స్ పాటిస్తే బెటర్ అంటున్న ఎక్స్​పర్ట్స్​!

"స్కూల్ టైం" పిల్లల్లోనూ కనిపించని ఒత్తిడి - పేరెంట్స్ బాధ్యతలు తెలుసుకోవాల్సిందే!