అందానికి పసుపు ఫేస్ మాస్క్ - ఇలా వాడితే చర్మ సమస్యలూ పోతాయట!
పసుపు పెడితే మొటిమలు, మచ్చలు మాయం! - ఇంకా ఎన్ని లాభాలో తెలుసా?

Published : June 2, 2026 at 3:48 PM IST
How to use turmeric in skincare routine for glowing skin : పసుపుని శుభానికి సూచికగా, సంప్రదాయానికి ప్రతీకగా మగువలు వాడుతుంటారు. ఇది చర్మ సంరక్షణకు కూడా మంచిదట. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీనివల్ల చర్మం కాంతివంతంగా ఉండటంతో పాటు మొటిమలు తగ్గుతాయట. ఈ క్రమంలో పసుపు చర్మానికి ఎందుకు మంచిది? ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం!
చర్మానికి ఎందుకు మంచిది? : పసుపులోని యాక్టివ్ కాంపౌండ్ అయిన్ కర్క్యుమిన్‌కి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా చర్మం కాంతివంతంగా ఉంటుంది. మొటిమలకు కారణమయ్యే క్యూటీ బ్యాక్టీరియమ్ యాక్నేస్కీ, పిల్లల్లో కనిపించే పుండ్లకు కారణమయ్యే స్ట్రెప్టోకాకస్కూ వ్యతిరేకంగా పోరాడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఇది టైరోసినేస్ అనే ఎంజైమ్నీ నియంత్రిస్తుందట. తద్వారా, పిగ్నెంటేషన్ సమస్య రాదు. అంతేకాదు, పసుపు చర్మకణాలను రక్షించడం ద్వారా వృద్ధాప్య సంకేతాలను నెమ్మదింపజేస్తుంది. పసుపును సుదీర్ఘ కాలం పాటు రాసుకుంటే, వర్ణద్రవ్య మార్పులు, చర్మ ముడతలు, సూర్యరశ్మి (UV కిరణాలు) వల్ల చర్మానికి జరిగే తీవ్రమైన నష్టం, సన్ స్పాట్స్ వంటి చర్మ పరిస్థితుల రూపాన్ని కర్కుమిన్ జెల్ మెరుగుపరుస్తుందని Indian Journal of Dermatology, Venereology and Leprology పేర్కొంది.
ఎండ నుంచి రక్షణ పొందాలంటే - ఎలాంటి రంగు దుస్తులు ధరించాలి?
సహజమైన గ్లో కోసం పసుపు ఫేస్ మాస్క్ :
కావలసిన పదార్థాలు :
- 1 టీ స్పూన్ పసుపుపొడి
- 2 టేబుల్ స్పూన్ల పెరుగు
- 1 టీస్పూన్ తేనె
తయారు చేసే విధానం : వీటన్నింటిని కలిపి మెత్తటి పేస్ట్‌లా చేసి, ముఖానికి సమానంగా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ పై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.
మృదువైన చర్మం కోసం పసుపు స్క్రబ్ : సహజమైన స్క్రబ్ తయారీ కోసం పసుపు పొడి, శనగపిండి, పాలతో కలపండి. దీనిని ముఖంపై 2-3 నిమిషాల పాటు వృత్తాకారంలో మెల్లగా మసాజ్ చేసి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇది చర్మ మృత కణాలను తొలగించడానికి, చర్మ ఛాయను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- పసుపును ముఖానికి అప్లై చేసుకోవడానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు.
- సున్నితమైన చర్మం ఉన్నవారు, పసుపును కలబంద లేదా పెరుగు వంటి చర్మానికి ఉపశమనం కలిగించే పదార్థాలతో కలిపి వాడండి.
- పసుపును దేనితోనూ కలపకుండా నేరుగా చర్మానికి రాయకండి. ఎందుకంటే, ఇది చర్మాన్ని పొడిగా మార్చేస్తుందట.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బ్రేకప్, ఆర్థిక విషయాలను దాచిపెడుతున్నారా? - బంధం చిక్కుల్లో పడినట్లే!
మొటిమలు, నల్ల మచ్చలకు "వేప" ఆయుధమా? - నిపుణులు ఏం చెప్తున్నారంటే!

