ETV Bharat / lifestyle

అందానికి 'పసుపు' నూనె - చర్మం తాజాగా ఉండటంతో పాటు మొటిమలు పోతాయట!

-పసుపు నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు - ఈ నూనెను ఎలా ఉపయోగించాలో తెలుసా?

Turmeric Essential Oil
Turmeric Essential Oil (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : March 30, 2026 at 4:32 PM IST

|

Updated : March 30, 2026 at 5:04 PM IST

2 Min Read
Choose ETV Bharat

Beauty Benefits of Turmeric Essential Oil : సౌందర్య పోషణలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, పసుపు మొక్క వేళ్ల నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు సౌందర్య నిపుణులు. ఈ క్రమంలో ఆ ప్రయోజనాలు ఏంటి? సౌందర్య పోషణలో ఈ నూనెను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం!

చర్మం తాజాగా : కొన్నిసార్లు చర్మం నిర్జీవంగా కనపిస్తుంటుంది. ఇలాంటప్పుడు ఒకటిన్నర చెంచా ఆలివ్ ఆయిల్​లో పసుపు వేళ్ల నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్​ని ఒక చుక్క వేసి బాగా కలుపుకోవాలంటున్నారు నిపుణులు. ఈ మిశ్రమాన్ని చర్మంపై రాసుకుని మృదువుగా మసాజ్​ చేసుకోవాలని చెబుతున్నారు. ఇలా రోజూ రాత్రి పడుకొనే ముందు చేయడం వల్ల అలసిన చర్మం తిరిగి తాజాదనాన్ని సంతరించుకుంటుందని తెలియజేస్తున్నారు. పసుపు, ఆలివ్ నూనెను కలిపి వాడటం వలన మరింత యాంటీ ఇన్​ఫ్లమేటరీ ప్రభావం ఉంటుందని Journal of Pharmaceutical Research International ప్రచురించింది.

మొటిమల నుంచి : పసుపు వేళ్ల నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్​లో యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయంటున్నారు సౌందర్య నిపుణులు. అవి మొటిమలు, మచ్చల్ని దూరం చేస్తాయని పేర్కొంటున్నారు.

'ఆ విషయాలే' క్షణికావేశానికి కారణాలని తెలుసా? - నియంత్రణకు నిపుణులు చెప్తున్న టిప్స్!

వృద్ధాప్య ఛాయలకు చెక్ : ఈ ఎసెన్షియల్ ఆయిల్​లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. దీని కోసం నాలుగు చెంచాల బాదం నూనెలో నాలుగు చుక్కల పసుపు ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలని చెబుతున్నారు. ఈ మిశ్రమాన్ని సన్నని గీతలు, ముడతలు ఉన్న చోట మృదువుగా రుద్దుకోవాలని పేర్కొంటున్నారు. ఈ టిప్స్​ను రోజూ రాత్రి పడుకొనే ముందు పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుందని తెలియజేస్తున్నారు.

ఈ జాగ్రత్తలు : పసుపు మొక్క వేళ్ల నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్​ను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలంటున్నారు సౌందర్య నిపుణులు.

  • ఈ నూనెగా నేరుగా చర్మం లేదా జుట్టుకు రాసుకోకూడదట. కొబ్బరి, బాదం, జొజోబా వంటి నూనెలతో కలిపి మాత్రమే వినియోగించాలంటున్నారు నిపుణులు.
  • అలాగే దీన్ని వీలైనంత తక్కువ మోతాదులోనే ఉపయోగించాలని సూచిస్తున్నారు.
  • ఈ నూనెను ఉపయోగించిన తర్వాత చర్మం చాలా సున్నితంగా తయారవుతుందని పేర్కొంటున్నారు. కాబట్టి, ఎండలోకి వెళ్లే వారు తప్పనిసరిగా సన్​స్క్రీన్ రాసుకోవడం మేలని సలహా ఇస్తున్నారు.

నిపుణుల సలహా మేరకే : ఈ నూనెను వాడే ముందు ఓసారి సౌందర్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిదట. అలాగే, ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే, ఇది అన్ని చర్మతత్వాల వారికి సరిపడక పోవచ్చని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ ఫ్రెండ్ ఇలా ప్రవర్తిస్తుంటే - దూరంగా ఉంటేనే మంచిదంటున్న నిపుణులు!

తెల్ల వెంట్రుకలతో బాధపడుతున్నారా? - ఈ ఇంటి చిట్కాలు పనికొస్తాయట!

Last Updated : March 30, 2026 at 5:04 PM IST