ETV Bharat / lifestyle

ఈ అలవాట్లు మీకు ఉంటే - ఎవరైనా స్నేహితులవుతారట!

మీకు ఎక్కువ మంది ఫ్రెండ్స్​ కావాలా? - పలు సింపుల్ టిప్స్ సూచిస్తున్న నిపుణులు!

Friendship Habits
Friendship Habits (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : November 1, 2025 at 6:44 PM IST

2 Min Read
Choose ETV Bharat

Friendship Habits: బాధైనా, సంతోషమైనా, మనస్ఫూర్తిగా పంచుకునేది ఫ్రెండ్స్​తోనే! అందుకే ప్రతి ఒక్కరి జీవితంలోనూ స్నేహానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అయితే, మన చుట్టూ ఉన్న వారిలో కొంతమంది 'నాకు స్నేహితులే లేరు, నాతో ఎవరూ స్నేహం చేయరు' అంటూ బాధపడుతుంటారు. ఈ క్రమంలో కొన్ని అలవాట్లు చేసుకుంటే చాలు, మీ స్నేహం కోసం అవతలివారే వస్తారంటున్నారు నిపుణులు. మరి, ఆ అలవాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

చిరునవ్వుతో పలకరించండి : మనకు కనిపించిన కొత్త వ్యక్తుల్లో కొంతమంది మనల్ని చూసి నవ్వుతారు. మరికొందరు చూసి కూడా పట్టించుకోనట్లు ఉంటారు. ఇంకొందరు తమ పని మీదే దృష్టి పెడతారు తప్ప పరిసరాల్లో ఏం జరుగుతోందో గమనించరు. అయితే, వీరిలో మనల్ని చూసి చిరునవ్వు నవ్విన వారిని చూడగానే వారిపై ఒక సానుకూల భావన ఏర్పడుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి కొత్త వ్యక్తులైనా చూసీచూడగానే చిరునవ్వుతో వారిని పలకరిస్తే, వాళ్లూ మీతో మాట్లాడడానికి ఆసక్తి చూపుతారని చెబుతున్నారు. అలా చిరునవ్వు చుట్టూ ఉన్న వారిని మనకు చేరువ చేస్తుందని తెలియజేస్తున్నారు. అలాగే, వారి దృష్టిని ఆకర్షించడం వల్ల స్నేహితులను సంపాదించుకోవచ్చని వివరిస్తున్నారు.

జెన్​జీల నయా ట్రెండ్! - ఫన్​తో పాటు ఫిట్​నెస్ కూడా!

అభిరుచులతో : పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం.. ఇలా అభిరుచి ఏదైనా సరే, దానిని వెంటనే ఆచరణలో పెట్టడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో, ఇదే అభిరుచి గల వ్యక్తులను మీతో సమయం గడిపేందుకు ఆహ్వానించామని చెబుతున్నారు. ఫలితంగా, ఇద్దరి మధ్య కమ్యూనికేషన్‌ పెరుగుతూ, ఇద్దరూ మంచి స్నేహితులయ్యే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. అలాగని అవతలి వారి దగ్గర మీకు సంబంధించిన ప్రతి విషయాన్నీ పంచుకోకపోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.

సానుకూల స్పందన : మాములుగా ఎదుటి వ్యక్తి మనతో మాట్లాడేటప్పుడు రకరకాల అంశాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. వాటి గురించి మనం వీలైనంత మేరకు సానుకూలంగానే స్పందించాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే వారికి మనపై సదభిప్రాయం ఏర్పడుతుందని వివరిస్తున్నారు. 'ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్' కదా. ఈ క్రమంలో వారు చర్చించే అంశాన్ని బట్టి మీ స్పందనని వారికి సానుకూలంగానే తెలియజేయడం మేలని అంటున్నారు .

విశ్లేషణా సామర్థ్యం : ఏదైనా ఒక పని చేసేటప్పుడు లేదా నిర్ణయం తీసుకునేటప్పుడు దాని ద్వారా జరిగే మంచి, చెడులను విశ్లేషించుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే దాని వల్ల ఇతరులకు మేలు జరుగుతుందా లేదా కీడు వాటిల్లుతుందా అనే విషయం తెలుస్తుందంటున్నారు నిపుణులు. ఇలా విశ్లేషించగల సామర్థ్యం కూడా పరోక్షంగా ఇతరులతో స్నేహబంధాన్ని పెంచుతుందని చెబుతున్నారు.

నమ్మకం : ఎవరైనా మనకు స్నేహంగా దగ్గరవ్వాలంటే మనపై వారికి నమ్మకమూ ఏర్పడాలి. అవతలివారి ఉద్వేగాలను అర్థం చేసుకోవడంతో పాటు వాటిని బయటపెట్టేయకుండా భద్రంగా మీ దగ్గరే ఉంచుకోవడమూ చాలా ముఖ్యమంటున్నారు.

మీరే మాట్లాడండి : ఎవరితోనైనా స్నేహం ఏర్పరచుకోవాలంటే, మీరే చొరవ తీసుకుని మాట్లాడమని నిపుణులు చెబుతున్నారు. వారిపై మీకున్న సానుకూల అభిప్రాయం గురించి తెలియజేయాలంటున్నారు. అలాగని, ఎదుటి వారిని మెప్పించాలని మీకు నచ్చని పనులు చేయొద్దని వివరిస్తున్నారు. మీ భావాలేవైనా నిజాయతీగా పంచుకోగలిగితేనే స్నేహం చిగురిస్తుందని పేర్కొంటున్నారు.

పిల్లలను అతి గారాబం చేస్తున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

మీ ఇంట్లో డబ్బు, నగలు మాయం అవుతున్నాయా? - వారిని అనుమానించాల్సిందేనట!