భాగస్వామి అలవాట్లతో ఇబ్బంది పడుతున్నారా? - ఇలా డీల్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్!
భాగస్వామి అలవాట్లు మార్చడానికి - నిపుణులు చెప్తున్న అంశాలివే!

Published : May 26, 2026 at 6:22 PM IST
How to Deal with Spouses Most Annoying Habits: మనకి ఉండే కొన్ని అలవాట్ల వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగినప్పుడు వాటిని పూర్తిగా మానుకుంటాం. లేకపోతే, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ క్రమంలో భాగస్వామి విషయంలో ఇలాంటి ఇబ్బంది కలిగించే అలవాట్లు ఉంటే ఏం చేయాలి? అనే ప్రశ్నకు.. వాటి గురించి చర్చించడం మంచిదంటున్నారు నిపుణులు. అయితే, ఇలాంటి విషయాలు మాట్లాడే సమయంలో ఏ మాత్రం మాట తూలినా అది భార్యాభర్తలిద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఇలాంటి అంశాలు చర్చించేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
సున్నితంగా : మీ భాగస్వామిలో మీకు ఇబ్బంది కలిగిస్తున్న అంశం గురించి వారితోనే నెమ్మదిగా చెప్పి చూడమంటున్నారు నిపుణులు. అది మీకు ఎందుకు అంతగా ఇబ్బంది కలిగిస్తోందనే విషయాన్ని వివరించమంటున్నారు. ఇలా సున్నితంగా వారికి నచ్చచెబితే తప్పకుండా వారిలో మార్పు కనిపించే అవకాశం ఉందని సూచిస్తున్నారు. అలాగే, వారి అలవాట్ల వల్ల మీరు ఎంత అసౌకర్యంగా ఫీలవుతున్నారు? ఎందుకు వాటి మీద అంతగా దృష్టి సారిస్తున్నారు? అనే అంశాలను కూడా వారికి సవివరంగా చెప్పాలని సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీకు ఇబ్బంది కలిగించకూడదనే ఆలోచనతో వారిలో మార్పు రావచ్చని పేర్కొంటున్నారు.
గొడవలు తగ్గి భార్యాభర్తల మధ్య బంధం బలపడలా? - ఈ టిప్స్ పనికొస్తాయంటున్న నిపుణులు!
తగిన సలహాలివ్వండి : ఎప్పటి నుంచో ఉన్న అలవాటుని మార్చుకోవడానికో లేదా పూర్తిగా మానుకోవడానికో కాస్త సమయం పట్టవచ్చు. ఈ క్రమంలో మీరు వారిని ప్రోత్సహించేలా అందుకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వమంటున్నారు నిపుణులు. ఆ అలవాటు మానుకోవడం వల్ల వారికి కలిగే ప్రయోజనాల గురించి సానుకూలంగా వివరించే ప్రయత్నం చేయమని తెలియజేస్తున్నారు. ఫలితంగా వారిలో ఎంతో కొంత మార్పు వస్తుందని చెబుతున్నారు.
హామీ ఇవ్వాలి : జీవిత భాగస్వామితో ఇలాంటి అలవాట్ల గురించి చర్చించే క్రమంలో మీకు ఉండే ఇబ్బందికరమైన అలవాట్ల గురించి ప్రస్తావన రావొచ్చంటున్నారు. అలాంటప్పుడు మీరు వాటిని నెగిటివ్గా భావించకుండా మీ అలవాట్ల వల్ల వారికి ఏ విధంగా ఇబ్బంది కలుగుతోందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలని నిపుణులు అంటున్నారు. అలాగే, భవిష్యత్తులో అటువంటి ఇబ్బందులు పెట్టకుండా జాగ్రత్తపడతాననే హామీని వారికి ఇవ్వమని పేర్కొంటున్నారు. ఇలా చేయడం ద్వారా వారు కూడా వారికి ఉన్న అలవాట్లను మార్చుకోవడానికో లేదా పూర్తిగా మానుకోవడానికో ప్రయత్నిస్తారని తెలియజేస్తున్నారు. భార్యాభర్తల్లో ఏ ఒక్కరు సలహాలు, సూచనలు ఇచ్చినా మరొకరు మనస్ఫూర్తిగా స్వాగతించేందుకు సన్నద్ధంగా ఉంటేనే.. ఆ కాపురం సంతోషంగా ముందుకు సాగుతుందని సూచిస్తున్నారు.
'అమ్మమ్మ'లా కనిపిస్తున్నారా? - "మీ వయస్సును దాచేసే ఫుడ్"పై నిపుణుల సూచనలు
టీనేజ్ అమ్మాయిలకు - పేరెంట్స్ ఈ విషయాలు అర్థమయ్యేలా చెప్పాలట!

