వంట నూనెను తగ్గిద్దామిలా! - పలు సింపుల్ టిప్స్ సూచిస్తున్న ఎక్స్పర్ట్స్!!
నూనెతోనే మన ఆరోగ్యం - వంటకు ఏ నూనె వాడాలో మీకు తెలుసా?

Published : May 27, 2026 at 3:27 PM IST
Tips for Consuming Cooking Oils : సాధారణంగా అందరూ ఆరోగ్యకరమైన ఆహారం గురించే ఆలోచిస్తారు. కానీ, హెల్దీ కుకింగ్ గురించి మాత్రం పట్టించుకోరు. ఈ క్రమంలో ఆరోగ్యకరంగా ఆహారం వండడంలో నూనె వాడకం కీలక పాత్ర పోషిస్తుంది. మామూలుగా వంటల్లో నూనె కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దీంతో మనకు తెలియకుండానే తీసుకునే ఈ నూనె వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. అందుకే, నూనె వాడకానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!
నూనె తక్కువ/లేని వంటలు ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలిసిందే. కానీ, వంటకానికి మంచి రుచి కావాలంటే మాత్రం గిన్నెలో నూనె వేయాల్సిందే. అయితే, నూనెను ఎలా పడితే అలా నీళ్లలా వాడితే మాత్రం దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఆయిల్ వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రుచికరమైన ఆహారంతో పాటు ఆరోగ్యమూ సొంతమవుతుందని సూచిస్తున్నారు.
'అమ్మమ్మ'లా కనిపిస్తున్నారా? - "మీ వయస్సును దాచేసే ఫుడ్"పై నిపుణుల సూచనలు
నూనెను తగ్గిద్దామిలా :
- వేపుళ్ల బదులు బేకింగ్, స్టీమింగ్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. దీంతో ఆయా పోషకాలు శరీరానికి సమృద్ధిగా అందుతాయి.
- ఫ్రైడ్ స్నాక్స్‌కి బదులు స్టీమ్ చేసిన స్నాక్స్‌ను తీసుకుంటే ఆరోగ్యానికి మేలు.
- ఆయిల్ కాస్త తక్కువగా వాడేవారు, వంటలో పొరపాటున కాస్త ఎక్కువైతే తినడానికి ఇబ్బంది పడతారు. ఇలాంటప్పుడు నూనెను కొలత ప్రకారం వాడుకోవడమే మంచిదట. ఈ క్రమంలో బాటిల్లో నుంచి నూనెను పోసే బదులు మెజరింగ్ స్పూన్ లాంటి వాటితో వేయాలి. అప్పుడు ఎంత నూనె వాడుతున్నామో అర్థమవుతుంది.
- ఎప్పుడూ ఒకే రకమైన నూనెను వాడకుండా, కాంబినేషన్ ఆయిల్స్‌ను వాడితే మంచిది. ముఖ్యంగా, రైస్ బ్రాన్, నువ్వులు, సన్‌ఫ్లవర్, వేరుశనగ వంటి నూనెల్లో ఉండే మోనోశ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్ శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరానికి చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, మన బాడీ వాటిని స్వయంగా తయారు చేసుకోలేదట. వంట నూనె ద్వారానే అవి శరీరానికి అందుతాయని తెలియజేస్తున్నారు. అందుకే, వేర్వేరు నూనెల్ని కలిపి వాడుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.
- ఆయిల్ వినియోగానికి సంబంధించి నెలకు ఎంత వాడుతున్నామో ఒక లెక్క వేసి చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే, ఒక అవగాహన వస్తుందట. దీన్ని బట్టి అవసరం అనుకుంటే నూనె వాడకాన్ని తగ్గించుకోవచ్చు.
- వేపుళ్లకి వాడిన నూనెని మళ్లీ వేయించడానికి వినియోగించకూడదు. ఇలా వాడిన నూనె వల్ల శరీరంలోకి టాక్సిన్స్ చేరే ప్రమాదం ఉంది.
ఇవి కూడా :
- వంట నూనెను ఎక్కువసేపు వేడి చేస్తే అందులో ఉండే పోషకాలు శరీరానికి అందే అవకాశం తక్కువ. అంతేకాదు, ఒకసారి వాడిన ఆయిల్ ఎక్కువ సార్లు ఉపయోగించకూడదు.
- ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒకసారి వాడిన నూనెలో తాజా నూనెను కలపకూడదు.
- ఆయిల్‌ను వేడి చేసినప్పుడు దాని ఉష్ణోగ్రత కూడా మారుతుంది. ఏ టెంపరేచర్ వద్ద నూనె పొగ రావడం మొదలవుతుందో దానిని స్మోకింగ్ పాయింట్ అంటారు. దీనిపై కొంచెం అయినా అవగాహన కలిగి ఉండాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా, డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం వస్తే ఎక్కువ స్మోకింగ్ పాయింట్ ఉన్న నూనెలను మాత్రమే వాడాలి.
- కూకింగ్ ఆయిల్‌పై సూర్యరశ్మి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే, నేరుగా ఎండ పడడం వల్ల నూనెలో కొన్ని రసాయన మార్పులు జరిగే అవకాశం ఉందట.
- అలాగే, వంటనూనెను కొనే ముందు అందులో ఉన్న ఫ్యాట్ శాతం చూసి మరీ కొనాలి. నిర్ణీత మోతాదు కన్నా ఎక్కువ ఉండే ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భాగస్వామి అలవాట్లతో ఇబ్బంది పడుతున్నారా? - ఇలా డీల్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్!
'మనసుంటే మార్గం ఉంటుంది బ్రో' - సక్సెస్ఫుల్ కెరీర్ షార్ట్ కట్స్ ఇవే!

