ETV Bharat / lifestyle

ముఖంపై మొటిమలకు మీరే కారణం? - మీ పక్కనే ఎంతో మంది శత్రువులు!

మొటిమల సమస్య వేధిస్తోందా? - ఈ జాగ్రత్తలు పాటించాలట!ఒ

మొటిమల సమస్య
మొటిమల సమస్య (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : August 27, 2026 at 4:35 PM IST

2 Min Read
Choose ETV Bharat

Daily Habits that Help Prevent Pimples : కొంతమంది ముఖంపై ఎంత వెతికినా ఒక్క మొటిమైనా కనిపించదు. మేకప్ వేసుకోకుండానే న్యాచురల్ బ్యూటీస్​గా కనిపించేస్తుంటారు. ఇలాంటి వాళ్లను చూడగానే, అందం కోసం ఎన్నెన్ని సౌందర్య చికిత్సలు తీసుకుంటారో అనిపిస్తుంటుంది. వాస్తవానికి, ఈ మహిమంతా చికిత్సలు, చిట్కాల్లో కాదు, వారు పాటించే రోజువారీ అలవాట్లలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

రాత్రి పడుకునే ముందు : సరిగా ముఖాన్ని శుభ్రం చేసుకోకపోవడం కూడా మొటిమలు రావడానికి ప్రధాన కారణం. ప్రత్యేకించి చెమట పట్టినప్పుడు, రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా ఫేస్​ని క్లీన్ చేసుకోవాలి. ఫలితంగా, ముఖంపై దుమ్ము, జిడ్డుదనం తొలగిపోయి చర్మ రంధ్రాలు మూసుకుపోవని, తద్వారా మొటిమలూ ఏర్పడవని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ క్రమంలో చర్మతత్వానికి సరిపడే ఫేస్​వాష్​ను ఎంచుకోవడమూ ముఖ్యం. పడుకునే ముందు ముఖం కడుక్కోవడం వల్ల రోజంతా పేరుకుపోయిన పర్యావరణ కాలుష్యం, మేకప్, ఆక్సీకరణం చెందిన కొవ్వులు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు

ఏడ్చినపుడు శరీరంలో ఏం జరుగుతుంది? - పరిశోధనల్లో ఆసక్తికర అంశాలు వెలుగులోకి!

ఫోన్ స్క్రీన్ వల్ల : టాయిలెట్ సీటు కంటే మొబైల్ స్క్రీన్ ఎక్కువ అపరిశుభ్రంగా ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఫోన్​ మాట్లాడేటప్పుడు, మొబైల్​ను తాకిన చేతులతోనే ముఖాన్ని ముట్టుకోవడం వల్ల ఈ క్రిములు ముఖం పైకి చేరి మొటిమలకు కారణమవుతాయని తేలింది. ఈ సమస్య దరిచేరకుండా, ఫోన్​ స్క్రీన్​ను ఎప్పటికప్పుడు శానిటైజర్​తో శుభ్రం చేసుకోవడం తప్పనిసరిని నిపుణులు సూచిస్తున్నారు.

చేతుల మురికి వల్ల కూడా : చేతుల్ని పదే పదే ముఖానికి తాకించే అలవాటు కొంతమందికి ఉంటుంది. ఫలితంగా, చేతులకున్న క్రిములు, మురికి ముఖం పైకి చేరి మొటిమలకు కారణమవుతాయి. అందుకే, ముఖం కడుక్కునేటప్పుడు తప్ప అసలు చేతుల్ని ముఖానికి తాకించకుండా జాగ్రత్తపడాలి. వేళ్లపై ఉండే మురికి, నూనెలు, ఇతర మలినాలు రంధ్రాలు మూసుకుపోవడం, మొటిమలు వంటి సమస్యలకు దారితీయవచ్చు.

పిల్లో కవర్స్ : రోజూ వాడే క్రమంలో మన చర్మం, జుట్టు కుదుళ్లలో ఉన్న జిడ్డు దిండు కవర్ల పైకి చేరుతుంది. అది వాతావరణంలోని ధూళి, దుమ్మును ఆకర్షిస్తుంది. ఈ అపరిశుభ్రమైన దిండ్లనే ఎక్కువ రోజులు వాడడం, ఇతరులు వీటిని ఉపయోగించడం వల్ల ముఖంపై మొటిమలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, వారానికోసారైనా దిండ్ల కవర్లను మార్చుకోవడం, ఎవరి దిండు వారే వాడుకోవడం మేలు.

ఆహార అలవాట్లు : మొటిమల బాధ లేకుండా ఉండాలంటే, రోజువారీ తీసుకునే ఆహారం విషయంలోనూ కచ్చితంగా వ్యవహరించాలి. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన ఆహారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

అధిక బరువు వల్ల : కొంతమందిలో అధిక బరువూ మొటిమల సమస్యకు దారి తీసే అవకాశం ఉంది. ఇలాంటి వారి శరీరంలో ఆండ్రోజెన్లు, ఇన్సులిన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మొటిమలు రావడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల ఆరోగ్యమే కాదు, అందం కూడా దరి చేరుతుందని అంటున్నారు.

పరిశోధన మూలాలు :

https://health.clevelandclinic.org/how-to-stop-touching-your-face

https://pubmed.ncbi.nlm.nih.gov/19209947/

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

భార్యాభర్తల మధ్య బంధం బలపడలా? - ఈ టిప్స్​ పనికొస్తాయంటున్న నిపుణులు!

మొదటిసారి 'మేకప్' వేసుకుంటున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే బెటర్ అంటున్న ఎక్స్​పర్ట్స్​!