ETV Bharat / lifestyle

సబ్జా గింజలు ఆరోగ్యానికే కాదు - అందానికీ మంచివట! - ఎలానో తెలుసా?

-సబ్జా గింజల్లో ఎన్నో పోషకాలు - ఇవి అందంతో పాటు కురుల ఆరోగ్యానికి మంచి పరిష్కరం అంటున్న నిపుణులు!

Sabja Seeds
Sabja Seeds (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : November 16, 2025 at 2:40 PM IST

2 Min Read
Choose ETV Bharat

Beauty Benefits of Sabja Seeds: యవ్వనంగా కనిపించాలని, అందంగా మెరిసిపోవాలని అమ్మాయిలు ఆరాటపడుతుంటారు​. ఈ క్రమంలో కొంతమంది ఇంట్లో లభించే పదార్థాలతో ఫేస్ ప్యాక్​లు తయారు చేసుకుంటారు. మరికొందరు బ్యూటీ పార్లర్లకు వెళుతుంటారు. అయితే, పార్లర్​కు వెళ్లే పని లేకుండా సహజంగానే అందాన్ని పెంపొందించుకోవాలంటే సబ్జా గింజలను ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు సౌందర్య నిపుణులు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగానే కాదు, సౌందర్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

డీటాక్సిఫికేషన్ : పర్యావరణ కాలుష్యం కారణంగా, చర్మం కాంతిని కోల్పోతుంది. దుమ్ము, ధూళి ప్రభావం వల్ల చర్మంపై మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో చర్మాన్ని లోలోపలి నుంచి శుభ్రం చేయాలంటే సబ్జా గింజలు అందుకు సరైన ఎంపికని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే సహజ డీటాక్స్ గుణాలు చర్మం లోపలి పొరల్లో చేరిన టాక్సిన్లను బయటకు పంపిస్తాయని అంటున్నారు. దీనివల్ల సౌందర్య సమస్యలు తగ్గి చర్మం మెరుపును సంతరించుకుంటుందని పేర్కొంటున్నారు.

ఇంట్లో కూడా కాలుష్యంతో ఇబ్బందిపడుతున్నారా? - ఈ టిప్స్​ పాటిస్తే బెటర్​ అంటున్న నిపుణులు!

ఇన్ఫెక్షన్లు రాకుండా : కొంతమందిలో చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటివారు క్రమం తప్పకుండా సబ్జా గింజలను ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు చర్మ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతాయని International Journal of Pharmaceutical Sciences ప్రచురించింది.

ముడతలు పడకుండా : కొంతమందికి చిన్నవయస్సులో చర్మం ముడతలు పడుతుంటుంది. అయితే ఇలా కనిపించకుండా ఉండటం కోసం చాలా మంది యాంటీ ఏజింగ్ క్రీమ్​ లాంటివి వాడుతుంటారు. కానీ ఈ సమస్యకు సబ్జా గింజలు మేలంటున్నారు నిపుణులు. వీటితో తయారు చేసిన ఫేస్‌ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో చెంచా కొబ్బరి నూనెలో సరిపడినంత సబ్జా గింజల పొడిని కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరిపోతుందని తెలియజేస్తున్నారు.

కురులు దృఢంగా : సబ్జా గింజలు చర్మానికే కాదు జుట్టుకు కూడా మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. దీనిలో ఉండే విటమిన్ 'కె', బీటా కెరోటిన్, ప్రొటీన్లు అనేవి వెంట్రుకలు, కుదుళ్లు దృఢంగా మారేలా చేస్తాయంటున్నారు. అలాగే ఇవి కురులకు పోషణను అందించి పట్టులా, మృదువుగా మారేలా చేస్తాయని తెలియజేస్తున్నారు. సబ్జా గింజలను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే జుట్టు రాలే సమస్య నుంచి కూడా విముక్తి పొందచ్చని సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సబ్జా గింజలు సహజసిద్ధమైనవే అయినా కొంతమందికి పడకపోవచ్చని, అందువల్ల ఒకసారి వాడి చూసి ఎలాంటి సమస్యలూ లేవనుకున్నప్పుడే కొనసాగించడం మంచిదని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ పిల్లలు స్వతంత్రంగా ఎదగాలంటే - "ఫాఫో" పేరెంటింగ్ పాటించాలట!

పిల్లలు దేనికి బాధపడుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే​ బెటర్​ అంటున్న నిపుణులు!