ETV Bharat / lifestyle

విటమిన్ 'సి'తో అందంగా ఉంటారట! - సౌందర్య లేపనాల కన్నా ఇదే మేలంటున్న నిపుణులు!!

విటమిన్ 'సి' తోనే నింగారింపు - చర్మంలోని అన్ని పొరల్లోకి ఇది చొచ్చుకెళుతున్నట్టు తొలిసారిగా నిర్ధారణ

Vitamin C Food
Vitamin C Food (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : January 6, 2026 at 2:51 PM IST

3 Min Read
Choose ETV Bharat

Vitamin C Important for Skin Health : యవ్వనంగా కనిపించాలని, అందంగా మెరిసిపోవాలని మగువలు ఆరాటపడుతుంటారు​. అందంగా కనిపించాలని ప్రతి రోజు ఏదో ఒక రూపంలో సౌందర్య ఉత్పత్తులు వినియోగిస్తుంటారు. కొందరు ఇంట్లో లభించే పదార్థాలను వాడితే, మరికొందరు బ్యూటీ పార్లర్లకు వెళుతుంటారు. అయితే, పార్లర్​కు వెళ్లే పని లేకుండా సహజంగానే అందాన్ని పెంపొందించుకోవాలంటే విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలంటున్నారు పరిశోధకులు. తద్వారా ఆరోగ్యపరంగానే కాదు, సౌందర్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

శరీరానికి సహజసిద్ధ రక్షణ కవచం చర్మం. రోజూ వాతావరణ కాలుష్యం, ఎండ, గాలి కారణంగా ఈ కవచం దెబ్బ తింటుంటుంది. దాని పరిరక్షణలో కొలాజెన్ కీలకం. ఇది చర్మానికి సాగే గుణాన్ని, దృఢత్వాన్ని, తేమను కాపాడుకునే లక్షణాన్ని అందిస్తుంది. ముడతలు పడటం వంటి వాటిని తగ్గిస్తుంది. చర్మ సహజసిద్ధ పునరుజ్జీవన సామర్థ్యాన్ని ఇనుమడింపచేస్తుంది. తీవ్ర సూర్యకాంతి వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది.

చలికాలంలో సన్‌స్క్రీన్ మానేస్తున్నారా? - నిపుణుల కీలక సూచనలివే!

Vitamin C Food
Vitamin C Food (Getty Images)

విటమిన్ సి : చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో సి విటమిన్ పాత్ర కీలకం, అందువల్ల సౌందర్య లేపనాల్లో దీన్ని విరివిగా వాడుతుంటారు. అయితే, దీన్ని స్కిన్ కేర్ ఉత్పత్తుల ద్వారా పొందడం కన్నా, ఆహారం ద్వారా తీసుకుంటే మెరుగైన ఫలితాన్ని పొందొచ్చంటున్నారు నిపుణులు. దీంతో అది రక్త ప్రవాహంలో కలిసి, చర్మంలోని ప్రతి పొరనూ చేరుతుందని చెబుతున్నారు. దీనివల్ల చర్మంలో కొలాజన్ వృద్ధి చెంది, నిగారింపు పెరుగుతుందని పేర్కొంటున్నారు. చర్మం పలుచబడే సమస్య తగ్గుతుందన్నారు. విటమిన్ సి మన చర్మంలో వర్ణద్రవ్యం ఉత్పత్తిని నిరోధించడం ద్వారా నల్ల మచ్చల రూపాన్ని తగ్గిస్తుందని Harvard Health Publishing అధ్యయనం పేర్కొంది.

Vitamin C Fruits
Vitamin C Fruits (Getty Images)

'సి'లోనే ఉంది : కొలాజన్ ఉత్పత్తికి విటమిన్ సి చాలా అవసరం. ఇది ప్రాలిల్ హైడ్రాక్సిలేజ్, లైజిల్ హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్​లను బలమైన కొలాజన్ ఆకృతులను ఏర్పరిచేలా వీలు కల్పిస్తుంది. అందువల్లే చర్మపరిరక్షణ ఉత్పత్తుల్లో దీన్ని జోడిస్తుంటారు. అయితే, ఇది నీటిలో సులువుగా కరిగిపోతుంటుంది. అంతేకాదు, చర్మం వెలుపలి పొర ద్వారా అంత సులువుగా లోపలికి చొచ్చుకెళ్లలేదు. ఈ క్రమంలో న్యూజిలాండ్​లోని ఒటాగో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చర్మం-సి విటమిన్ తీరుతెన్నులపై పరిశోధన చేశారు. ఇందులో భాగంగా 24 మంది ఆరోగ్యవంతులను పరిశీలించారు. వారికి విటమిన్ సి పుష్కలంగా ఉండే ఒకరకంగా కివీ పండును రోజుకు రెండు చొప్పున ఇచ్చారు. ఇది 250 మైక్రోగ్రాముల సి విటమిన్​ను తీసుకోవడంతో సమానం. 8 వారాల పాటు దీన్ని కొనసాగించారు. ఈ క్రమంలో వారి చర్మంలోని సి విటమిన్ స్థాయిని పరిశీలించారు. చర్మం మందం, సాగే గుణం, అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ సామర్థ్యం, పైపొరలోని కణాల పునరుజ్జీవనం వంటి అంశాలపైనా దృష్టి సారించారు.

  • చర్మం, రక్తంలోని సి విటమిన్ పరిమాణాలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. సి విటమిన్ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తంతో పాటు చర్మంలోనూ ఈ విటమిన్ పరిమాణం పెరుగుతుందని వెల్లడైంది. దానికి తగ్గట్టే కొలాజన్ ఉత్పత్తి, వెలుపలి చర్మపొర పునరుజ్జీవనానికి దోహదపడినట్లు వివరించింది.
  • రక్తం, చర్మంలోని సి విటమిన్​ల పరిమాణం దాదాపు ఒకేలా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చర్మంలోని అన్ని పొరల్లోకి ఇది చొచ్చుకెళుతున్నట్లు తొలిసారిగా వారు రుజువు చేశారు. రక్త ప్రసరణ ద్వారా వచ్చే సి విటమిన్​ను శోషించుకోవడంలో చర్మకణాలు చాలా సమర్థంగా వ్యవహరిస్తున్నట్లు తేలింది.
vitamin c in skin health
vitamin c in skin health (Getty Images)

సరిపడా అవసరం : రక్తంలో స్థిరంగా సి విటమిన్ (Vitamin C) స్థాయి ఉండేలా చూడటం చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎందుకంటే, ఈ విటమిన్​ను శరీరం ఎక్కువ కాలం నిల్వ చేసుకోదని వారు పేర్కొన్నారు. ఆరోగ్యవంతులు రోజుకు 250 mg మేర తీసుకుంటే రక్తంలో సరిపడా సి విటమిన్ స్థాయి ఉంటుందని చెప్పారు. తాజా పండ్లు, కూరగాయలు, బెర్రీలు, క్యాప్సికమ్​లు, బ్రకోలీలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? - బెస్ట్ టిప్స్​ సూచిస్తున్న నిపుణులు

మాయిశ్చరైజర్లన్నీ మంచివి కావు! - చర్మంపై ప్రభావం చూపుతాయంటున్న నిపుణులు!