ETV Bharat / lifestyle

చలికాలంలో బాల్కనీలో మొక్కలు జాగ్రత్త! - ఆరోగ్యంగా ఉండాలంటే టిప్స్ సూచిస్తున్న నిపుణులు!

బాల్కనీ, కుండీల్లో మొక్కలు పెంచుతున్నారా? - సింపుల్ టిప్స్ సూచిస్తున్న నిపుణులు!

Plants at Home
Plants at Home (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : November 17, 2025 at 4:42 PM IST

3 Min Read
Choose ETV Bharat

Problems and Solutions for Plants at Home : గృహిణులే కాదు! ఈ తరం అమ్మాయిలూ మొక్కల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు. బాల్కనీ, టెర్రస్, మిద్దె తోటలు అంటూ ఎక్కడ చిన్న ఖాళీ స్థలం కనిపించినా మొక్కల్ని పెంచేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆసక్తి సరే, కాలాన్ని బట్టి మొక్కల సంరక్షణలోనూ మార్పులు చేయాలంటున్నారు. ఎందుకంటే, కాలంతో వచ్చే మార్పుల వల్ల మనమే కాదు, మొక్కలూ ఇబ్బంది పడతాయని చెబుతున్నారు. వాటిని గుర్తించి సమస్యను నివారించడం మీద దృష్టిపెడితే, ఇంటి తోట అందంగా, ఆరోగ్యంగా ఉంటుందని సూచిస్తున్నారు. ఈ క్రమంలో శీతకాలంలో మొక్కల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం!

త్వరగా పెరగాలంటే : మొక్కల చుట్టూ ఎండిపోయిన కొమ్మల్ని, పండిన ఆకుల్ని తీసివేయాలి. అంతేకాకుండా, మొక్క మొదళ్లలో ఉండే మట్టిని వదులు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొక్క వేర్లకు గాలి తగిలి బాగా పెరుగుతాయని చెబుతున్నారు. అలాగే, ఎప్పుటికప్పుడు మట్టిని సారవంతం చేసుకుంటూ ఉండాలని, దీనికోసం వర్మీ కంపోస్ట్, కోకోపీట్ వంటివి కలిపి కుండీలో మొక్క మొదళ్లను గుల్ల చేసి వేయాలని సూచిస్తున్నారు. దీంతో పోషకాలు బాగా అంది మొక్కలు త్వరగా పెరుగుతాయని తెలియజేస్తున్నారు.

ఇంట్లో కూడా కాలుష్యంతో ఇబ్బందిపడుతున్నారా? - ఈ టిప్స్​ పాటిస్తే బెటర్​ అంటున్న నిపుణులు!

Plants
మొక్కలు (Getty Images)

నేల అనువుగా : శీతకాలంలో విత్తనాలు సరిగ్గా మొలకెత్తవు. మొక్కలు నాటిన త్వరగా పెరగవు. అందుకే నేరుగా మట్టిలో కాకుండా సీడ్ బాక్స్​ల్లో వేసి కాస్త వెచ్చగా ఉండే ప్రదేశంలో పెట్టాలంటున్నారు నిపుణులు. అవి మొలకెత్తిన తర్వాత వాటిని కుండీలు లేదా మట్టిలో నాటుకుంటే సరిపోతుందని సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని మొక్కలకీ ఒకే రకమైన నేల అనువుగా ఉండకపోవచ్చని, కొన్ని కుండీల్లో పెరిగితే మరికొన్ని నేలలో పెరుగుతాయని చెబుతున్నారు. మొక్కల్ని బట్టి మట్టి, పెంచే స్థలాన్నీ ఎంచుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే మొక్కలు ఆరోగ్యంగా త్వరగానూ పెరుగుతాయని వివరిస్తున్నారు.

తెగులు నివారణకు : సాధారణంగా కాలాన్ని బట్టి మొక్కలకు కొన్ని రకాల తెగులు సోకుతుంటాయి. వాటిని గుర్తించి సమస్యను నివారించాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా, చలికాలంలో గులాబీ, జినియా, బెగోనియా, మందారంతో పాటు టొమాటో, దోస వంటి మొక్కల్లో బూడిద తెగులు ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు. దీన్ని నివారించడానికి 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, అర టీ స్పూన్ డిష్ సోప్, లీటరు నీరు కలిపి వారానికి రెండు సార్లు మొక్క తడిచేలా స్ప్రే చేస్తే సరిపోతుందంటున్నారు. అలాగే, ఇంటితోటలో పెంచే ఆకుకూరలతోపాటు ముల్లంగి, క్యారెట్, పూల మొక్కలైన మందారం, గులాబీ వంటి వాటిపైనా ఆకుతొలుచు పురుగు ఆశిస్తుందని చెబుతున్నారు. అలాగే, ఇండోర్ ప్లాంట్స్ కూడా వీటి ప్రభావానికి గురవుతాయంటున్నారు. ఈ క్రమంలో వెల్లుల్లి కషాయం చల్లడం ద్వారా దీన్ని నివారించవచ్చని తెలియజేస్తున్నారు.

Plants
మొక్కలు (Getty Images)

ఇలా చేస్తే : శీతకాలంలో బయటి చలి వాతావరణాన్ని తట్టుకోలేవంటూ కొన్ని మొక్కల్ని ఇంటి లోపల పెడతాం. ముఖ్యంగా టొమాటో, మెంతికూర, గులాబీ, మందార, మల్లె వంటి వాటిని ఏసీ వార్మ్​మోడ్, హీటర్ ఉన్న గదుల్లో కానీ, తక్కువ వెంటిలేషన్ ఉన్నా, గాలి ప్రసరించనంత దగ్గరగా పెట్టినా ఎర్రనల్లి సమస్య వస్తుందంటున్నారు నిపుణులు. ఈ ఇబ్బందిని తగ్గించడానికి మొక్కల అడుగు భాగంలో ఉండే ట్రేలో గులకరాళ్లు వేయాలని చెబుతున్నారు. నీళ్లను గాల్లోకి స్ప్రే చేసి ఆ వాతావరణంలో తేమ పెంచాలని తెలియజేస్తున్నారు. ఆకుల వెనక భాగంలో ఉన్న గుడ్లను, ఆకు తీసేసి పారేయడం ద్వారా లేదా గోరువెచ్చని నీళ్లల్లో కాస్త లిక్విడ్ సోప్, వేపనూనె కలిపి స్ప్రే చేయడం ద్వారా పోగొట్టొచ్చని వివరిస్తున్నారు. దీంతో మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుందని పేర్కొంటున్నారు.

మీ పిల్లలు స్వతంత్రంగా ఎదగాలంటే - "ఫాఫో" పేరెంటింగ్ పాటించాలట!

పిల్లలు దేనికి బాధపడుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే​ బెటర్​ అంటున్న నిపుణులు!