దంపతుల మధ్య "పిల్లో టాక్" - అన్యోనతను పెంచే అద్భుతమైన టానిక్!
దంపతుల మధ్య హెల్దీ బాండింగ్ టిప్స్ - ఇలా చేస్తే ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు

Published : June 3, 2026 at 3:36 PM IST
What is Pillow Talk in Relationships : భార్యభర్తల మధ్య ఎంత పారదర్శకత ఉంటే వారి అనుబంధం అంత దృఢంగా మారుతుంది. ఇందులో మారో మాటకు తావు లేదు. వారిద్దరి మధ్య జరిగే సంభాషణకూ ఇది వర్తిస్తుంది. అయితే, సాధారణ సమయాల్లో దంపతులిద్దరూ ఎన్ని విషయాల గురించి మాట్లాడుకున్నా, మనసు విప్పి మాట్లాడుకునేది మాత్రం పడక గదిలోనే ఎక్కువట. ఏకాంత సమయంలో ప్రేమగా ఒకరి కళ్లలోకి మరొకరు చూస్తూ మాట్లాడుకోవడాన్నే 'పిల్లో టాక్' అని పిలుస్తారు. ఈ క్రమంలో దీనివల్ల దాంపత్య బంధంలో అనేక ప్రయోజనాలు చేకూరతాయని రిలేషన్‌షిప్ నిపుణులు చెబుతున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
వారి మనసును చదివేయచ్చు : పెళ్లై ఏళ్లు గడుస్తున్నా దంపతులిద్దరూ ఒకరి గురించి మరొకరు ఎన్ని విషయాలు తెలుసుకున్నా, ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు చాలానే ఉంటాయి. సాధారణ సమయాల్లో వీటన్నింటి గురించి చర్చించేంత సమయం ఉండకపోవచ్చు. సందర్భము రాకపోవచ్చు. కానీ, రాత్రి పడకగదిలో భార్యభర్తల మధ్య దొరికే ఏకాంతం వీటన్నిటి గురించి నిర్మోహమాటంగా బయట పెట్టే చనువును అందిస్తుంది. పడక గదిలో మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల భాగస్వామి మనసును చదివేయొచ్చు. రోజంతా ఆఫీస్ ఇంటి పనులతో క్షణం తీరిక ఉండదు. మరోవైపు పిల్లలు, ఇతర కుటుంబ బాధ్యతల్లో పడిపోయి మనల్ని మనమే నిర్లక్ష్యం చేస్తుంటాం. కాస్తంత సమయమే దొరకడమే గగనం అనుకునే ఇలాంటి బిజి షెడ్యూల్ వల్ల తలెత్తే ఒత్తిడి, ఆందోళనలు చాలా మందికి అనుభవమే. వీటివల్ల చాలామంది భార్యభర్తలు లైంగిక జీవితానికి దూరమవుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, ఇలాంటి సమస్యలు పిల్లో టాక్తో చక్కగా దూరమవుతాయంటున్నారు నిపుణులు.
బ్రేకప్, ఆర్థిక విషయాలను దాచిపెడుతున్నారా? - బంధం చిక్కుల్లో పడినట్లే!
ఒత్తిడి దూరం : రాత్రిళ్లు పడకగదిలో దంపతలిద్దరూ ఏకాంత సమయం గడపడం వల్ల భార్యభర్తలిద్దరిలో ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్ విడుదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా, ఒత్తిడి, ఆందోళనలు దూరమై ప్రశాంతత దరిచేరుతుందని పేర్కొంటున్నారు. ఇది ఇద్దరిలో రొమాంటిక్ ఆలోచనల్ని ప్రేరేపిస్తుందని, తద్వారా లైంగిక జీవితాన్ని సంతృప్తిగా ఆస్వాదించొచ్చని అంటున్నారు. అందుకే, జంటలు రోజంతా ఎంత బిజీగా ఉన్నా రాత్రిళ్లు మాత్రం కాసేపు మనసు విప్పి ఏకాంతంగా మాట్లాడుకోవడం మంచిదట.
వాటికి ఇది సమయం కాదు : కొంతమంది దొరక్క దొరక్క దొరికిన ఏకాంత సమయాన్ని కూడా దుర్వినియోగం చేస్తుంటారు. ఆఫీసు గొడవలు, పిల్లలకు సంబంధించిన సమస్యలు, ఎప్పుడో జరిగిన విషయాలు వంటివి చర్చించుకుంటారు. నిజానికి, దీనివల్ల ప్రశాంతంగా, అన్యోన్యంగా గడపాల్సిన సమయం కాస్త వృథా అయిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి విషయాలు గురించి కలిసి ఇంటి పనులు చేసుకునేటప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడో కూడా మాట్లాడుకోవచ్చని సూచిస్తున్నారు. కాబట్టి, వీటికి బదులు తమ పెళ్లినాటి జ్ఞాపకాలు, హనీమూన్ మధురానుభూతులు, ఇచ్చి పుచ్చుకున్న కానుకలు, ఇద్దరి మధ్య చోటు చేసుకున్న మర్చిపోలేని సరదా సంఘటనలు వంటివన్నీ గుర్తుకు తెచ్చుకుంటే ఇద్దరి మధ్య అనుబంధం మరింత దృఢమవుతుందంటున్నారు.
అందానికి పసుపు ఫేస్ మాస్క్ - ఇలా వాడితే చర్మ సమస్యలూ పోతాయట!
మొటిమలు, నల్ల మచ్చలకు "వేప" ఆయుధమా? - నిపుణులు ఏం చెప్తున్నారంటే!

