ETV Bharat / lifestyle

మెడ పైన ముడతలు పోవాలంటే - ఇలా చేయాలంటున్న నిపుణులు!

- పలు సింపుల్ టిప్స్ సూచిస్తున్న నిపుణులు! - ఇలా చేస్తే సమస్య త్వరగా తగ్గిపోతుందని సూచన

Neck Skin
Neck Skin (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : March 19, 2026 at 9:45 AM IST

3 Min Read
Choose ETV Bharat

Ways to Tighten your Neck Skin : వయసు మీదపడుతున్న కొద్దీ మెడ వద్ద చర్మం వదులుగా మారి ముడతలు పడడం, సన్నని గీతలు రావడం లాంటి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. వీటికి చెక్ పెట్టాలంటే కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

మృదువుగా మర్దనా : ముందుగా గోరువెచ్చని నీళ్లతో, ఆపై నూనె రహిత క్లెన్సర్‌తో ముఖం, మెడ భాగాలను శుభ్రం చేసుకోవాలంటున్నారు సౌందర్య నిపుణులు. ఆపై కొద్దిగా ఆలివ్ నూనె తీసుకొని మునివేళ్లతో ఈ నూనెను మెడ వద్ద అప్లై చేస్తూ గుండ్రంగా రుద్దుతూ రెండు నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలని చెబుతున్నారు. ఇలా మెడ చుట్టూ ఆలివ్ నూనెతో మర్దన చేసుకోవడం వల్ల అక్కడి చర్మకణాలకు సహజ తేమ అందడమే కాకుండా వదులైన చర్మం తిరిగి బిగుతుగా మారే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.

మండే ఎండల్లో చర్మ సంరక్షణ - ఈ జాగ్రత్తలు అవసరమంటున్న నిపుణులు!

వ్యాయామం : మెడ భాగానికి సంబంధించిన వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం ద్వారా అక్కడ ఉన్న చర్మకణాలు పునరుత్తేజితమవుతాయని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఫలితంగా, కొలాజెన్‌ ఉత్పత్తై అక్కడ చర్మం బిగుతుగా మారే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దీంతో మెడ భాగం వద్ద చర్మంపై ఉండే ముడతలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చర్మానికి రక్త ప్రసరణ పెరగడం, చర్మం ఉష్ణోగ్రత పెరగడం, తేమగా ఉండటం వంటి ప్రయోజనాలు కలుగుతాయని National Library of Medicine పేర్కొంది.

తెల్లసొన, తేనెతో : గుడ్డులోని తెల్లసొనలో రెండు చెంచాల తేనె వేసి బాగా కలుపుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు ప్యాక్‌లా వేసుకోవాలని సూచిస్తున్నారు. 15 నిమిషాలపాటు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలట. ఇలా వారానికోసారి క్రమం తప్పకుండా ఈ ప్యాక్‌ అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.

పెరుగు, నిమ్మరసంతో : రెండు స్పూన్లు పెరుగులో రెండు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ వద్ద ప్యాక్‌లా అప్లై చేసుకోవాలంటున్నారు నిపుణులు. తర్వాత 10 నుంచి 15 నిమిషాలపాటు మృదువుగా మర్దనా చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అనంతరం 5 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆపై గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలని పేర్కొంటున్నారు. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఫలితం ఉంటుందని తెలియజేస్తున్నారు.

కలబందతో : కలబంద గుజ్జు, తేనె.. చెంచా చొప్పున ఒక గిన్నెలోకి తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ వద్ద ప్యాక్‌లా వేసి 15 నిమిషాలపాటు ఆరనివ్వాలని నిపుణులు చెబుతున్నారు. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలని అంటున్నారు. ఇలా చేస్తే మెడపై ఉన్న ముడతలు తగ్గుతాయని సూచిస్తున్నారు. కలబంద జెల్ మానవ చర్మంలో ముడతలు తగ్గించి, బిగువును గణనీయంగా పెంచుతుందని National Library of Medicine పేర్కొంది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఎండాకాలంలో డాండ్రఫ్ సమస్య - సహజసిద్ధమైన 'నూనెలు' సూచిస్తున్న నిపుణులు!

ముఖంపై మొటిమల గుంతలు - ఈ నేచురల్​ టిప్స్​ పాటిస్తే మంచిదట!​