ETV Bharat / lifestyle

జుట్టు సమస్యలకు "మునగాకు"! - ఎలా ఉపయోగించాలో తెలుసా?

మునగాకుతో జుట్టు కాంతివంతం - ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్న నిపుణులు

Moringa Powder
Moringa Powder (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : June 20, 2026 at 5:31 PM IST

4 Min Read
Choose ETV Bharat

Moringa Powder Benefits for Scalp and Hair Care : జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కుదుళ్లు దృఢంగా ఉండాలి. ఇందుకోసం పోషకాహారం తీసుకోవడం, సహజసిద్ధమైన హెయిర్​ ప్యాక్స్ వేసుకుంటుంటారు చాలామంది. అయితే, ఈ జాబితాలో మునగాకు పొడిని కూడా చేర్చుకోమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో దీన్ని కూరల్లో భాగం చేసుకోమంటున్నారు. అలాగే, ఈ పొడితో హెయిర్ ప్యాక్స్ లేదా మాస్కులు వేసుకోమని సూచిస్తున్నారు. దీనివల్ల కుదుళ్లు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని చెబుతున్నారు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!

మునగాకు పొడిలో ఫైబర్, ప్రొటీన్, విటమిన్ బి6, విటమిన్ సి, ఐరన్, జింక్, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి కుదుళ్లలో ఉన్న సమస్యల్ని దూరం చేసి జుట్టు ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తాయంటున్నారు. అందుకే, వీటిని చర్మ, జుట్టు సౌందర్యోత్పత్తుల తయారీలో విరివిగా ఉపయోగిస్తారట. మునగాకులో ఫ్లేవనాయిడ్లు, సపోనిన్లు, విటమిన్లు, అవసరమైన అమైనో ఆమ్లాలు వంటి బయోయాక్టివ్ అణువులు పుష్కలంగా ఉన్నాయి, ఇవి జుట్టు సంరక్షణ, తల చర్మ ఆరోగ్యం కోసం సహాయపడతాయని International Journal of Pharmaceutical Sciences పేర్కొంది.

జిడ్డుదనం దూరం : కుదుళ్లు జిడ్డుగా మారడం వల్ల దురద, చుండ్రు వంటి సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు. ఇవి జుట్టు రాలడానికి కారణమవుతాయని చెబుతున్నారు. ఈ క్రమంలో మునగాకు పొడి వీటికి విరుగుడుగా పని చేస్తుందని పేర్కొంటున్నారు. ఇందులో ఉండే జింక్ అనేది కుదుళ్లలోని నూనె గ్రంథులు విడుదల చేసే సీబమ్​ను క్రమబద్ధీకరిస్తుందని తెలియజేస్తున్నారు. తద్వారా కుదుళ్లు తేమగా ఉండటంతో పాటు జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుందట. కురులు ప్రకాశవంతంగానూ కనిపించేలా చేస్తాయంటున్నారు.

"సరిపోదా శనివారం" - నీలి మేఘమాలవో, నీలాల తారవో!

దురుద రాకుండా : కొంతమందికి కుదుళ్లలో దురద, పొక్కుల్లా ఏర్పడడం వంటి సమస్యలు వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు మునగాకు పొడితో తయారు చేసిన హెయిర్ మాస్కులు ఉపయోగించడం.. ఈ పొడిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మునగాకు పొడిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కుదుళ్లలోని ఆయా సమస్యల్ని దూరం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయంటున్నారు.

ఒత్తిడిని తగ్గిస్తాయి : శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ చర్మ ఆరోగ్యంపైనే కాదు.. కుదుళ్లపైనా ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే, వీటితో పోరాడే గుణాలున్న మునగాకు పొడిని మనం తీసుకునే ఆహారం, పాటించే బ్యూటీ రొటీన్​లో భాగం చేసుకోమని సూచిస్తున్నారు. ఈ పొడిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిని సి అనేవి ఫ్రీ రాడికల్స్​తో పోరాడి ఒత్తిడిని తగ్గిస్తాయని తెలియజేస్తున్నారు.

ప్రకాశవంతంగా : జుట్టు ఒత్తుగా పెరగడమే కాదు.. ప్రకాశవంతంగా ఉన్నప్పుడే దాని అందం ఇనుమడిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మునగాకులోని బెహెనిక్ ఆమ్లం ఈ పనుల్ని సమర్థంగా నిర్వర్తిస్తుందని పేర్కొంటున్నారు. ఎందుకంటే, ఈ ఆమ్లం జుట్టుకు సహజసిద్ధమైన కండిషర్​లా పనిచేస్తుందని పేర్కొంటున్నారు. తద్వారా ఆశించిన ఫలితాన్ని పొందచ్చట.

కుదుళ్లు దృఢంగా : కుదుళ్లు ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నప్పుడే జుట్టు ఒత్తుగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మునగాకు పొడిలోని ఓలియిక్ ఆమ్లం, యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు ఇందుకు దోహదం చేస్తాయని తెలియజేస్తున్నారు. మునగలో ఉండే ప్రోటీన్లు జుట్టు కుదుళ్లలను దృఢపరచడంలో సహాయపడి, జుట్టు విరిగిపోవడం, చివర్లు చీలిపోవడాన్ని తగ్గిస్తాయని International Journal of Research Publication and Reviews పేర్కొంది.

ఈ మాస్క్ ట్రై చేయండి : మునగాకు పొడితో కుదుళ్లు, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలంటే.. ఈ హెయిర్ మాస్క్ చక్కగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా, టేబుల్ స్పూన్ చొప్పున మునగాకు పొడి, ఉసిరి పొడి ఒక బౌల్​లోకి తీసుకొని కలుపుకోవాలంటున్నారు. దీనికి కొద్ది కొద్దిగా పెరుగు జత చేస్తూ పేస్ట్​లాగా కలపాలట. ఈ మిశ్రమాన్ని కుదుళ్లు, జుట్టుకు పట్టించి అరగంట పాటు అలాగే ఉంచుకోవాలని పేర్కొంటున్నారు. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లుతో తలస్నానం చేస్తే.. ఆశించిన ఫలితాలు పొందచ్చట.

కండిషనర్​లాగా : మునగాకు పొడితో సహజసిద్ధమైన కండిషనర్​ని కూడా తయారు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం రెండు కప్పుల నీటిలో టేబుల్ స్పూన్ మునగాకు పొడి వేసి మరిగించాలని చెబుతున్నారు. చల్లారక ఈ నీటిని వడకట్టి.. తలస్నానం చేశాక కుదుళ్లు, జుట్టు మొత్తం తడిసేలా తలపై నుంచి పోసుకోవాలని పేర్కొంటున్నారు. కాసేపయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరిపోతుందని తెలియజేస్తున్నారు. మునగాకును కండీషనర్​లాగా, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించేందుకు ఉపయోగించవచ్చని National Library of Medicine పేర్కొంది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

వృద్ధాప్య ఛాయలు ముడతల్ని అడ్డుకోవడమెలా? - నిపుణులు సూచిస్తున్న టిప్స్ ఇవీ!

తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే - ఆహారంలో వీటిని చేర్చుకుంటే మేలంటున్న నిపుణులు!