ETV Bharat / lifestyle

ఇంట్లో కూడా కాలుష్యంతో ఇబ్బందిపడుతున్నారా? - ఈ టిప్స్​ పాటిస్తే బెటర్​ అంటున్న నిపుణులు!

కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల కాలుష్యానికి చెక్ పెట్టొచ్చంటున్న నిపుణులు!

Home Pollution
Home Pollution (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : November 6, 2025 at 3:41 PM IST

3 Min Read
Choose ETV Bharat

Ways to Reduce Home Pollution: మన ఇంట్లోనో, గదిలోనో ఉన్నప్పుడు తలనొప్పిగా, చికాకుగా అనిపిస్తుంది. అక్కడి నుంచి బయటకు రాగానే ఆ లక్షణాలు తగ్గిపోతాయి. దీన్ని సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అంటారు. ఇందుకు అక్కడ ఉన్న వాయు కాలుష్యమే కారణమంటున్నారు నిపుణులు. మరి, ఈ పరిస్థితి ఇంట్లో ఉండకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం!

వాయు కాలుష్యం అనగానే మనకు రహదారులపై దుమ్ము, వాహనాలు, ఫ్యాక్టరీ గొట్టాల్లోంచి వచ్చే పొగ గుర్తొస్తాయి. అయితే, బహిరంగ ప్రదేశాల్లోనే కాదు, మనం నివసించే ఇంట్లో, పనిచేసే కార్యాలయాల్లో కూడా కాలుష్యం వ్యాపించి ఉంటుందంటున్నారు నిపుణులు. దీన్ని నిర్లక్ష్యం చేస్తూ, ఆ గాలిని పీలుస్తుంటే, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. కాలుష్య ప్రభావం బయటికంటే ఇళ్ల లోపల 2-5 రెట్లు ఎక్కువగా ఉంటుందని United States Environmental Protection Agency పరిశోధనలో తెలింది.

అబ్బాయిలూ పాత్రలు కడుగుతున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

ఎందుకీ కాలుష్యం : ఇంట్లో గాలి నాణ్యత తగ్గేందుకు చాలా కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. గ్యాస్ స్టవ్, ఇంటిని శుభ్రం చేసే ఉత్పత్తుల నుంచి కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికర వాయువులు విడుదలవుతాయని చెబుతున్నారు. క్లీనింగ్ లిక్విడ్లు, పెయింట్లు, పురుగుమందులు, ఎయిర్ ఫ్రెషనర్లు, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వంటి రసాయనాలను విడుదల చేసి ఇంట్లో వాతావరణాన్ని కలుషితం చేస్తాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, కొత్త భవనాల్లో ఉపయోగించే సింథటిక్ సామగ్రి, ఫర్నీచర్, ప్లైవుడ్ ముక్కలు, చెక్క పొడి వంటివి కూడా గాలి నాణ్యతను తగ్గిస్తాయని తెలియజేస్తున్నారు.

పాత భవనాల్లో ఆస్బెస్టాస్, ఫంగస్, రాడాన్ గ్యాస్, పెంపుడు జంతువుల వెంట్రుకలు, ఫంగస్, బల్లులు, ఇతర కీటకాల నుంచి కాలుష్యం వెలువడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో, ఇంట్లో కాలుష్యంతో ప్రభావం శాశ్వతంగా ఉంటుందంటున్నారు. ఫలితంగా, కళ్లు, ముక్కు, గొంత సమస్యలకు కారణమవుతుందని వివరిస్తున్నారు.

ఏం చేయాలి?: సహజ వెంటిలేషన్ ఇంటి లోపల ఉండే కాలుష్య కారకాలను తగ్గించడం ద్వారా ఇండోర్ గాలి నాణ్యతను కూడా మెరుగుపరుస్తుందని United States Environmental Protection Agency అధ్యయనం పేర్కొంది.

అతిగా వాడొద్దు : చాలా మంది ఇల్లంతా సువాసనభరితంగా ఉండాలని కృత్రిమ ఎయిర్ ఫ్రెష్​నర్లు వాడుతుంటారు. ఇవి బెంజీన్, హైడ్రోకార్బన్ వంటి రసాయనాల్ని వాతావరణంలోకి విడుదల చేస్తాయంటున్నారు నిపుణులు. దీంతో కళ్లు, ముక్కు, గొంతుపై ప్రతికూల ప్రభావం అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే వీటికి బదులుగా సహజసిద్ధమైన పరిమళాల్ని విడుదల చేసే అత్యవసర నూనెల్ని రూమ్ లేదా ఎయిర్ ఫ్రెష్​నర్లుగా ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు.

గాలి, వెలుతురు : ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలంటున్నారు నిపుణులు. సూర్యరశ్మి నేరుగా ఇంట్లో పడేలా చేయాలని చెబుతున్నారు. దీనివల్ల గదుల్లో తేమ, చెమ్మ వంటివేవైనా ఉంటే తొలగిపోవడంతో పాటు హానికారక వాయువులు బయటకు వెళ్లిపోతాయని వివరిస్తున్నారు.

ఇవి కూడా :

  • మొక్కలను పెంచుకుంటే అవి సహజమైన వాయుశుద్ధి కారకాలుగా ఉపయోగపడతాయి.
  • అరికాపామ్, డ్రాగన్, ట్రీ, స్నేక్ ప్లాంట్ వంటి మొక్కలు, రాత్రి సమయాల్లో కార్బన్ డై ఆక్సైడ్​ను పీల్చుకుంటాయి. అంతేకాకుండా, వొలాటైల్ ఆర్గానిక్ కాంపౌండ్లను (వీఓసీలు) తొలగిస్తాయి. బెంజీన్ వంటి విషతుల్యాలను తగ్గిస్తాయి.
  • తలుపులు, కిటికీలను రోజుకు మూడు సార్లయినా తెరవాలి
  • బాత్ రూమ్​లో వాడే యాసిడ్ల పరిమాణాన్ని తగ్గించాలి.
  • కార్పెట్లను శుభ్రం చేసుకోవాలి. దీనికోసం కాలుష్యం తక్కువగా విడుదల చేసే వ్యాక్యూమ్​లు వాడాలి.
  • బయటి కాలుష్యకారకాలు ఇంట్లోకి రాకుండా నివారించేందుకు డోర్​మ్యాట్ వాడాలి.
  • వంటగదిని శుభ్రం చేయడానికి నిమ్మకాయ ముక్కలు, బేకింగ్ సోడా ఉత్తమం.
  • ఇంట్లో ధూమపానాన్ని నిషేధించాలి.

NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.

'వెళ్లే వాళ్లని వెళ్లనివ్వకపోతే, ఉన్నా వెలితిగానే ఉంటుంది' - ఇలా చేస్తే 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'!

ఇలా చేస్తే ముద్ద 'మందారం'లా మెరిసిపోతారు - ఒత్తైన కురులే కాదు అందానికీ మేలు చేసే మందార!