ETV Bharat / lifestyle

"నేచురల్ బ్యూటీ" కావాలనుకుంటున్నారా? - ఇంట్లోనే దొరికే సహజ లేపనాలు ఇవి!

జుట్టు, చర్మ సౌందర్యం కోసం - ఈ 'సహజ చిట్కాలు' పాటిస్తే అద్భుతాలే!

Beauty Secrets
Beauty Secrets (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : June 29, 2026 at 5:11 PM IST

3 Min Read
Choose ETV Bharat

Incredible Ancient Indian Beauty Secrets : అందంగా కనిపించడానికి, కేశ సంరక్షణ కోసం మార్కెట్లో సౌందర్యోత్పత్తులకు కొదవలేదు. అయితే, ఇవి అందరికీ పడకపోవచ్చు. వీటివల్ల కొందరికి ప్రతికూల ప్రభావాలు ఎదురుకావచ్చు. అందుకే, ఈ సమస్యలన్నీ లేకుండా ఉండాలంటే ఇంట్లో దొరికే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు, మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

పసుపు : ఇది మేనిఛాయను పెంచడంతో పాటు అవాంఛిత రోమాలను సైతం తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం కొద్దిగా బియ్యం పిండిలో పచ్చిపాలు, టొమాటో రసం కలిపి మిశ్రమంగా చేసుకోవాలంటున్నారు. దీనికి కొద్దిగా పసుపుని కూడా జత చేసుకోవాలట. ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకొని పూర్తిగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. పసుపును సుదీర్ఘ కాలం పాటు రాసుకుంటే, వర్ణద్రవ్య మార్పులు, చర్మ ముడతలు, సూర్యరశ్మి (UV కిరణాలు) వల్ల చర్మానికి జరిగే తీవ్రమైన నష్టం, సన్ స్పాట్స్ వంటి చర్మ పరిస్థితుల రూపాన్ని కర్కుమిన్ జెల్ మెరుగుపరుస్తుందని Indian Journal of Dermatology, Venereology and Leprology పేర్కొంది.

జుట్టు సమస్యలకు "మునగాకు"! - ఎలా ఉపయోగించాలో తెలుసా?

తులసి : తులసిలోని ఔషధ గుణాలు మొటిమలను నివారించి చర్మాన్ని మృదువుగా, సున్నితంగా మార్చుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కొన్ని తులసి ఆకులను తీసుకుని మెత్తగా చేసుకోవాలంటున్నారు. దీనికి కొద్దిగా పాలు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆపై ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మొటిమలు తగ్గుముఖం పట్టడంతో పాటు చర్మ సంరక్షణకు తోడ్పడుతుంది. తులసి బ్లాక్​హెడ్స్, నల్ల మచ్చలు, ముడతలు, చర్మ సమస్యలను తగ్గిస్తుందని International Journal of Creative Research thoughts ప్రచురించింది.

ఉసిరి : విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరి చర్మంపై చేరిన బ్యాక్టీరియాను నశింప జేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకించి జుట్టు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. ఇందుకోసం రెండు చెంచాల ఉసిరి రసానికి అంతే మోతాదులో నిమ్మరసాన్ని యాడ్ చేయాలట. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు అప్లై చేసి 20-30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేస్తే సరిపోతుంది.

వేప : ఆరోగ్యపరంగానే కాదు, సౌందర్య సంరక్షణలోనూ ఇది ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా, మొటిమల సమస్య నుంచి విముక్తి కలగిస్తుందంటున్నారు నిపుణులు. అలాగే, చర్మంపై చేరిన బ్యాక్టీరియా, సూక్ష్మక్రిముల్ని తొలగించి చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని చెబుతున్నారు. ఇందుకు కొన్ని వేప ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. దీనిలో దూదిని ముంచి శుభ్రం చేసుకుంటే మొటిమల సమస్య క్రమంగా తగ్గు ముఖం పడుతుంది. ఈ క్రమంలో చర్మ సౌందర్యం విషయంలోనే కాకుండా కురుల సంరక్షణలోనూ వేప మేలు చేస్తుంది. వేపనూనెను ఉపయోగించడం ద్వారా చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల ఇది మొటిమలకు సమర్థవంతమైన చికిత్సగా పనిచేస్తుందని International Journal of Advanced Research in Science, Communication and Technology పేర్కొంది.

అయితే, ఈ చిట్కాలు సహజ సిద్ధమైనవే అయినప్పటికీ, చర్మతత్వానికి సరిపడతాయో లేదో తెలుసుకోవడానికి ఓసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

వయస్సు పెరగడం సహజమే - యవ్వనం మీ చేతుల్లోనే ఉందని తెలుసా!

"పని భారం, ఒత్తిడి"తో అలసిపోతున్నారా? - మీ ప్రాధాన్యతలను మార్చుకోమంటున్నారు నిపుణులు!