ETV Bharat / lifestyle

వయస్సు పెరిగే కొద్ది వేధించే చర్మ సమస్యలు - ఇలా చేస్తే సహజంగా తగ్గించుకోవచ్చట!

30 ఏళ్ల వయసులోనే చర్మం ముడతలు పడుతోందా? - ఈ నేచురల్​ టిప్స్​ పాటిస్తే బెటర్!​

skin problems
skin problems (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : June 16, 2026 at 3:19 PM IST

2 Min Read
Choose ETV Bharat

How To Prevent Wrinkles In Your 30s Naturally : మీకు తెలుసా? 30 ఏళ్లు దాటిన తర్వాత, మన చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి ఏటా 1 శాతం తగ్గిపోతుంది. దీనివల్లే మన కళ్ల చుట్టూ ఫైన్​లైన్స్, చర్మం పాలిపోయినట్లు అవ్వడం మొదలవుతుంది. అయితే, సరైన స్కిన్ కేర్ రొటీన్ పాటించడం వల్ల ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా, యవ్వనంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!

సూర్యరశ్మి నుంచి రక్షణ : అకాల వృద్ధాప్యానికి యూవీ కిరణాల ప్రభావమే ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వృద్ధాప్యానికి వ్యతిరేకంగా చర్మానికి సన్​స్క్రీన్ ఉత్తమ సంరక్షణ అని చెబుతున్నారు. అందుకే, ఇంట్లో ఉన్నా SPF 30 సన్​స్క్రీన్ వాడాలట. అదే, బయట వెళ్లినప్పుడు ప్రతి 2-3 గంటలకు ఒకసారి అప్లై చేసుకోవాలని సూచిస్తున్నారు.

లోపల నుంచి హైడ్రేట్ చేయడం : డీహైడ్రేషన్ వల్ల సన్నటి గీతలు మరింత సృష్టంగా కనిపిస్తాయి. అందుకే, పుష్కలంగా నీరు తాగాలంటున్నారు నిపుణలు. అలాగే, దోసకాయ, పుచ్చకాయ, నారింజ వంటి హైడ్రేటింగ్ ఆహార పదార్థాలను మెనూలో భాగం చేసుకోవాలి. అలాగే, హెర్బల్ టీ, కొబ్బరి నీరు కూడా చర్మ హైడ్రేషన్​కు తోడ్పడతాయి.

సీజనల్ హెయిర్ ఫాల్ - ఆహారంలో వీటిని చేర్చుకుంటే మేలంటున్న నిపుణులు!

రోజువారీ అలవాట్లు : కఠినమైన స్క్రబ్స్​ను నివారించి సున్నితమైన క్లెన్సర్లకు మారాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో చర్మ సంరక్షణ అనేది స్క్రిన్ సహజ రక్షణ పొరను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అలాగే, రోజ్​హిప్ లేదా స్క్వాలేన్ వంటి మొక్కల ఆధారిత నూనెలను ఉపయోగించాలట. ఇందులో విటమిన్ ఎ, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వృద్ధాప్య ఛాయలను తగ్గించి, చర్మం కాంతివంతంగా మారడానికి సహాయపడుతుంది.

ప్రశాంతమైన నిద్ర : నిద్ర లేకపోవడం వల్ల చర్మం త్వరగా వృద్ధాప్యానికి గురవుతుంది. కాబట్టి, రోజుకు 7-9 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు.

ముఖ వ్యాయామాలు : సాధారణ ఫేషియల్ యోగా లేదా గ్వాషా మసాజ్​లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాదు, ముఖంలో నిలిచిపోయిన అదనపు ద్రవాలను బయటకు పంపి ముఖాన్ని తాజాగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుందంటున్నారు నిపుణులు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చర్మం టోన్, దృఢత్వాన్ని మెరుగుపరుస్తుందట. అందుకే, ప్రతిరోజూ వేళ్లతో లేదా జేడ్ రోలర్​తో కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం : రంగురంగుల పండ్లు, ఆకుకూరలు, గింజలు, విత్తనాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉన్న ఆహారం కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే, పర్యావరణ నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

దాంపత్య బంధానికీ "విశ్రాంతి" అవసరమే! - ఎందుకో తెలుసా?

అందం కోసం ఆ 'మందం' తొలగించాల్సిందే! - మొటిమలకూ అదే కారణమంటున్న నిపుణులు!