ETV Bharat / lifestyle

జుట్టు రాలడానికి దువ్వే విధానం కూడా కారణమట! - మరి ఎలా దువ్వుకోవాలో తెలుసా?

-జుట్టు దువ్వే విషయంలో ఈ తప్పులు అస్సలు చేయొద్దట - కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు!

Best Ways to Comb Hair
Best Ways to Comb Hair (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : October 11, 2026 at 6:20 PM IST

3 Min Read
Choose ETV Bharat

Hair Comb Tips: అందంగా కనిపించడంలో జుట్టు కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మహిళల అందాన్ని ఇనుమడింపచేయడంలో ఇది ముఖ్యమైనది. కాగా, ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. అయితే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయని లైట్​ తీసుకుంటుంటారు. కానీ మనం జుట్టు దువ్వే విధానం కూడా ఓ కారణంగా చెబుతున్నారు నిపుణులు. అందుకే జుట్టు రాలకుండా ఉండాలంటే జుట్టు దువ్వుకునే ప్రాసెస్​లో కొన్ని పద్ధతులు పాటించాలని వివరిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

నెమ్మదిగానే దువ్వాలి: జుట్టును హడావుడిగా కాకుండా నెమ్మదిగా దువ్వుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రోజూ జుట్టు దువ్వుకునేటప్పుడు సుమారు 50 నుంచి 100 వెంట్రుకల దాకా రాలిపోతాయని చెబుతున్నారు. అయితే కాస్త సమయం వెచ్చించి నెమ్మదిగా దువ్వుకోవడం వల్ల ఈ సమస్య క్రమంగా తగ్గుతుందని సూచిస్తున్నారు.

తేమను కోల్పోకుండా: మన జుట్టు కుదుళ్లలో సహజసిద్ధమైన నూనెలను విడుదల చేసే సెబేషియస్‌ గ్రంథులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలా పడితే అలా కాకుండా.. జుట్టును ఓ సరైన పద్ధతిలో దువ్వినప్పుడు అవి ప్రేరేపితమై అవసరమైన మొత్తంలో నూనెలను విడుదల చేస్తాయని, ఫలితంగా కుదుళ్లు, జుట్టు తేమను కోల్పోకుండా ఉంటాయని చెబుతున్నారు. ఈ ప్రక్రియ జుట్టు రాలడాన్ని నియంత్రించి పెరిగేలా చేస్తుందని వివరిస్తున్నారు. clevelandclinic కూడా ఈ విషయాన్ని పేర్కొన్నట్లు చెబుతున్నారు.

చిక్కులు తీయడం ముఖ్యం: జుట్టులో దుమ్ము-ధూళి చేరినప్పుడు, సరిగ్గా దువ్వకపోతే చిక్కులు కట్టినట్లుగా తయారవుతుంది. అయితే జుట్టు రాలడానికి ఇదీ ఓ కారణం అంటున్నారు నిపుణులు. కాబట్టి ఇలాంటి సమయాల్లో చిక్కులు తొలగిస్తూ జుట్టును దువ్వుకోవడం వల్ల జుట్టు రాలకుండా ఉండడంతో పాటు వెంట్రుకలు-కుదుళ్లలో చిక్కుకున్న దుమ్ము-ధూళి కూడా తొలగిపోతాయని వివరిస్తున్నారు.

మరీ ఎక్కువ వద్దు: జుట్టు దువ్వుకోవడం మంచిది కదా అని, ఎలా పడితే అలా దువ్వడం, ఎక్కువ సార్లు దువ్వుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే జుట్టు రాలకుండా ఉండేందుకు దువ్వెనను కుదుళ్లకు తాకేలా, వెంట్రుకల్లో చిక్కులు తొలగించుకుంటూ పై నుంచి కింది వరకు నెమ్మదిగా దువ్వుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో చెక్కతో చేసిన ప్యాడిల్ బ్రష్‌/దువ్వెన ఉపయోగిస్తే వెంట్రుకలు, కుదుళ్లు డ్యామేజ్‌ కాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక జుట్టు దువ్వే సంఖ్యను తగ్గించడం ద్వారా జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చని 'National Library of Medicine' పరిశోధనా నివేదిక పేర్కొందని వివరిస్తున్నారు.

తడి జుట్టును ఇలా దువ్వాలి: తలస్నానం చేసినప్పుడు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే జడ వేసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఇది కూడా సరైంది కాదంటున్నారు. జుట్టు ఆరితే చిక్కులు ఏర్పడి దువ్వినప్పుడు జుట్టు రాలుతుందంటున్నారు. అందుకే తడిగా ఉన్న దువ్వుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అయితే ఈ క్రమంలో పలు టిప్స్​ పాటించాలంటున్నారు. అవేంటంటే..

  • తలస్నానం చేసినాక ముందుగా జుట్టుకు కండిషనర్‌ రాసుకోవాలట. ఒకవేళ ఈ అలవాటు లేని వారు వదిలేయచ్చంటున్నారు.
  • ఇప్పుడు బ్రిజిల్స్‌ మధ్య గ్యాప్‌ ఎక్కువగా ఉన్న, చివర్ల వద్ద మృదువైన బొడిపెల్లా ఉన్న దువ్వెన తీసుకొని కుదుళ్ల నుంచి చివర్ల దాకా చిన్నగా దువ్వుతూ రావాలంటున్నారు. ఈ క్రమంలో ఎక్కడైనా చిక్కులు కట్టినట్లు అనిపిస్తే కేవలం చేతి వేళ్లతో వాటిని తొలగించుకుంటూ హెయిర్​ స్ట్లైల్​ చేసుకోవాలని వివరిస్తున్నారు.
  • ఇక చిక్కులన్నీ తొలగిపోయాక.. మరోసారి జుట్టును పైనుంచి కింది వరకు దువ్వుకుంటే సరిపోతుందంటున్నారు.

పొడి జుట్టు కోసం: పొడి జుట్టును దువ్వడానికి కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..

  • జడ వేసుకున్నా, ముడేసుకున్నా, వదిలేసినా.. జుట్టు ఎక్కువగా చివర్ల వద్దు చిక్కులు కడుతుందంటున్నారు. ఈ క్రమంలోనే ముందుగా ఆ భాగంలో చిక్కులు తొలగించుకోవాలని సూచిస్తున్నారు. ఇందుకోసం జుట్టు మధ్య భాగం నుంచి కింది వరకు చిక్కులు తొలగించుకుంటూ నెమ్మదిగా దువ్వాలని సలహా ఇస్తున్నారు.
  • ఆ తర్వాత ఇంకాస్త పై నుంచి కింది వరకు నెమ్మదిగా దువ్వుకుంటూ రావాలని చెబుతున్నారు. ఆ తర్వాత ఇంకాస్త పై నుంచి.. అలా చివరగా కుదుళ్ల నుంచి కింది దాకా మరోసారి జుట్టు మొత్తాన్ని దువ్వాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చిక్కులు తొలగిపోతాయని, జుట్టు కూడా ఎక్కువగా రాలకుండా ఉంటుందంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

దసరా సెలవుల్లో "వెకేషన్​" ప్లాన్​ చేస్తున్నారా? - ఇవి తెలుసుకుంటే ట్రిప్​ సూపర్​ సక్సెస్​!

జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా? - ఆహారంలో వీటిని చేర్చుకుంటే మేలంటున్న నిపుణులు!