అనునిత్యం టాస్క్‌లతో పరిగెడుతున్నారా? - ఒక్క క్షణం రిలాక్స్ అవ్వాలట!
-మన కోసం, మానసిక ప్రశాంతత కోసం సమయం కేటాయించాలట - అందుకోసం పలు సింపుల్ టిప్స్ సూచిస్తున్న నిపుణులు!

Published : October 24, 2025 at 3:55 PM IST
Healthy Lifestyle Habits for Busy Professionals: లేస్తూనే మీటింగ్‌లు, ప్రాజెక్టులు, టార్గెట్లు. వీకెండ్ వస్తే స్నేహితులు, పార్టీలు, గేమ్స్. మధ్యలో సోషల్‌మీడియా. ప్రపంచంలో జరిగే అన్నీ తెలుసుకోవాలి! అందరికన్నా మెరుగ్గా ఉండాలనే ఆలోచనలో, విరామ సమయంలోనూ ఒత్తిడి నెత్తినేసుకుంటున్నాం! అందుకే, ఒక్క క్షణం ఆగుదాం. ప్రస్తుతంలో ఉంటూ, కాసేపు పనులను పక్కనబెట్టి.. శరీరాన్ని, మనసును తేలికపరుచుకుందాం. మరి, అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం!
అందరిదీ అదే ఆలోచన : ఎక్కడికైనా, ఎవరికైనా సెకన్లలో సందేశాన్ని పంపించగల్గుతున్నాం. ప్రపంచ వింతలన్నింటినీ అరచేతిలోంచే చూడగలుగుతున్నాం. కృత్రిమ మేధ, మెషీన్ లర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ వాటి ఫలితంగా జీవితంలో పరుగే పరుగు. చివరికి బర్నవుట్! విరామానికి చోటే లేదు. ఇప్పుడు వేగం ఉంటేనే విజయం, నెమ్మదించడం అనేది వెనకబాటుతనంగా చాలా మంది భావిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. సాధారణ ఉద్యోగి నుంచి సీఈఓల వరకూ అందరిదీ ఒకటే పరిస్థితి అని తెలియజేస్తున్నారు. ఉత్పాదకత పెరగాలి, సంపాదించాలంటే పరుగెత్తాల్సిందే అని, కానీ అదే వద్దు అంటున్నారు.
వారంలో ఎన్ని సార్లు తలస్నానం చేయాలి? - హెడ్ బాత్కు ముందు, తర్వాత ఈ జాగ్రత్తలు ముఖ్యమట!
పని చేయొద్దని కాదు : నెమ్మదించడం సోమరితనానికి సంతృప్తికీ సంకేతం కాదని అంటున్నారు. ఇదో చిన్న విరామం మాత్రమే అని, అప్పుడే సృష్టతతో ఆలోచించగలమని చెబుతున్నారు. ముఖ్యమైన దానిమీద దృష్టి పెట్టగలమని, ఉత్పాదకతను రెట్టింపు చేయగలమని వివరిస్తున్నారు. వేగంగా పరుగెడితేనే లక్ష్యాన్ని చేరుకుంటామనేది అపోహే అని తెలియజేస్తున్నారు. వాస్తవానికి, వేగాన్ని తగ్గించడం అనేది మనలోని శక్తిని కాపాడుకోవడమని సూచిస్తున్నారు.
లాభాలెన్నో : వేగం తగ్గించడం వల్ల మైండ్‌పుల్ లివింగ్ అలవడుతుంది. మనకేం కావాలో తెలుస్తుంది. పనిలో పూర్తిగా నిమగ్నమవడం నేర్చుకుంటారని నిపుణులు చెబుతున్నారు. మల్టీటాస్కింగ్ మంచిదనుకుంటాం కానీ కాదంటున్నారు. తింటున్నా, నిద్రపోతున్నా మధ్యమధ్యలో మెసేజ్‌లు చెక్ చేయడం, మర్నాటి టాస్క్‌ల గురించి ఆలోచించడం వల్ల సరైన నిర్ణయం తీసుకోలేమని సూచిస్తున్నారు. దీంతో సృజన, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయని వివరిస్తున్నారు. ఎందుకంటే, మెదడు వర్తమానాన్ని మరిచి, తరవాతేంటీ అన్నదే ఆలోచిస్తుంటుందని తెలియజేస్తున్నారు. అందుకే, మల్టీటాస్కింగ్ వల్ల అసలైన ఉత్పాదకత తగ్గి, 40 శాతం తప్పులు చేస్తామని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి :
- బిజీ లైఫ్‌లో తగ్గించుకుని ఆప్తులతో గడపడం వల్ల బంధాలు బలపడతాయి. జ్ఞాపకాలను పోగేసుకోవచ్చు. ఇది జీవితం పట్ల సంతృప్తిని పెంచుతుంది.
- చిన్న విరామంతో బుజ్జి పిట్ట పలకరింపు, గాలి సవ్వడి, ఊగే కొమ్మల సన్నాయి లాంటివి అనుభవంలోకి వచ్చే ప్రతి క్షణాన్నీ ఆనందించడం నేర్చుకుంటాం. దాంతో ఒత్తిడి తగ్గి శక్తిమంతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. కాబట్టి, మనకోసం, మానసిక ప్రశాంతత కోసం సమయం కేటాయించుకుందాం. కాదని పరుగెడుతుంటే జీవితం అస్తవ్యస్తమే!
- నడిచేటప్పుడూ కొన్ని పనులు చేసేద్దాం అనుకుని పాడ్‌కాస్ట్‌లు వింటుంటాం. పరధ్యానం అసలే వద్దు. మన ఆలోచనలతోనే గడుపుదాం. ఐదు, పది నిమిషాలు మౌనంగా కూర్చుని కళ్లు మూసుకుందాం. మెదడు స్క్రీన్ మీద కొచ్చే ఆలోచనల్ని జాగ్రత్తగా గమనించి, ఒడిసి పట్టుకుందాం. అనుక్షణం టాస్క్‌లతో పరుగెత్తకుండా, స్నేహితులతో కప్పు కాఫీ, ప్రకృతిలో నడక, మంచి పుస్తకం ఇలా ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ జీవిద్దాం. మైక్రో పాజ్లు ఎప్పుడూ మంచివే అంటున్నారు నిపుణులు.
మీ ఇంట్లో డబ్బు, నగలు మాయం అవుతున్నాయా? - వారిని అనుమానించాల్సిందేనట!
"మోచేతులు, మోకాళ్లు నల్లగా ఉన్నాయా?" - ఈ టిప్స్ పాటిస్తే బెటర్ అంటున్న నిపుణులు!

