"కర్లీ హెయిర్"తో ఇబ్బంది పడుతున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే బెటర్!
ఉంగరాల జుట్టు సంరక్షణ - పలు సింపుల్ టిప్స్ సూచిస్తున్న నిపుణులు!

Published : March 4, 2026 at 3:42 PM IST
Easy Ways to Protect Curly Hair : జుట్టు సిల్కీగా ఉన్న వారికి ఉంగరాల జుట్టు ఉంటే బాగుంటుందనిపిస్తుంది. అదే, కర్లీ హెయిర్ ఉన్న వాళ్లేమో ‘ఈ జుట్టు నా వల్ల కాదు బాబోయ్’ అంటూ సిల్క్ హెయిర్‌ను కోరుకుంటారు. వాస్తవానికి, ఎవరి జుట్టు తత్వం వారికి నచ్చదు. అయితే, కర్లీ హెయిర్ సాధారణంగానే పొడిగా ఉంటుంది. దీంతో నిర్జీవంగా కనిపిస్తుంది. కొంతమందికి మెయింటెయిన్ చేయడం కూడా కష్టంగా అనిపిస్తుంటుంది. ఈ క్రమంలో కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే కర్లీ హెయిర్‌నూ అందంగా కనిపించేలా చేయచ్చంటున్నారు నిపుణులు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!
- కొందమందికి రోజూ హెడ్ బాత్ చేయడం అలవాటు. ఉంగరాల జుట్టు ఉన్న వారూ కొందరు ఇలాగే చేస్తుంటారు. దీంతో జుట్టు మరింత పొడిబారుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, జుట్టు తత్వాన్ని బట్టి వారానికి 2-3 సార్లు మాత్రమే తలస్నానం చేయాలని సూచిస్తున్నారు. అది కూడా గాఢత తక్కువగా ఉండే షాంపూని నీళ్లలో కలుపుకొని చేయడం మంచిదట. వారంలో తలస్నానం ఎన్నిసార్లు చేయాలి అనేది జుట్టు రకం, ఆకృతిని బట్టి ఉంటుందని clevelandclinic అధ్యయనం పేర్కొంది.
- కర్లీ హెయిర్ ఇతర రకాల జుట్టు కంటే పొడిగా ఉంటుంది. తేమగా ఉంచడానికి, జుట్టు చివరలను మాత్రమే కాకుండా, జుట్టు మొత్తాన్ని కండిషన్ రాసుకోవాలని American Academy of Dermatalogy Association అధ్యయనం పేర్కొంది. ఇది జుట్టు పొడిబారిపోకుండా చేస్తుందట. అలాగే తలస్నానానికి వేడి నీళ్లు కాకుండా గోరు వెచ్చటి నీళ్లు లేదా చల్లటి నీళ్లు ఉపయోగించడం మేలు.
- ఉంగరాల జుట్టు సంరక్షణ కోసం వారానికి మూడు సార్లు నూనె పెట్టుకోమంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో కొబ్బరి నూనెను కుదుళ్లు, వెంట్రుకలకు అప్లై చేసి కాసేపు మర్దన చేయాలని చెబుతున్నారు. ఇలా రాత్రివేళ నూనె పెట్టుకొని మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేస్తే జిడ్డుగా కూడా అనిపించదట.
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా? - ఈ నేచురల్ టిప్స్ పాటిస్తే బెటర్!
- ఒకవేళ నూనె పెట్టుకున్న మరుసటి రోజు తలస్నానం చేయకపోతే, జెల్ ఆధారిత కండిషనర్‌ని కొద్దిగా తీసుకొని జుట్టుకు పట్టించుకోవాలట. ఇలా చేయడం ద్వారా నూనె వల్ల జుట్టు జిడ్డుగా అనిపించకుండా జాగ్రత్త పడచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
- అలాగే, తడిగా ఉన్న జుట్టును దువ్వడం, టవల్‌తో గట్టిగా రుద్దుతూ తుడవడం వంటివి అస్సలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, ఇవి జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయట. మెత్తగా ఉన్న క్లాత్‌తో జుట్టును పొడిగా తుడుచుకొని, ఆరిన తర్వాత దువ్వెనతో చిక్కు తీసుకోవడం మేలట.
- తడిగా ఉన్న ఉంగరాల జుట్టును బిగుతుగా జడ వేసుకోవడం లేదా గట్టిగా ముడేయడం వంటివి చేస్తే జుట్టు చివర్లు చిట్లిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి, జుట్టును ముడేసే ముందు సహజ సిద్ధంగా ఆరనివ్వడం మంచిదట.
- నువ్వుల నూనె, షియా బటర్ వంటివి కర్లీ హెయిర్ సంరక్షణకు చక్కగా ఉపయోగపడతాయి.
- కర్లీ హెయిర్ పొడిబారకుండా ఇంట్లోనే తయారు చేసుకునే హెయిర్ స్ప్రే కూడా చక్కగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఒక స్ప్రే బాటిల్‌లో డిస్టిల్డ్ వాటర్ నింపి అందులో కొన్ని చుక్కల చొప్పున లావెండర్ ఆయిల్, రోజ్మేరీ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్ వేసి ఒకసారి షేక్ చేసి పెట్టుకోవాలట. దీన్ని జుట్టుపై అప్పుడప్పుడూ స్ప్రే చేస్తుండడం మంచి ఫలితం ఉంటుందట. అలాగే, నీళ్లు, కీరా, పండ్ల రసాలు, కాయగూరులు తీసుకోవాడం మేలని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బంగాళాదుంపలను వంటల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారా? - ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!

