ETV Bharat / lifestyle

ఎండాకాలంలో డాండ్రఫ్ సమస్య - సహజసిద్ధమైన 'నూనెలు' సూచిస్తున్న నిపుణులు!

- వేసవిలోనూ చుండ్రు సమస్య వేధిస్తోందా? - జుట్టు సంరక్షణ కోసం కొన్ని ఆయిల్స్ సూచిస్తున్న ఎక్స్​పర్ట్స్​

Dandruff and Itching
Dandruff and Itching (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : March 14, 2026 at 2:46 PM IST

3 Min Read
Choose ETV Bharat

Best Oils to Prevent Summer Dandruff and Itching : చాలామంది ఎండాకాలంలో చర్మ సంరక్షణ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు జుట్టు విషయంలో తీసుకోరు. దీంతో వేడికి జుట్టు ఆరోగ్యం దెబ్బతినడం, చెమట కారణంగా కుదుళ్లలో చుండ్రు, దురద వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేడి, నూనె ఉత్పత్తి అధికంగా ఉండటం వల్ల తల చర్మంపై చికాకు ఏర్పడుతుందట. మార్కెట్లో అనేక యాంట్రీ డాండ్రఫ్ షాంపూలు అందుబాటులో ఉన్నప్పటికీ, పాత పద్ధతిలో చేసే నూనె మసాజ్​కు మించినది ఏదీ లేదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో సరైన నూనెలను ఉపయోగించడం వల్ల చుండ్రు, దురద లాంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. ఈ నూనెల వల్ల కుదుళ్లకు పోషణ అందడంతో పాటు ఇన్​ఫెక్షన్లు రాకుండా ఉంటాయని పేర్కొంటున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

కొబ్బరి నూనె : వేసవిలో తల చర్మానికి కొబ్బరి నూనె ప్రభావవంతంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే సహజ సిద్ధమైన యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు చుండ్రు, తల దురద నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయని చెబుతున్నారు. ఇది కుదుళ్లకు తేమను అందించడంతోపాటు జుట్టు ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుందని National Library of Medicine అధ్యయనం పేర్కొంది. అలాగే, రక్త ప్రసరణ మెరుగుపడుతుందట. ఈ క్రమంలో కొబ్బరినూనెను తలకు అప్లై చేసే ముందు కొద్దిగా వేడి చేసి రాసుకోవాలట.

బహుభాషా నైపుణ్యంతో మెదడుకు మేలు - అందుకే పిల్లలకు ఎక్కువ భాషలు నేర్పించాలట!

టీ ట్రీ ఆయిల్ : ఇందులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు.. తల చర్మంపై చుండ్రుకు కారణమయ్యే ఈస్ట్ పెరుగుదలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా, చుండ్రు సమస్య తగ్గుతుందని అంటున్నారు. ఇది తల చర్మాన్ని తాజాగా, శుభ్రంగా ఉంచుతుందని తెలియజేస్తున్నారు. అయితే, ఇది ఎక్కువ గాఢత కలిగి ఉంటుందని, అందుకే దీన్ని నేరుగా అప్లై చేసుకోవద్దని సూచిస్తున్నారు. దీనిని కొబ్బరి నూనె లేదా బాదం నూనె వంటి క్యారియర్ ఆయిల్స్​తో కలిపి తలకు పట్టించుకోవడం మంచిదట.

బాదం నూనె : జిడ్డుగా ఉండే జుట్టు ఉన్నవారు బాదం నూనెను ఎంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్, అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ తల చర్మానికి చక్కని పోషణను అందిస్తాయంటున్నారు. ఎండ, దుమ్ము వల్ల కురులు పొడిగా, చిట్లిపోయినట్లు అనిపిస్తుంది. అయితే, బాదంనూనె కుదుళ్లుకు తేమను అందించడంతో పాటు బలంగా పెరగడానికి సహాయపడుతుందని National Library of Medicine పేర్కొంది. ఇది జుట్టుకు అప్లై చేసినప్పుడు జిడ్డుగా కనిపించదని పేర్కొంటున్నారు

వేపు నూనె : దీర్ఘకాలిక చుండ్రు, దురదను తగ్గించడంలో వేప ఆకులు, నూనె అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని National Library of Medicine పేర్కొంది. దీనిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ల్ఫ్ మేటరీ గుణాలు తల చర్మంపై ఎటువంటి చికాకునైనా పోగొట్టడానికి సహాయపడతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, దీనిని నేరుగా ఉపయోగించకూడదని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని చుక్కల వేప నూనెకు కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో కలిపి వాడటం మంచిదంటున్నారు. ఇది తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడుతుందని పేర్కొంటున్నారు.

జోజోబా ఆయిల్ : తల చర్మం పొడిగా, పొలుసుగా లేదా చికాకుగా అనిపిస్తే, జోజోబా ఆయిల్ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రంధ్రాలు మూసుకుపోకుండా నూనె ఉత్పత్తిని సమతుల్యం చేయడంలో తోడ్పడుతుందని అంటున్నారు. ముఖ్యంగా వేసవిలో చెమట వల్ల తల చర్మం ఎక్కువగా జిడ్డుగా మారినప్పుడు ఇది బాగా పనిచేస్తుందని తెలియజేస్తున్నారు. అంతేకాదు, ఇది చికాకుగా ఉన్న తల చర్మాన్ని శాంతపరిచి, కుదుళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని వివరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ముఖంపై మొటిమల గుంతలు - ఈ నేచురల్​ టిప్స్​ పాటిస్తే మంచిదట!​

మండే ఎండల్లో చర్మ సంరక్షణ - ఈ జాగ్రత్తలు అవసరమంటున్న నిపుణులు!