'అమ్మమ్మ'లా కనిపిస్తున్నారా? - "మీ వయస్సును దాచేసే ఫుడ్"పై నిపుణుల సూచనలు
చిన్న వయస్సులో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయా? - ఇవి మీ ఆహారంలో చేర్చుకుంటే చర్మం మెరుస్తుందట!

Published : May 20, 2026 at 3:34 PM IST
Foods to Avoid for Healthy Skin : మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలు చర్మం ఆరోగ్యంగా ఉండానికి సహాయపడతాయి. మరికొన్ని మాత్రం చర్మానికి హాని కలిగిస్తాయి. తద్వారా ముడతలు ఏర్పరడం, సన్నని గీతలు, పొడిబారిపోవడం, నిర్జీవంగా తయారవడం లాంటి చర్మ సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. వాటి వల్ల వృద్ధాప్య లక్షణాలు సైతం కనిపిస్తుంటాయట. ఈ క్రమంలో చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే మనం తీసుకునే ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
చక్కెరలు తగ్గించాలి : చాక్లెట్స్, స్వీట్స్, బిస్కెట్స్, బయట దొరికే మిల్క్‌షేక్స్, జ్యూస్‌లు వంటి షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత, చర్మం ముడతలు పడటం వంటి సమస్యలు ఎదురవుతాయట. ఫలితంగా, యవ్వనంలోనే వార్థక్యపు ఛాయలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, బయట దొరికే వాటికి బదులు ఇంట్లోనే ఆరోగ్యకరమైన రీతిలో తయారు చేసుకోనే పదార్థాలు తినడం మంచిదని సూచిస్తున్నారు.
జాబ్‌లో చేరడానికి 'టైం' తీసుకుంటున్నారా? - ఆ విరామాన్ని వాడేయండిలా!
పాల సంబంధింత ఉత్పత్తులు : పాలు, పెరుగు, వెన్న, మజ్జిగ, పాల సంబంధిత ఉత్పత్తుల నుంచి శరీరానికి ప్రొటీన్లు బాగా అందుతాయి. అవి ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ చీజ్, ఐస్‌క్రీమ్ లాంటి వల్ల కొంతమందిలో మొటిమలు రావడానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
వీటికి దూరంగా :
- చిప్స్, జంక్‌ఫుడ్, డీప్ ఫ్రై చేసిన పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటేనే మేలట.
- ప్యాకేజ్డ్ ఫుడ్స్ జోలికి అస్సలు పోకూడదు. ఒకవేళ తప్పనిసరిగా అటువంటి పదార్థాలు తీసుకోవాల్సి వస్తే అందులో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ క్రమంలో ఉప్పు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిదట. లేదంటే ముఖం ఉబ్బినట్లుగా కనిపించడం, కళ్ల కింద వాపు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
- సోడా, కూల్‌డ్రింక్స్ మొదలైన వాటికి దూరంగా ఉంటేనే మంచిదట.
- రోజూ సరిపడినన్ని నీళ్లు తాగడమే కాకుండా ఆ నీరు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆహారంలో వీటిని చేర్చుకుంటే :
- బాదం, పిస్తా లాంటివి క్రమం తప్పకుండా తినడం వల్ల అన్శ్యాచురేటెడ్ కొవ్వులు, మినరల్స్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి సమృద్ధిగా లభిస్తాయి. ఈ క్రమంలో బాదం పప్పుల రోజువారీ వినియోగం రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో ముఖ ముడతలు, ఫోటోఏజింగ్ లాంటి అనేక అంశాలను మెరుగుపరుస్తుందని National Library of Medicine తేలింది.
- చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫినోల్స్ మొదలైనవి బ్లూబెర్రీ పండ్లలో అధికంగా లభిస్తాయట
- టమాటాల్లో ఉండే లైకోపీన్ యూవీ కిరణాల నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తుంది.
- గ్రీన్ టీ వల్ల శరీరంలో ఎప్పటికప్పుడు కొత్త చర్మ కణాలు ఉత్పత్తి అవుతాయి. దీంతో చర్మం తాజాగా, యవ్వనంగా కనిపిస్తుందట.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పిల్లలను ఇతరులతో పోలుస్తున్నారా? - తల్లిదండ్రులకు నిపుణుల సూచనలివే!
'సెల్ఫ్ లవ్, కేర్' మాత్రమే కాదు - ఫ్రెండ్షిప్ కూడా ముఖ్యమంటున్న నిపుణులు!

