ETV Bharat / international

నా వల్లే అప్పుడు భారత్​, పాక్​ యుద్ధం ఆగింది- నోబెల్​ బహుమతి కూడా నాకే రావాల్సింది: ట్రంప్​

ఆపరేషన్ సిందూర్​ సమయంలో 11 విమానాలు కూలిపోయినట్లు ట్రంప్​ వ్యాఖ్య- తన వల్లే ప్రపంచ వ్యాప్తంగా 8 యుద్ధాలు ఆగాయని వెల్లడి- అమెరికా అధ్యక్షుడు మాటలను ఖండిస్తున్న భారత్​

Trump Repeated Claims About Sindoor
Donald Trump (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : July 9, 2026 at 4:17 PM IST

3 Min Read
Choose ETV Bharat

Trump Repeated Claims About Sindoor : భారత్​, పాకిస్థాన్​ మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ఇంకా పాత పాటే పాడుతున్నారు. గతేడాది మే నెలలో భారత్​ చేపట్టిన సిందూర్​ ఆపరేషన్​లో 11 విమానాలు కూలిపోయినట్లు ఆయన చెప్పారు. అయితే అవి భారత్​, పాకిస్థాన్​ల​లో ఏ దేశానికి చెందిన విమానాలని ఆయన వివరిణ ఇవ్వలేదు. కానీ ఆయన వల్లే ప్రపంతంలో 8 యుద్ధాలు ఆగాయని ట్రంప్​ చెపుకొచ్చారు. అందుకే నోబెల్​ బహుమతి కూడా తనకే రావాల్సి ఉందని, కానీ అలా జరగలేదని అన్నారు. టర్కీలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశం అనంతరం ఎయిర్ ఫోర్స్ వన్‌లో ప్రయాణిస్తూ మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా భారత్​ మాత్రం ఈ విషయాన్ని ముందు నుంచే ఖండిస్తోంది. ఆపరేషన్​ సిందూర్​ సమయంలో తమకు అమెరికా ఎటువంటి మధ్యవర్తిత్వం చేయలేదని పలుమార్లు స్పష్టం చేసింది. ఇరు దేశాల సైనికాధికారుల చర్చలు ఫలించడం వల్లే ఆ యుద్ధాన్ని నిలిపివేసినట్లు పేర్కొంది. ట్రంప్​ మాత్రం ఈ విషయంలో తన వైఖరిని మార్చుకోవడం లేదు. తను లేకపోతే ఈ రెండు దేశాల మధ్య అణు యుద్ధం జరిగేదని అన్నారు. అంతే కాకుండా భారత్​ దాడులు నిలిపివేసినందుకు పాక్​ ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ తనను అభినందించారని చెప్పారు. పాకిస్థాన్​లో 3 నుంచి 5 కోట్ల మందిని అమెరికా ప్రధాని​ చొరవే కాపాడిందని ఆయన చెప్పినట్లు ట్రంప్​ పేర్కొన్నారు.

పాత ఎయిర్ ఫోర్స్ వన్‌లో ప్రయాణం
ఇదిలా ఉండగా, ట్రంప్​ తుర్కియేలో జరిగిన నాటో సమావేశానికి ఖతార్ బహుమతిగా అందించిన ఆధునికీకరించిన కొత్త జెట్‌లో వెళ్లారు. కానీ తిరుగు ప్రయాణానికి మాత్రం పాత లేత నీలం రంగు ఎయిర్ ఫోర్స్ వన్‌ను ఎంచుకున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది. ఈ మార్పుపై ట్రంప్ స్పష్టమైన కారణం చెప్పలేదు. "పాత జ్ఞాపకాల కోసం ఆ విమానంలోనే ప్రయాణిస్తున్నాను" అని మాత్రమే సమాధానం ఇచ్చారు. అలాగే అమెరికాకు తిరుగు ప్రయాణంలో బ్రిటన్‌లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ మిల్డెన్‌హాల్ స్థావరంలో విమానం ఆగుతుందని తెలిపారు.

భద్రతపై ప్రశ్నలు
ఖతార్ బహుమతిగా అందించిన బోయింగ్ 747-800 జెట్‌ను అమెరికా దాదాపు 400 మిలియన్ డాలర్ల వ్యయంతో అధ్యక్షుడి ప్రయాణానికి అనుగుణంగా మార్చింది. అయితే అందులో పాత ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఉండే కొన్ని అత్యాధునిక క్షిపణి హెచ్చరిక, ప్రతిచర్య వ్యవస్థలు లేవని నివేదికలు వెలువడటంతో భద్రతాపరమైన చర్చ మొదలైంది. ఇరాన్‌పై అమెరికా సైన్యం భారీ దాడులు చేపట్టిన కొద్దిసేపటికే ట్రంప్ విమానం మార్పు జరగడం కూడా దీనిపై అనుమానాలకు తావిచ్చింది. మొదట కొత్త విమానం బ్రిటన్‌లో ఆగుతుందని సోషల్ మీడియాలో ప్రకటించిన ట్రంప్, తర్వాత మాత్రం తాను పాత ఎయిర్ ఫోర్స్ వన్‌లోనే అమెరికాకు తిరిగి వెళ్తున్నట్లు వెల్లడించారు.

'వారి చంపాల్సిన జాబితాలో నేనే ఫస్ట్​'
విమాన మార్పునకు భద్రతా కారణాలున్నాయా అని విలేకరులు ప్రశ్నించగా ట్రంప్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. అయితే "ఇరాన్ దృష్టిలో చంపాల్సిన వారి జాబితాలో నేనే మొదటి స్థానంలో ఉంటాను" అని వ్యాఖ్యానించారు. మరోసారి ఇదే ప్రశ్న అడగగా, తాను సాధారణ పద్ధతిలోనే ప్రయాణిస్తున్నానని, కొత్త విమానాన్ని మాత్రం అమెరికా సైనికులకు చూపించేందుకు పంపుతున్నామని చెప్పారు. ఈ అంశంపై అమెరికా వైమానిక దళం స్పందిస్తూ, అధ్యక్షుడి ప్రయాణ భద్రతకు సంబంధించిన వివరాలపై వ్యాఖ్యానించబోమని తెలిపింది. వైట్ హౌస్ అధికార ప్రతినిధి స్టీవెన్ చెంగ్ మాత్రం కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ అత్యాధునిక భద్రతా వ్యవస్థలతో రూపొందించారని, అధ్యక్షుడి భద్రతకు అవసరమైన అన్ని ప్రమాణాలు అందులో ఉన్నాయని స్పష్టం చేశారు.

ఈ రాత్రి ఇరాన్‌పై భీకర దాడులు చేస్తాం- ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్‌

ఇరాన్‌ నేతలు చెడ్డవారు- టెహ్రాన్​తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది: ట్రంప్