టిబెట్‌లో విరిగిపడ్డ కొండచరియలు- ముగ్గురు మృతి- 800 మందికిపైగా మిస్సింగ్!
మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం- తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్- రవాణా విమానం ద్వారా ఓ ప్రత్యేక సైనిక బృందం తరలింపు

Published : August 27, 2026 at 10:37 AM IST
Tibet Mudslide : టిబెట్‌లో మొదలైన అకస్మిక వరదలు అక్కడ కూడా భారీ నష్టాన్ని మిగిల్చింది. నేపాల్ సరిహద్దుల్లో ఉన్న గైరాంగ్ పోర్టును వరద ముంచెత్తగా ముగ్గురు మృతిచెందారు. 588 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విపత్తుపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. Y-20 రవాణా విమానం ద్వారా ఓ ప్రత్యేక సైనిక బృందాన్ని వరద ప్రభావిత ప్రాంతానికి తరలించారు. ఈ బృందం ఇప్పటికే రంగంలోకి దిగి రహదారులను పునరుద్ధరిస్తోంది. వరదల ధాటికి గైరాంగ్ పోర్టు నగరం తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడే అనేక మంది గల్లంతమయ్యారు. చూస్తుండగానే ఉప్పెన లాగా వరద, బురద ముంచెత్తింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
నేపాల్ వరదలు- 165 మంది మృతి
మరోవైపు, నేపాల్‌ను అతలాకుతలం చేసిన భారీ ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటివరకు 165 మంది మరణించారు. దాదాపు 580 మంది పర్యాటకులతో సహా 800 మందికి పైగా గల్లంతయ్యారని నేపాల్ గురువారం తెలిపింది. బుధవారం నేపాల్- టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన వినాశకరమైన వరదల కారణంగా 826 మందితో సంబంధాలు తెగిపోయాయని 'నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ' (NDRRMA) ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, NDRRMA గణాంకాల ప్రకారం, గల్లంతైన వారిలో 85 మంది భద్రతా దళాల సిబ్బంది, వివిధ జలవిద్యుత్, కస్టమ్స్ కార్యాలయాల్లో పనిచేస్తున్న 162 మంది ఉద్యోగులు, 579 మంది పర్యటకులు ఉన్నారు.

ప్రకృతి విలయ తాండవం
నేపాల్‌లో ప్రకృతి విలయ తాండవంతో ఎన్నో కుటుంబాలు అతలాకుతళం అయ్యాయి. అనేక మంది వరద ప్రవాహంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రతి గంట గంటకు ఆందోళనకర రీతిలో పెరుగుతున్న మృతుల సంఖ్య యావత్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. మరోవైపు, నేపాల్‌లో సంభవించిన భీకర వరదల బాధితుల కోసం జమ్మూలోని శిక్షా నికేతన్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆత్మశాంతి కలగాలని మౌనం పాటించారు. నేపాల్ కష్టకాలాన్ని గడుపుతున్న వేళ తమ ప్రగాఢ సానుభూతిని, సంఘీభావాన్ని ప్రకటించారు. సరిహద్దు దేశాలు కష్టకాలంలో ఉన్నప్పుడు విద్యార్థుల్లో మానవతా దృక్పథాన్ని, తోటివారి పట్ల సానుభూతిని పెంపొందించే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
రెస్య్యూలో విపత్తు దళాలు
ఇదిలా ఉండగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం చైనా ప్రభుత్వం విపత్తు ప్రతిస్పందన దళాలను రంగంలోకి దించింది. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థల పునరుద్ధరణ పనులను ముమ్మరం చేయాలని ఆదేశించింది. అత్యవసర సహాయక చర్యల కోసం బీజింగ్ సుమారు 18 మిలియన్ డాలర్లను విడుదల చేసింది. పునరుద్ధరణ, పునర్నిర్మాణ పనుల కోసం మరో 14 మిలియన్ డాలర్లను కేటాయించింది. వరద ప్రభావిత ప్రాంతాల బాధితుల కోసం ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరోవైపు, వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారులను ఆదేశించారు.
మరోవైపు, నేపాల్ మెరుపు వరదలు వాతావరణంలో ఆకస్మిక మార్పుల కారణంగా జరిగిన విధ్వంసం కాదు. లోతుగా పరిశీలించి చూస్తే, విపత్తుల ముప్పు అత్యంత ఎక్కువగా ఉన్న దేశంగా నేపాల్‌ను మార్చిన రెండు దృగ్విషయాల కలయిక వల్ల ఈ వరదలు సంభవించినట్లు తెలుస్తోంది. మరోవైపు, టిబెట్‌లోని ఎత్తైన ప్రాంతంలో సంభవించిన మంచు హిమపాతం వల్లే ఈ వరద విలయం సంభవించిందని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటెగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్‌మెంట్-ICIMOD సంస్థ ప్రాథమికంగా అంచనా వేసింది.
ఇరు దేశాల సైన్యాల మధ్య సమాచార మార్పిడి- భారత్, చైనా కీలక నిర్ణయం

