ETV Bharat / international

'యోగా ద్వారా రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం'- ఉజ్బెకిస్థాన్​లో మోదీ స్పెషల్ ఈవెంట్

విదేశీ పర్యటనలో భాగంగా ఉజ్బెకిస్థాన్‌లో ఉన్న ప్రధాని మోదీ- యోగాకు అపారమైన ఆదరణ ఉందన్న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ- ఎక్స్​ పోస్టులో ఫొటోలు విడుదల- ప్రవాస భారతీయులు నృత్యాలను వీక్షించిన ప్రధాని

Modi Joins Yoga Session
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : August 30, 2026 at 12:07 PM IST

3 Min Read
Choose ETV Bharat

Modi Joins Yoga Session : విదేశీ పర్యటనలో భాగంగా ఉజ్బెకిస్థాన్​లో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాజధాని తాష్కెంట్​లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక పోస్ట్‌ చేసింది. "ఉజ్బెకిస్థాన్‌లో యోగాకు అపారమైన ఆదరణ ఉంది. ఇది ప్రజలను, సంస్కృతులను ఏకం చేస్తూ, భారత్- ఉజ్బెకిస్థాన్ ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తోంది" అని ఎక్స్​ పోస్ట్‌లో పేర్కొంది. యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారితో మోదీ సంభాషిస్తున్న ఫొటోలను మంత్రిత్వ శాఖ పంచుకుంది.

ఇదొక మరపురాని అనుభవం
మరోవైపు, యోగా కార్యక్రమంలో పాల్గొన్న తాష్కెంట్​ నివాసి క్రిస్టినా తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమం ఒక గొప్ప వ్యక్తితో కలిసి పనిచేయడం చేయడం మరపురాని అనుభవమని పేర్కొన్నారు. యోగా రెండు దేశాలను మరింత దగ్గర చేసి స్నేహాన్ని బలపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరియం కూడా తమ ఆనందాన్ని వ్యక్త పరిచారు. తాము ఇదివరకు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నామని, అయితే, ఇప్పుడు కలిగిన అనుభవం చాలా సంతోషంగా అనిపిస్తోందన్నారు. తాము ఇక్కడికి రావడం ఆహ్వానంలో భాగం కావడం తమకు చాల ఆనందాన్నించిదని తెలిపారు. తాము ఇండియన్​ యోగా సెంటర్​లో తమ బృందంతో కలిసి శిక్షణ తీసుకున్నామని చెప్పారు.

'భారత్​ మాతా కీ జై' అంటూ నినాదాలు
ఇదిలా ఉండగా, రెండురోజుల అధికార పర్యటన నిమిత్తం ఆగస్టు 29,30 తేదీల్లో మోదీ ఉజ్బెకిస్థాన్​లో పర్యటిస్తున్నారు. శనివారం ఉజ్బెకిస్థాన్​ రాజధాని తాష్కెంట్‌ చేరుకున్న ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్‌తో కలిసి 'యాంగీ ఉజ్బెకిస్థాన్ పార్క్' లోని స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మోదీ రాకతో తాష్కెంట్‌లోని ప్రసిద్ధ 'హిల్టన్ హోటల్' సహా పలు ప్రతిష్ఠాత్మక భవనాలను త్రివర్ణ రంగులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అనంతరం సంప్రదాయ నృత్య ప్రదర్శనలు చేపట్టారు.

చిన్నారుల నృత్యాలను వీక్షించిన మోదీ
మరోవైపు, తాష్కెంట్​లో లభించిన స్వాగతం, ఇరుదేశాల సాంస్కృతిక సంబంధాలకు వేడుకగా నిలిచిందని మోదీ ఎక్స్​ పోస్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. భారత్​, ఉజ్బెకిస్థాన్​ సంప్రదాయాల సమ్మేళనంతో కూడిన కార్యక్రమం గురించి మోదీ ప్రస్తావించారు. 'ఉడే జబ్ జబ్ జుల్ఫే తేరీ' పాటకు చిన్నారుల చేసిన నృత్యాలను ప్రత్యేకంగా వీక్షించారు. అలాగే, బాలీవుడ్ బ్యాటిల్ గ్రూప్ ప్రదర్శన, ఉత్సాహభరితమైన అండిజన్ పోల్కాతో కథక్‌ను మేళవించిన తీరు, లాల్ బహదూర్ శాస్త్రి సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్ విద్యార్థులు ప్రదర్శించిన కథక్ ప్రదర్శనలను చూశారు. చప్పట్లు కొడుతూ వారిని అభినందించారు. అక్కడే ఉన్న ప్రవాస భారతీయులు 'భారత్​ మాతా కీ జై' అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంగణం అంతా మార్మోగింది.

ఇరుదేశాల సంబంధాల బలోపేత కోసం కీలక చర్చలు
కాగా, ఉజ్బెకిస్థాన్‌లో మోదీ పర్యటించడం ఇది నాలుగోసారి. అంతకుముందు, 2015లో జరిగిన దౌత్యపరమైన కార్యక్రమాలతో పాటు, SCO సదస్సులకు హాజరయ్యేందుకు 2016, 2022లలో పర్యటించారు. మోదీ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు బలోపేతం కోసం కీలక చర్చలు జరిపనున్నారు. వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, ఇంధనం, విద్య, వంటి వాటిలో కీలక సహకారాన్ని సమీక్షించి, భవిష్యత్​ కార్యచరణకు అజెండాను నిర్దేశించనున్నారు. తాష్కెంట్ పర్యటన ముగిసిన అనంతరం, కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు, మోదీ బిష్కెక్ బయలుదేరనున్నారు. అక్కడ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 26వ ఎస్‌సీఓ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనున్నారు.

ప్రవాస భారతీయులు కర్మభూమికి విధేయులుగా ఉండాలి: మోహన్ భాగవత్

మళ్లీ ఉప్పొంగుతున్న భోటే కోషి- నేపాల్​లో హైఅలర్ట్​- భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక!