ఇరాన్ 'గుండెకాయ' లక్ష్యం- టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు
అమెరికా స్థావరాలపై ప్రతిదాడులకు దిగిన ఇరాన్- దద్దరిల్లుతున్న పశ్చిమాసియా

Published : March 1, 2026 at 3:03 PM IST
Massive Explosion Hits Tehran : ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఆదివారం ఇజ్రాయెల్, అమెరికాలు దాడులకు పాల్పడ్డాయి. ఈ పేలుళ్ల ధాటికి భారీగా పొగలు రావడమే కాదు, భూమి కూడా కంపించింది. ఇరాన్ రాజధానికి గుండెకాయ లాంటి కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే స్పష్టం చేసింది. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే తాము టెహ్రాన్ వెళ్లే మార్గాన్ని క్లియర్ చేసుకున్నామని, రెండో రోజున సెంట్రల్ టెహ్రాన్‌పై దాడులు చేస్తున్నామని పేర్కొంది. అయితే కచ్చితమైన లక్ష్యం ఏంటనేది మాత్రం చెప్పలేదు. అయితే ఇరాన్ పోలీస్ ప్రధాన కార్యాలయం, ప్రభుత్వ టెలివిజన్ ఆఫీస్‌లు ఉన్న పరిసరాల్లో ఈ పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది.
ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఇరాన్‌పై తమ దాడులు ఇంకా భీకరంగా కొనసాగుతాయని ఆదివారం స్పష్టం చేశారు.
"రానున్న రోజుల్లో మేము ఇరాన్‌లోని ఉగ్రవాద పాలకులకు చెందిన వేలాది లక్ష్యాలపై విరుచుకుపడతాం. ధైర్యవంతులైన ఇరాన్ ప్రజలు తమను తాము, ఈ క్రూరమైన నిరంకుశ సంకెళ్ల నుంచి విముక్తి పొందేందుకు అవసరమైన పరిస్థితులను మేము సృష్టిస్తాం. అందుకే నేను మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇరాన్ పౌరులారా ఈ గొప్ప అవకాశాన్ని చేజారనివ్వకండి. ఇలాంటి అవకాశం తరానికి ఒక్కసారే వస్తుంది."
- నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని
అమెరికా స్థావరాలపై ఇరాన్ కౌంటర్ ఎటాక్
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన నేపథ్యంలో ఆదేశం ప్రతీకార దాడులకు దిగింది. తాజాగా పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. వీటిలో ఇజ్రాయెల్‌లోని టెల్ నోప్ ఎయిర్వేస్, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం హాకిర్యాలతోపాటు రక్షణ రంగ ఫ్యాక్టరీలు కూడా ఉండడం గమనార్హం. అంతేకాదు అమెరికా నౌకలకు మందుగుండు సరఫరా చేసే ఎంఎస్పీ షిప్‌పై 'ఆపరేషన్ ట్రూ ప్రామిస్'లో భాగంగా, 4 డ్రోన్లతో దాడి చేసినట్లు టెహ్రాన్ వెల్లడించింది.
Israel's Prime Minister Benjamin Netanyahu posts, " in the coming days, we will strike thousands of targets of the terrorist regime. we will create the conditions for the brave people of iran to free themselves from the chains of tyranny. and for this reason, i address you once… pic.twitter.com/62myLY1rbE
— Press Trust of India (@PTI_News) March 1, 2026
ఖమేనీని ఖతం చేశాం: ఐడీఎఫ్ ప్రకటన
టెహ్రాన్‌లోని ఉగ్రవాద కూటమి (టెర్రర్ యాక్సెస్) నేత అయతొల్లా అలీ ఖమేనీని 'అత్యంత కచ్చితమైన, భారీ ఆపరేషన్' చేపట్టి అంతం చేశామని ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) ఆదివారం ప్రకటించింది. ఇజ్రాయెల్ ఉనికికి ఉన్న ముప్పును శాశ్వతంగా తొలగించే లక్ష్యంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేసింది. 1989 నుంచి ఇస్లామిక్ రిపబ్లిక్ సుప్రీం లీడర్‌గా ఉన్న ఖమేనీ అనేక సంవత్సరాలుగా ఇరాన్ పౌరులను హింసాత్మకంగా అణిచివేస్తున్నాడని, అందుకే అతను దానికి ప్రత్యక్ష బాధ్యుడని పేర్కొంది.
Visuals after the Iranian missile attack on UAE (Dubai, Abu Dhabi): pic.twitter.com/dFIIcCGrND
— Defence Matrix (@Defencematrix1) February 28, 2026
"ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేసే ప్రణాళికకు ఖమేనీ రూపశిల్పి. పశ్చిమాసియా అంతటా, ఇజ్రాయెల్ సరిహద్దుల వరకు విస్తరించిన 'ఇరాన్ ఆక్టోపస్'కు ఆయన తలకాయ లాంటివాడు. లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ ఇందులో ప్రధానమైనది. ఇజ్రాయెల్‌పై జరిగిన ఉగ్రదాడులకు అతనే బాధ్యుడు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పౌరుల రక్తం ఆయన చేతులకు అంటి ఉంది. ఈ ఉగ్రనేత నిర్మూలనతో ఒక దశాబ్దకాలం నాటి సుదీర్ఘ అధ్యాయం ముగిసింది."
- ఐడీఎఫ్
తీవ్ర ఆందోళనలు
ఇజ్రాయెల్, అమెరికా దళాలు చేసిన దాడుల్లో ఇరాన్ అధినేత ఖమేనీ మృతి చెందిన నేపథ్యంలో బాగ్దాద్‌లోని గ్రీన్ జోన్ సమీపంలో తీవ్ర ఆందోళనలు జరిగాయి. మరోవైపు పాకిస్థాన్‌లోనూ ఖమేనీ మృతి చెందారన్న వార్తలో ఉద్రిక్త పరిస్థితు ఏర్పడ్డాయి. ముఖ్యంగా కరాచీలోని అమెరికా కాన్సులేట్ వద్ద పోలీసులు- నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. దీనితో దాదాపు 9 మంది మరణించగా, అనేక మంది క్షతగాత్రులైనట్లు తెలుస్తోంది.
వామ్మో! ఖమేనీకి అంత సంపద ఉందా? ట్రంప్, నెతన్యాహూల కంటే సంపన్నుడా?
ఖమేనీ మృతి వేళ పాకిస్థాన్‌లో ఉద్రిక్తతలు- 9మంది నిరసనకారులు మృతి

