లెబనాన్‌తో చర్చలకు నెతన్యాహు గ్రీన్ సిగ్నల్

Published : April 9, 2026 at 7:00 AM IST
|Updated : April 9, 2026 at 9:34 PM IST
West Asia Tensions Live Updates : పశ్చిమాసియాలో ఉత్కంఠకు తెరపడలేదు. ఉద్రిక్తతలూ తొలగిపోలేదు. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం కుదరడంతో యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయినట్లు కనిపించినా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
LIVE FEED
లెబనాన్‌తో ప్రత్యక్ష చర్చలకు ఇజ్రాయెల్ అనుమతి
లెబనాన్‌తో నేరుగా చర్చలు ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. వీలైనంత త్వరగా ఈ చర్చలు ప్రారంభించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. లెబనాన్ తరఫున వచ్చిన అభ్యర్థనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇరు దేశాల మధ్య శాంతి సంబంధాలను నెలకొల్పడం కూడా ఈ చర్చల ప్రధాన లక్ష్యంగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై లెబనాన్ నుంచి అధికారిక స్పందన వెలువడలేదు.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘేర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. రెండు వారాల కాల్పుల విరమణ లెబనాన్‌కూ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
హర్మూజ్ నుంచి వెనుదిరుగుతున్న నౌకలు!
ఇరాన్- అమెరికా కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఈ దాడులపై ఆగ్రహం వ్యక్తంచేసిన ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన కీలక విషయం వెలుగులోకి వచ్చింది. జలసంధిని పూర్తిగా మూసేయడంతో దీని మీదుగా వెళ్లాల్సిన నౌకలు బలవంతంగా వెనక్కి మరలుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
మాపై ఆంక్షలు విధించి- శత్రువులు విజయం సాధించలేరు: ఇరాన్ అణు సంస్థ చీఫ్
అణు ఇంధనాన్ని పరిరక్షించుకోవడం టెహ్రాన్ హక్కు అని ఇరాన్ అణు సంస్థ చీఫ్ గురువారం అన్నారు. అమెరికాతో చర్చలకు టెహ్రాన్ హక్కుల పరిరక్షణ అత్యవసరమని తేల్చిచెప్పారు. ఇరాన్‌పై ఆంక్షలు విధించి శత్రువులు విజయం సాధించలేరని పేర్కొన్నారు.
వైమానిక దాడిలో హెజ్బొల్లా నాయకుడి కార్యదర్శి మృతి
ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, బుధవారం బీరూట్‌పై జరిపిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లా సెక్రటరీ-జనరల్ నయీమ్ ఖాసెమ్ వ్యక్తిగత కార్యదర్శి అలీ యూసుఫ్ హర్షీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు గురువారం ప్రకటించాయి. "ఖాసెమ్‌కు అత్యంత సన్నిహితుడు, వ్యక్తిగత సలహాదారు అయిన హర్షీ, ఆయన కార్యాలయాన్ని నిర్వహించడంలో, భద్రపరచడంలో కీలక పాత్ర పోషించారు. లిటానీ నదికి దక్షిణంగా ఆయుధాలను తరలించడానికి హెజ్బొల్లా ఉపయోగించే రెండు కీలక క్రాసింగ్‌లపై, అలాగే దక్షిణ లెబనాన్‌లోని సుమారు 10 ఆయుధ నిల్వ కేంద్రాలు, లాంచర్లు, కమాండ్ సెంటర్లపై కూడా IDF దాడి చేసింది" అని IDF తెలిపింది. ఇరాన్, అమెరికా కాల్పుల విరమణ ప్రకటించిన కొద్దిసేపటికే, గత 24 గంటల్లో లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో వందలాది మంది మరణించారు.
దేశంలో ఇంధన కొరత ఆందోళనలు నెలకొన్న వేళ, కేంద్రమంత్రులు హర్‌దీప్ సింగ్ పురీ, జైశంకర్‌లు గల్ఫ్ దేశాల్లో పర్యటించనున్నారు.
హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన భారత నావికులకు కేంద్ర ప్రభుత్వం కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఈమేరకు తాజాగా ప్రకటనను విడుదల చేసింది.
నిజమైన ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి ఉండకపోతే భారీ దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
యుద్ధనౌకలు, విమానాలు, సైనిక సిబ్బంది, ఆయుధాల వంటివన్నీ ఇరాన్, దాని పరిసర ప్రాంతాల్లోనే యుద్ధం ముగింపునకు సంబంధించి పూర్తిస్థాయి ఒప్పందం అమలయ్యేంత వరకు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ ఒప్పందాన్ని ఇరాన్ పాటించకపోతే, తాము మునుపెన్నడూ చూడనంత స్థాయిలో విరుచుకు పడతామని హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిని తెరవాలని చెప్పారు. అప్పుడు తమ సైన్యం విశ్రాంతి తీసుకుంటూ, తమ తదుపరి మిషన్ కోసం ఎదురుచూస్తుందన్నారు.
ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మూడు వెర్షన్లలో తన 10 పాయింట్ల ప్రతిపాదనలు పంపిందన్నారు. అందులో ఒకటి చాట్‌జీపీటీ రాసినట్లుగా ఉందని మీడియాతో అన్నారు.
అమెరికా, ఇరాన్‌ల మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ , బుధవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. అయితే అమెరికాలోని పాకిస్థాన్ రాయబారి రిజ్వాన్ సయీద్ షేక్, ఇజ్రాయెల్ దాడులు చేసినప్పటికీ కాల్పుల విరమణ లెబనాన్‌కు కూడా వర్తిస్తుందని అన్నారు. కాల్పుల విరమణ చర్చలలో బీరూట్‌కు శాంతి కూడా ఉందని పేర్కొన్నప్పటికీ, అవి ప్రామాణికమైనవేని పేర్కొన్నారు .
ఇరాన్‌తో జరిగిన యుద్ధ ఉద్రిక్తతల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ గ్రీన్‌లాండ్ అంశంపై దృష్టి సారించారు. ఇదే సమయంలో నాటో మిత్రదేశాలపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. "మనం అవసరమైనప్పుడు నాటో మాతో లేదు. భవిష్యత్తులో కూడా ఉండదు. గ్రీన్‌లాండ్ గుర్తుంచుకోండి" అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న గ్రీన్‌లాండ్‌పై అమెరికా ఆసక్తి ఇంకా కొనసాగుతోందని స్పష్టమవుతోంది.
కాల్పుల విరమణ లేదా ఇజ్రాయెల్ ద్వారా యుద్ధాన్ని కొనసాగించడం, ఈ రెండింటిలో ఒకదాన్ని అమెరికా తేల్చుకోవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ హెచ్చరించారు. "ఇరాన్-అమెరికా కాల్పుల విరమణ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అమెరికా తప్పనిసరిగా ఎంచుకోవాలి. కాల్పుల విరమణ లేదా ఇజ్రాయెల్ ద్వారా యుద్ధాన్ని కొనసాగించడం. రెండూ ఒకేసారి సాధ్యం కాదు" అని తెలిపారు.
లెబనాన్‌పై భారీ స్థాయిలో విరుచుకుపడింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దాడుల్లో 254 మందికిపైగా మృతి చెందగా, 1100 మందికి గాయాలయ్యాయి. 10 నిమిషాల వ్యవధిలో బీరూట్, దక్షిణ లెబనాన్, బెకా వ్యాలీలో దాడులు జరిగాయి. 100కుపైగా లక్ష్యాలపై ఐడీఎఫ్ వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్. లెబనాన్‌పై 1982 తర్వాత ఇజ్రాయెల్ ఇదే అతిపెద్ద దాడిగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో మతపెద్ద సాధిక్ అల్ నబుల్సీ మృతి చెందారు.
లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగం కాదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. కాల్పుల విరమణ యుద్ధానికి ముగింపు కాదని, లక్ష్య సాధనలో చిన్న విరామం మాత్రమేనని అన్నారు. ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం కచ్చితంగా ఆ దేశం నుంచి బయటకు వెళ్లాల్సిందే అని తేల్చిచెప్పారు. అందుకు టెహ్రాన్ అంగీకరించకుంటే యుద్ధం కొనసాగించి యురేనియం స్వాధీనం చేసుకుంటామని నెతన్యాహు హెచ్చరించారు. తమ వేలు ఇంకా ట్రిగ్గర్‌పైనే ఉందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

