ETV Bharat / international

ఇరాన్‌ ప్రతీకార దాడులు- దుబాయ్‌, దోహాలలో పేలుళ్ల శబ్దాలు!

US Israel Iran War Live Updates
US Israel Iran War Live Updates (AP News)
author img

By ETV Bharat Telugu Team

Published : March 3, 2026 at 8:47 AM IST

|

Updated : March 3, 2026 at 11:04 PM IST

Choose ETV Bharat

US Israel Iran War Live Updates : పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు సోమవారం మరింత తీవ్రరూపు దాల్చాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాల సైనిక చర్య ఉద్ధృతంగా సాగుతోంది. లెబనాన్‌ నుంచి తమపై దాడికి తెగబడిన హెజ్బొల్లాపైనా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అటు ఇరాన్, దాని మిత్రదేశాలు, ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోని చమురు శుద్ధి కేంద్రాలపై దాడికి దిగాయి. ఈ దాడుల తీవ్రత పెరుగుతుండగా యుద్ధం నుంచి బయటపడే స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం వంటి అంశాలు సుదీర్ఘ పోరాటానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ఇరాన్‌పై సైనిక చర్య మరికొన్ని వారాలు కొనసాగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.

LIVE FEED

11:03 PM, 3 Mar 2026 (IST)

సైప్రస్‌కు బ్రిటన్‌ యుద్ధవిమానం, హెలికాప్టర్లు

  • సైప్రస్‌కు బ్రిటన్‌ యుద్ధవిమానం, హెలికాప్టర్లు
  • ఇరాన్‌ డ్రోన్‌ దాడితో స్వల్పంగా దెబ్బతిన్న సైప్రస్‌లోని బ్రిటన్‌ స్థావరం

11:03 PM, 3 Mar 2026 (IST)

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు- దుబాయ్‌, జెడ్డాలకు ఎయిరిండియా ప్రత్యేక సర్వీసులు

  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు- దుబాయ్‌, జెడ్డాలకు ఎయిరిండియా ప్రత్యేక సర్వీసులుa
  • దిల్లీ, ముంబయి నుంచి రెండు సర్వీసులు నడుస్తాయని వెల్లడి
  • బుధవారం స్వదేశానికి రానున్నట్లు వెల్లడించిన ఎయిరిండియా

11:02 PM, 3 Mar 2026 (IST)

  • ఇరాన్‌ ప్రతీకార దాడులు- దుబాయ్‌, దోహాలలో పేలుళ్ల శబ్దాలు!
  • ఇరాన్‌, లెబనాన్‌లపై దాడులు కొనసాగిస్తామన్న నెతన్యాహు

7:51 PM, 3 Mar 2026 (IST)

లెబనాన్​పై ఇరాన్ దాడి- ఇప్పటి వరకు 40 మంది మృతి

  • లెబనాన్‌లో ఇప్పటివరకు 40 మృతి, 246 మందికి గాయాలు
  • లెబనాన్‌పై ఇరాన్‌ చేస్తున్న దాడుల్లో 40 మంది మృతి

7:17 PM, 3 Mar 2026 (IST)

ఇజ్రాయెల్​పై ఇరాన్ భీకర ప్రతీకారదాడులు

  • సెంట్రల్ ఇజ్రాయెల్‌ను తాకిన ఇరాన్ క్షిపణులు
  • ఇరాన్‌ క్షిపణులు దూసుకొచ్చినట్లు ప్రకటించిన ఇజ్రాయెల్ సైన్యం

6:54 PM, 3 Mar 2026 (IST)

  • ఇరాన్‌ తాజాగా మాతో చర్చలకు ప్రయత్నించింది: డొనాల్డ్‌ ట్రంప్‌
  • ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఇరాన్‌తో చెప్పాను: ట్రంప్‌
  • ఇరాన్‌ నాయకత్వాన్ని నాశనం చేశాం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌
  • ఇరాన్‌ ఎయిర్ డిఫెన్స్‌, ఎయిర్‌ఫోర్స్‌, నేవీని నాశనం చేశాం: ట్రంప్‌
  • ఇరాన్‌తో యుద్ధం గురించి ట్రూత్‌లో పోస్టు చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌

6:16 PM, 3 Mar 2026 (IST)

ఇరాన్‌పై యూఏఈ, బహ్రెయిన్ ఎటాక్​- భారీగా డ్రోన్లు, క్షిపణుల ప్రయోగం

  • ఇరాన్‌ 186 క్షిపణులు, 812 డ్రోన్లు ప్రయోగించినట్లు యూఏఈ రక్షణశాఖ ప్రకటన
  • ఇరాన్ ప్రయోగించిన 172 క్షిపణులను ధ్వంసం చేసినట్లు యూఏఈ ప్రకటన
  • ఇరాన్ ప్రయోగించిన 755 డ్రోన్లను అడ్డుకున్నట్లు ప్రకటించిన యూఏఈ
  • ఇరాన్‌ నుంచి వచ్చిన 73 క్షిపణులను, 91 డ్రోన్లను ధ్వంసం చేశామన్న బహ్రెయిన్

5:13 PM, 3 Mar 2026 (IST)

ఒమన్‌ సుల్తాన్‌, కువైట్‌ రాజుతో మాట్లాడిన ప్రధాని మోదీ

  • ఒమన్‌ సుల్తాన్‌, కువైట్‌ రాజుతో మాట్లాడిన ప్రధాని మోదీ
  • ఒమన్‌ సుల్తాన్‌ హైతమ్‌ బిన్ తారిక్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని
  • కువైట్‌ రాజు షేక్ సబా అల్-ఖలీద్ ముబారక్‌తో మాట్లాడిన మోదీ
  • ఒమన్‌, కువైట్‌లో జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేసిన మోదీ
  • ఒమన్‌, కువైట్‌లో ఉన్న భారతీయుల భద్రత గురించి చర్చించిన మోదీ
  • ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్‌ అల్ థానీతో మాట్లాడిన ప్రధాని మోదీ
  • ఖతార్‌పై జరిగిన దాడులను ఖండించిన ప్రధాని మోదీ
  • ఖతార్‌లో ఉన్న భారతీయుల భద్రత గురించి చర్చించిన మోదీ
  • ఖతార్‌లోని భారతీయుల పట్ల జాగ్రత్తలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన మోదీ

5:10 PM, 3 Mar 2026 (IST)

  • కువైట్‌లోని అమెరికా స్థావరంపై దాడి చేసిన ఇరాన్‌
  • ఇరాన్‌ దాడుల్లో మొత్తం ఆరుగురు అమెరికా సైనికులు మృతి

4:27 PM, 3 Mar 2026 (IST)

  • ఇరాన్‌ అధ్యక్షుడి భవనంపై దాడి చేసిన ఇజ్రాయెల్‌
  • టెహ్రాన్‌లోని ఇరాన్‌ అధ్యక్షుడి భవనంపై ఇజ్రాయెల్‌ దాడి
  • ఇరాన్‌ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యాలయంపైనా ఇజ్రాయెల్‌ దాడి
  • ఇరాన్‌ మిలిటరీ శిక్షణ కేంద్రంపైనా దాడి చేసిన ఇజ్రాయెల్‌

3:38 PM, 3 Mar 2026 (IST)

  • దేశంలో విమాన సర్వీసులపై మధ్యప్రాచ్యంలో యుద్ధ ప్రభావం
  • దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు నుంచి 250 విమాన సర్వీసులు రద్దు
  • దిల్లీ నుంచి 80, ముంబయి 107 విమాన సర్వీసులు రద్దు
  • బెంగళూరు 42, చెన్నై నుంచి 30 విమాన సర్వీసులు రద్దు
  • గత మూడ్రోజుల్లో మొత్తం 1,117 విమానసర్వీసులు రద్దు

2:51 PM, 3 Mar 2026 (IST)

  • ఇరాన్‌లోని గెరాష్‌ ప్రాంతంలో భూకంపం
  • ఇరాన్‌: రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 4.3గా నమోదు

2:41 PM, 3 Mar 2026 (IST)

  • లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భూతల దాడులు ప్రారంభం
  • దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ గ్రౌండ్‌ ఆపరేషన్స్‌
  • సరిహద్దుల నుంచి వైదొలుగుతున్న లెబనాన్‌ బలగాలు

1:24 PM, 3 Mar 2026 (IST)

  • పశ్చిమాసియాలోని యుద్ధంతో ముగ్గురు భారతీయులు మృతి
  • ఇప్పటివరకు ముగ్గురు భారతీయులు చనిపోయారని షిప్పింగ్‌ డైరెక్టర్‌ జనరల్‌ వెల్లడి
  • ముగ్గురు భారతీయ నావికులు చనిపోయినట్లు షిప్పింగ్‌ డీజీ వెల్లడి

12:26 PM, 3 Mar 2026 (IST)

  • హార్ముజ్‌ జలసంధి వద్ద చిక్కుకున్న 700కు పైగా నౌకలు
  • హార్ముజ్‌ జలసంధిని అధికారికంగా మూసివేసిన ఇరాన్‌
  • జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తే నౌకలను తగలబెడతామని హెచ్చరిక
  • ఇరాన్‌ చర్యతో హార్ముజ్‌ జలసంధి వద్ద చిక్కుకున్న 700కు పైగా నౌకలు
  • హార్ముజ్‌ వద్ద చిక్కుకున్న నౌకల్లో వందకు పైగా కంటైనర్‌ షిప్స్‌

12:02 PM, 3 Mar 2026 (IST)

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రాంతాల్లో మార్చి 5న జరగాల్సిన 10, 12వ తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరీక్షల నియంత్రణ అధికారి భరద్వాజ్ తెలిపారు.

11:41 AM, 3 Mar 2026 (IST)

ఇజ్రాయెల్‌లోని 'రామత్ డేవిడ్' ఎయిర్ బేస్‌పై తాము తెల్లవారుజామున దాడి చేసినట్లు హిజ్బుల్లా ప్రకటించింది. ఈ ఎయిర్ బేస్‌లోని రాడార్ కేంద్రాలు, కంట్రోల్ రూములను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అంతకుముందు, హిజ్బుల్లాకు అనుబంధంగా ఉన్న 'అల్-మనార్' టీవీ ఛానల్ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. అయితే, దాడి జరిగిన కొద్ది నిమిషాల్లోనే అల్-మనార్ ప్రసారాలను పునరుద్ధరించింది. ఇదిలా ఉండగా, లెబనాన్ రాజధాని బీరూట్‌లో ఇజ్రాయెల్ సోమవారం రాత్రి జరిపిన దాడిలో హిజ్బుల్లా నిఘా విభాగం చీఫ్ హుస్సేన్ మక్లెద్ మరణించినట్లు ఐడీఎఫ్ ధృవీకరించింది.

11:02 AM, 3 Mar 2026 (IST)

  • యూఏఈలో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు
  • యూఏఈ నుంచి 4 విమానాలు నడుపుతున్న స్పైస్ జెట్‌
  • యూఏఈలోని ఫుజైరా నుంచి దిల్లీ, ముంబయి, కొచ్చికి విమానాలు
  • రేపట్నుంచి ఫుజైరా-దిల్లీ, ఫుజైరా-ముంబయి విమాన సర్వీసులు
  • అవసరాల మేరకు మరిన్ని విమానాలు నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడి
  • దుబాయ్ నుంచి బెంగళూరు చేరుకున్న కొందరు ప్రయాణికులు
  • ఒమన్ నుంచి ప్రయాణికులతో దిల్లీ చేరుకున్న మరో విమానం

10:02 AM, 3 Mar 2026 (IST)

సౌదీ అరేబియాలోని ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం ఆరామ్‌కోపై జరిగిన డ్రోన్ దాడిపై ఇరాన్ మీడియా సంచలన కామెంట్స్ చేసింది. ఈ దాడి వెనుక ఉన్నది ఇరాన్ కాదన్నారు. ఇది ఇజ్రాయెల్ ఆడిన నాటకమని ఇరాన్‌కు చెందిన అధికారిక వార్తా సంస్థ 'తస్నీమ్' పేర్కొంది. ఇజ్రాయెల్ కావాలని సౌదీ చమురు కేంద్రంపై దాడి చేసి, ఆ నెపాన్ని ఇరాన్ మీదకు నెట్టడం ద్వారా గల్ఫ్ దేశాలను ఇరాన్‌కు శత్రువులుగా మార్చాలని చూస్తోందని తస్నీమ్ ఆరోపణలు గుప్పించింది.

8:44 AM, 3 Mar 2026 (IST)

  • సౌదీఅరేబియా: రియాద్‌లోని అమెరికా ఎంబసీపై డ్రోన్ల దాడి
  • రియాద్‌లోని అమెరికా ఎంబసీపై 2 డ్రోన్లు దాడి చేశాయన్న సౌదీ
  • డ్రోన్ల దాడితో మంటలు చెలరేగి, భవనం స్వల్పంగా దెబ్బతిందన్న సౌదీ

8:44 AM, 3 Mar 2026 (IST)

  • ఇరాన్‌పై దాడుల వివరాలను వెల్లడించిన అమెరికా శ్వేతసౌధం ప్రతినిధి కరోలిన్ లీవిట్
  • ఇరాన్‌లో 49 మంది అత్యున్నత స్థాయి నేతలను మట్టుబెట్టాం: కరోలిన్‌ లీవిట్‌
  • "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" ద్వారా ఇరాన్‌లో 49 మంది నేతలను మట్టుబెట్టాం: కరోలిన్‌
  • ఒమన్ గల్ఫ్‌లో ఉన్న ఇరాన్‌కు చెందిన 11 యుద్ధ నౌకలను పేల్చేశాం: కరోలిన్‌ లీవిట్‌
  • ఇరాన్‌ దాడుల్లో ఇప్పటివరకు ఆరుగురు అమెరికా సైనికులు
Last Updated : March 3, 2026 at 11:04 PM IST