ఇరాన్‌తో దీర్ఘకాలిక యుద్ధం- అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాం: ట్రంప్

Published : March 2, 2026 at 2:50 PM IST
|Updated : March 2, 2026 at 10:59 PM IST
US Israel Iran War Live Update : ఇజ్రాయెల్- అమెరికా కలిసి ఇరాన్‌పై దాడులు చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. దీంతో ఇరాన్ ప్రతికార దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా స్థావరాలు ఉన్న దేశాలపై దాడులు చేస్తోంది. సోమవారం పశ్చియాసియాలో దాడులు కొనసాగుతున్నాయి.
LIVE FEED
ఇరాన్‌తో మరో 4-5 వారాలు యుద్ధం జరగొచ్చు: ట్రంప్
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం బహుశా 4 నుంచి 5 వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంచనా వేశారు. అవసరమైతే అంతకంటే ఎక్కువ కాలం పోరాటం చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సోమవారం వైట్‌హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
2 ఇరాన్ యుద్ధవిమానాలను కూల్చేశాం: ఖతార్ ప్రకటన
తమ గగనతలాన్ని ఉల్లంఘించిన రెండు ఇరాన్ 'సుఖోయ్ Su-24' బాంబర్లను కూల్చేసినట్లు దేశ రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది.
జెడ్డాకు 10 ప్రత్యేక విమానాలు- భారతీయులను వెనక్కు తెచ్చేందుకు కేంద్రం చర్యలు
- గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు
- రేపు జెడ్డా నుంచి 10 ప్రత్యేక విమానాలు నడపనున్న ఇండిగో
- ఖమేనీ మృతితో ఇరాన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు: ట్రంప్
- ఇరాన్ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉంది: ట్రంప్
- ఇరాన్ మిలిటరీ ఉన్నతాధికారులు చాలావరకు చనిపోయారు: ట్రంప్
- ఇరాన్‌లోని వందల లక్ష్యాలపై దాడులు చేశాం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- ప్రపంచం కనీవినీ ఎరుగని రీతిలో ఇరాన్‌పై దాడులు చేశాం: ట్రంప్
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థపై దాడి చేశాం: ట్రంప్
- ఇరాన్‌కు చెందిన 9 నౌకలను ధ్వంసం చేశాం: డొనాల్డ్ ట్రంప్
- ప్రాణాలు కాపాడుకునేందుకే ఇరాన్ సైనికులు లొంగిపోవాలనుకుంటున్నారు: ట్రంప్
- అణ్వాయుధాలు, క్షిపణులను ఇరాన్ వేగంగా తయారుచేస్తోంది: ట్రంప్
- అమెరికాను, మా స్థావరాలను ఢీకొట్టగలిగే క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయి: ట్రంప్
- అమెరికాను చేరుకోగలిగే క్షిపణులను కూడా ఇరాన్ తయారుచేస్తోంది: ట్రంప్
- అణ్వాయుధాల అభివృద్ధికి కవచంగా మిసైళ్లను వాడుకుంటున్నారు: ట్రంప్
- ఇరాన్ అణ్వాయుధాలు, దీర్ఘశ్రేణి క్షిపణులు మధ్యప్రాచ్యం, అమెరికాకు ముప్పు: ట్రంప్
- అమెరికాకు ఇప్పటికీ ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉంది: ట్రంప్
- ఇరాన్‌తో ఒబామా చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసినందుకు గర్వపడుతున్నా: ట్రంప్
- ఒప్పందం కొనసాగి ఉంటే ఇరాన్ ఇప్పటికే అణ్వాయుధాలు కలిగి ఉండేది: ట్రంప్
ఇరాన్‌పై దాడి చేసి- ప్రపంచానికి ఉన్న ముప్పును తొలగించాం: నెతన్యాహు
- ప్రపంచానికి ఉన్న ముప్పును అమెరికాతో కలిసి తొలగించాం: నెతన్యాహు
- ఇరాన్ నిరంకుశ పాలకులు పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు: నెతన్యాహు
- పౌరులను రక్షించేందుకే మేం నిరంకుశ పాలకులను లక్ష్యంగా చేసుకున్నాం: నెతన్యాహు
- ఇరాన్ మమ్మల్ని, అమెరికాను బెదిరిస్తోందని గతంలోనే చెప్పా: నెతన్యాహు
- ఇరాన్ నేరుగా యూరప్‌ను లక్ష్యంగా చేసుకుంటుందని చెప్పా: నెతన్యాహు
- ఇరాన్ వద్ద అణ్వాయుధాలుంటే మెుత్తం మానవాళినే బెదిరిస్తారు: నెతన్యాహు
- ఇజ్రాయెల్‌ను రక్షించుకునేందుకే ఇరాన్‌పై దాడి చేశాం: నెతన్యాహు
- ప్రపంచాన్ని కాపాడే ప్రయత్నంలో మాతో కలిసిన ట్రంప్‌నకు ధన్యవాదాలు: నెతన్యాహు
- ఇరాన్‌లో అమెరికా చర్యకు మద్దతు తెలిపిన నాటో సెక్రటరీ జనరల్
- అమెరికాకు యూరప్ సంపూర్ణ మద్దుతు ఇస్తుంది: నాటో సెక్రటరీ జనరల్
- ఇరాన్‌లో అమెరికా చర్యకు యూరప్ పూర్తిగా మద్దతు ఇస్తుంది: నాటో సెక్రటరీ జనరల్
ఇరాన్‌కు మద్దతు తెలిపిన చైనా
- ఇరాన్‌కు మద్దతు తెలిపిన చైనా విదేశాంగశాఖ మంత్రి
- ఇరాన్ సార్వభౌమత్వం, భద్రత కాపాడుకునేలా మద్దతు ఇస్తాం: చైనా విదేశాంగశాఖ
- ఇరాన్ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో బీజింగ్ మద్దతు ఉంటుంది: చైనా విదేశాంగశాఖ
- ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేని భార్య మృతి
- మొన్న ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఖమేని భార్య
- ఖమేని భార్య చికిత్సపొందుతూ చనిపోయినట్లు ఇరాన్ మీడియా వెల్లడి
- అమెరికన్లను చంపితే ఏం జరుగుతుందో ప్రపంచానికి చాటి చెప్పాం: అమెరికా రక్షణ మంత్రి
- అమెరికన్లను చంపితే మేము కూడా చంపి తీరుతాం: అమెరికా రక్షణ మంత్రి
- ఈ యుద్ధం మేము మెుదలు పెట్టింది కాదు: అమెరికా రక్షణ మంత్రి
- కానీ ఈ యుద్ధాన్ని మేమే ముగిస్తాం: అమెరికా రక్షణ మంత్రి
- 47 ఏళ్ల తప్పులకు ఇరాన్ ఇప్పుడు మూల్యం చెల్లిస్తోంది: అమెరికా రక్షణ మంత్రి
- ట్రంప్ ఓ యోధుడు.. ఆయన ఎప్పుడు అమెరికాను అగ్రస్థానంలో ఉంచుతారు: అమెరికా రక్షణ మంత్రి
- ఇరాన్ వంటి ధూర్త దేశం వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు: అమెరికా రక్షణ మంత్రి
- ఇరాన్‌పై దాడికి చాలా ధైర్యం కావాలని చాలా మంది చెప్పారు: అమెరికా రక్షణ మంత్రి
- ట్రంప్‌నకు ఆ ధైర్యం ఉంది కాబట్టే దాడి చేశారు: అమెరికా రక్షణ మంత్రి
- ఇరాన్ అన్ని హద్దులను దాటేసింది అందుకే శిక్షిస్తున్నాం: అమెరికా రక్షణ మంత్రి
- గతంలో ఒబామాను ఇరాన్ భయపెట్టింది. కానీ ఇప్పుడు ఉంది ట్రంప్: అమెరికా రక్షణ మంత్రి
రేపు పుతిన్‌తో చర్చలు జరుపుతామన్న ఇరాన్ ఆర్థికమంత్రి అరగ్చీ
రేపు మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరుపుతామని వెల్లడి
ఇప్పటికే తుర్కియే అధ్యక్షుడితో మాట్లాడామన్న ఇరాన్ ఆర్థికమంత్రి
రష్యా, తుర్కియే మధ్యవర్తిత్వం వహించాలని కోరిన ఇరాన్ ఆర్థికమంత్రి
ఇజ్రాయెల్, అమెరికా చర్యలు అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధం: ఇరాన్
మా దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడుకుంటాం: ఇరాన్ ఆర్థికమంత్రి
బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, సౌదీ అరేబియా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఆయా దేశాలపై జరిగిన దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దాడులను ప్రధాని తీవ్రంగా ఖండించారు.
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రత నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు సరఫరాదారుల్లో ఒకటైన ఖతార్ ఎనర్జీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) ఉత్పత్తిని నిత్పివేస్తున్నట్లు ప్రకటించింది. ఖతార్ ఎనర్జీ నిర్ణయంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడనుంది.
- ఇరాన్ తాత్కాలిక రక్షణ మంత్రిగా మజీద్ ఎబ్‌నల్‌రజా నియామకం
- రక్షణ మంత్రిగా మజీద్ ఎబ్‌నల్‌రజాను నియమించిన ఇరాన్ అధ్యక్షుడు
- ప్రస్తుతం రెవల్యూషనరీ గార్డ్స్ జనరల్‌గా ఉన్న మజీద్ ఎబ్‌నల్‌రజా
- ఇటీవల ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి
- తమ ఎఫ్-16 యుద్ధవిమానాలు కూలడంపై అమెరికా స్పందన
- మూడు ఎఫ్-16లను కువైట్ పొరపాటున కూల్చిందన్న అమెరికా
- కువైట్ పొరపాటున తమ యుద్ధవిమానాలు కూల్చిందన్న అమెరికా
- ప్రమాదం నుంచి ఆరుగురు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారన్న అమెరికా
- బయటపడిన ఆరుగురు పైలట్ల పరిస్థితి నిలకడగానే ఉందన్న అమెరికా
- చేసిన పొరపాటును కువైట్ అంగీకరించిందన్న అమెరికా సెంట్రల్ కమాండ్
ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి- ఒక భారతీయుడు మృతి
- ఒమన్‌లో ఒక భారతీయుడు చనిపోయాడని తీరగస్తీ దళం ప్రకటన
- ఆయిల్ ట్యాంకర్‌పై జరిగిన దాడిలో భారతీయుడు చనిపోయాడని ప్రకటన
నెతన్యాహు కార్యాలయంపై దాడి చేశామన్న ఇరాన్- అది తప్పుడు ప్రచారమన్న ఇజ్రాయెల్
- ఇరాన్ దాడిలో నెతన్యాహు కార్యాలయం ధ్వంసమైందన్న ప్రకటనను ఖండించిన ఇజ్రాయెల్
- నెతన్యాహు కార్యాలయంపై ఇరాన్ దాడి అనేది తప్పుడు ప్రచారంమన్న ఇజ్రాయెల్
- ఇరాన్ ప్రయోగించిన డజన్ల కొద్ది డ్రోన్లను కూల్చేసినట్లు వెల్లడించిన ఇజ్రాయెల్
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయంపై దాడి చేశామన్న ఇరాన్
- దాడి తర్వాత నెతన్యాహు పరిస్థితి ఏమిటనేది తెలియదన్న ఇరాన్
ఇరాన్ గూఢచర్య విభాగం అధిపతి జలాల్ పోర్ హుస్సేన్ మృతి
- ఇరాన్ నిఘా మంత్రిత్వశాఖలో ఇద్దరు సీనియర్ అధికారులు మృతి
- ఇద్దరు సీనియర్ అధికారులను చంపినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ట్వీట్
- ఇరాన్ నిఘా శాఖ సహాయ మంత్రి సయ్యద్ యాహ్యా హమీద్ మృతి
- ఇరాన్ గూఢచర్య విభాగం అధిపతి జలాల్ పోర్ హుస్సేన్ మృతి
ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్‌బొల్లా కీలక నేత మృతి
దక్షిణ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా సోమవారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) భీకర వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో లెబనాన్ పార్లమెంట్‌లోని హెజ్‌బొల్లా విభాగానికి నాయకత్వం వహిస్తున్న మహ్మద్ రాద్ మరణించారని పేర్కొంది. అయితే రాద్‌తో పాటు ఆ సంస్థకు చెందిన మరికొంత మంది కీలక ఉన్నతాధికారులు కూడా ఈ దాడుల్లో హతమైనట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. మరోవైపు ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల ఇప్పటివరకు 31 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 149 మంది తీవ్రంగా గాయపడినట్లు లెబనాన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
వార్ ఎఫెక్ట్- భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు
- స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం
- భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 1,048 పాయింట్లు నష్టపోయి 80,238 వద్ద ముగిసిన సెన్సెక్స్
- 313 పాయింట్లు నష్టపోయి 24,865 వద్ద ముగిసిన నిఫ్టీ
ఇరాన్‌లో ఇప్పటి వరకు 555 మంది మృతి
- ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులు
- కనీసం 555 మంది మరణించినట్లు ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడి
- ఈ యుద్ధంలో ఇప్పటివరకు 131 నగరాలపై దాడులు జరిగాయని పేర్కొన్న సంస్థ
అమెరికా–ఇజ్రాయెల్ సైన్యం తమ దేశంలోని నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని ఇరాన్ ఆరోపించింది. నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రంపై బాంబు దాడులు జరిగాయని చెప్పింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షణ సంస్థకు ఇరాన్ రాయబారి ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను సమర్థించే ఆధారాలు ఇప్పటివరకు లభించలేదని తెలిపింది.
- కువైట్‌లో కూలిన పలు అమెరికా యుద్ధ విమానాలు
- పైలట్లంతా సురక్షితంగా బయటపడ్డారని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడి
- ప్రమాదాలకు కారణాలను వివరించని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఇరాన్ తీవ్ర స్థాయిలో దాడులు చేస్తున్న సమయంలోనే ఈ ఘటనలు
- పైలట్లను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్న కువైట్ రక్షణ మంత్రిత్వశాఖ
- ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడి
పూర్తి వార్త కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
సౌదీ చమురు సంస్థపై ఇరాన్ డ్రోన్ దాడి
- సౌదీకి చెందిన చమురు సంస్థ అరామ్‌కోపై ఇరాన్ డ్రోన్ దాడి
- ఇరాన్ డ్రోన్ల దాడి భగ్నం చేశామన్న సౌదీ అరేబియా
- డ్రోన్ల శకలాలు కిందపడి మంటలు చెలరేగాయని సౌదీ అరేబియా వెల్లడి
- ఈ ఉదయం రాస్ తనురా రిఫైనరీపై డ్రోన్లతో దాడికి యత్నించి ఇరాన్
- రెండు డ్రోన్లను మధ్యలోనే అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడి
- డ్రోన్లను అడ్డుకునే ఆపరేషన్‌లో కిందపడిన శకలాల కారణంగా స్వల్పస్థాయిలో మంటలు
- ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని సౌదీ అరేబియా రక్షణ శాఖ వెల్లడి
- డ్రోన్ దాడి తర్వాత రాస్ తనురా రిఫైనరీని తాత్కాలికంగా మూసివేసినట్లు సౌదీ వెల్లడి

