ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం- ఇరుదేశాల బంధం బలోపేతం
వికసిత్ భారత్ - యాంగీ ఉజ్బెకిస్థాన్ లక్ష్యంగా దేశాధినేతల కీలక చర్చలు- వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారానికి భారత్ ఇరుదేశాల అంగీకారం

Published : August 30, 2026 at 2:51 PM IST
PM Modi in Uzbekistan : భారత్- ఉజ్బెకిస్థాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇరు దేశాల సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు మోదీ రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారాన్ని అందజేసింది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ, ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 'వికసిత్ భారత్', 'యాంగీ ఉజ్బెకిస్థాన్' అనే ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటామని ఇరు దేశాధినేతలు ప్రకటించారు.
"ఈ అత్యున్నత పురస్కారాన్ని నేను ఎంతో వినమ్రతతో స్వీకరిస్తున్నాను. ఇరు దేశాల మధ్య ఉన్న శతాబ్దాల నాటి ప్రాచీన స్నేహానికి, మన ఉమ్మడి వారసత్వానికి దీనిని వినమ్రపూర్వకంగా అంకితం చేస్తున్నాను. మీ దూరదృష్టి గల నాయకత్వం, భారతదేశం పట్ల మీకున్న స్నేహభావం కారణంగా మన ద్వైపాక్షిక సంబంధాలు నిరంతరం బలోపేతం అవుతూ వచ్చాయి. ప్రతి క్షణం అవి సరికొత్త శిఖరాల దిశగా విజయవంతంగా దూసుకెళ్తున్నాయి. దీని ఫలితంగానే, నేడు మన సంబంధాలకు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం అనే సరికొత్త స్థాయి లభించింది. అవార్డు ద్వారా గౌరవ ప్రతిష్టలు దక్కుతాయన్నది నిజమే, కానీ ఒక అవార్డు తనతో పాటు ఒక మహత్తరమైన బాధ్యతను కూడా మోసుకొస్తుందని నాకు బాగా తెలుసు. ఈ రోజు నేను ఈ అవార్డును స్వీకరిస్తున్న వేళ, ఆ బాధ్యతను మనస్ఫూర్తిగా గుర్తిస్తున్నాను. ఉజ్బెకిస్థాన్ చారిత్రక గడ్డ పైనుంచి నేను అక్కడి ప్రజలకు ఒక నమ్మకాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. భారతదేశం ఎన్నటికీ తన బాధ్యతల నుంచి వెనకడుగు వేయదు, ఈ స్నేహాన్ని చిత్తశుద్ధితో నిలబెట్టుకుంటుంది."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
#WATCH | Tashkent, Uzbekistan: Prime Minister Narendra Modi and President Shavkat Mirziyoyev hold delegation-level talks in Tashkent
— ANI (@ANI) August 30, 2026
(Source: ANI/DD) pic.twitter.com/71VANpqjYg
VIDEO | Tashkent, Uzbekistan: During delegation-level talks with Uzbekistan President Shavkat Mirziyoyev, PM Narendra Modi (@narendramodi) says, " after two days, it is 31st anniversary of your independence day, i extend my good wishes in advance. coincidentally, we are… pic.twitter.com/cEONcYg2RX
— Press Trust of India (@PTI_News) August 30, 2026
మరో 2 రోజుల్లో ఉజ్బెకిస్థాన్ 35వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనున్న సందర్భంగా ఆ దేశ ప్రజలకు మోదీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. భారత్- ఉజ్బెకిస్థాన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 15 ఏళ్లు పూర్తవుతున్న శుభ సందర్భంలో, ఇరు దేశాల సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నిర్దిష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ఇరు దేశాలు కలసి ముందుకు సాగుతాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్‌లో 'యోగా ఫెడరేషన్ ఆఫ్ ఉజ్బెకిస్థాన్' ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా సెషన్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఉజ్బెకిస్థాన్‌లో యోగాకు విశేష ఆదరణ ఉందని, ఇది రెండు దేశాల ప్రజలు, సంస్కృతులను ఏకం చేస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.
Tashkent, Uzbekistan: President Shavkat Mirziyoyev confers the Order of “Oliy Darajali Dustlik,” Uzbekistan’s supreme state award, on Prime Minister Narendra Modi
— ANI (@ANI) August 30, 2026
(Source: ANI/DD) pic.twitter.com/mhWuiMjwFT
అంతకుముందు నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఉజ్బెకిస్థాన్ వెళ్లిన ప్రధాని మోదీకి తాష్కెంట్ విమానాశ్రయంలో ఆ దేశ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా యాంగి ఉజ్బెకిస్థాన్ పార్కును సందర్శించిన ప్రధాని, అక్కడి స్వాతంత్ర్య స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం ప్రవాస భారతీయలతో మోదీ సమావేశమయ్యారు. ప్రవాసులు అందించిన ఆప్యాయత తనను ఎంతగానో ఆకట్టుకుందని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రవాసులు ప్రదర్శించిన కథక్, అండిజాన్ పోల్కా నృత్యాలను ఆయన ఆసక్తిగా తిలకించారు. ఉజ్బెకిస్థాన్‌లోని అధికారిక కార్యక్రమాల అనంతరం మోదీ కిర్గిజిస్థాన్ చేరుకుంటారు. బిష్కెక్ నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు.
#WATCH | Tashkent, Uzbekistan: President Shavkat Mirziyoyev confers the Order of “Oliy Darajali Dustlik,” Uzbekistan’s supreme state award, on Prime Minister Narendra Modi
— ANI (@ANI) August 30, 2026
(Source: ANI/DD) pic.twitter.com/WbHZtBB6ZU
'యోగా ద్వారా రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం'- ఉజ్బెకిస్థాన్‌లో మోదీ స్పెషల్ ఈవెంట్

