ఇరాన్ Vs అమెరికా, ఇజ్రాయెల్ వార్- AI, ఫాల్స్ వీడియోలు వైరల్- వీటిని అస్సలు నమ్మోద్దు!
మిడిల్ ఈస్ట్ సైనిక ఘర్షణపైనా ఏఐ ఫేక్‌లు- సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలు, ఫొటోలు వైరల్- పీటీఐ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తనిఖీలో వెలుగులోకి

Published : March 3, 2026 at 9:01 PM IST
AI Fakes Viral On Middle East War : పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్రరూపు దాలుస్తున్న ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా సైనిక ఘర్షణపై వైరల్ అవుతున్న 14 విజువల్స్ బండారాన్ని పీటీఐ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ బయటపెట్టింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఎంతోమంది నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటున్న ఈ విజువల్స్‌లోని తప్పుడు సమాచారాన్ని బహిర్గతం చేసింది. ఫిబ్రవరి 28న (శనివారం) ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ దాడులు మొదలైనప్పటి నుంచి టెహ్రాన్‌లో పేలుళ్లు, దుబాయ్‌పై మిస్సైల్ దాడులు, అరబ్ దేశాల్లో భవనాలు కూలిపోతున్నాయి అంటూ పలు వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీటితో కూడిన సోషల్ మీడియా పోస్టులకు ఇప్పటికే లక్షలాది వ్యూస్ వచ్చాయి. పీటీఐ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ గుర్తించిన ఈ ఫేక్ విజువల్స్ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
పీటీఐ ఫ్యాక్ట్ చెక్ గుర్తించిన ఫేక్ విజువల్స్ చిట్టా
• దుబాయ్‌పై ఇరాన్ దాడి చేసినట్టుగా ఒక ఏఐ వీడియోను జనరేట్ చేసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. దీనికి 20 కోట్లకుపైగా వ్యూస్, 19 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. ఇది పూర్తిగా ఫేక్ వీడియో
• అరబ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడుల దెబ్బకు, అమెరికా సైనికులు భయపడి పారిపోతున్నట్టుగా ఏఐ వీడియో క్లిప్‌ను తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కూడా ఫేక్ వీడియోనే
• ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇంకా బతికే ఉన్నారంటూ, ఈ ఏడాది ఫిబ్రవరి నెల ప్రారంభంలో ఆయన ప్రసంగించిన ఒక వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు
• 2025 జూన్‌లో ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడి చేసిన ఒక ఫొటోను, ఇప్పుడు దాడి చేసిన ఫొటో అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
• 2025 జులైలో సిరియాపై జరిగిన వైమానిక దాడి వీడియోను, ఇప్పుడు ఇజ్రాయెల్‌లోని హైఫా నగరంపై ఇరాన్ చేసిన దాడి వీడియోగా చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు
• 2024 అక్టోబరులో ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన దాడి వీడియోను, ఈసారి ఇజ్రాయెల్‌లోని టెల్ అలివ్‌పై ఇరాన్ చేసిన దాడి వీడియోగా చెబుతూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు
• 2024 జులైలో ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో యెమన్‌లోని పోర్టులో భారీ పేలుళ్లు జరిగాయి. ఆ వీడియోను తాజాగా సౌదీ అరేబియాపై ఇరాన్ చేసిన దాడి వీడియోగా చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు
• 2024 నాటి ఒక పాత వీడియోను, ఈసారి దుబాయ్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ చేసిన దాడిగా చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు
• ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటూ, 2014లో ఆయన ఆస్పత్రిలో చేరిన ఒక పాత ఫొటోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు
• 2015లో యూఏఈలోని షార్జాలో ఉన్న ఒక భారీ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ వీడియోను, ఇప్పుడు దుబాయ్‌లోని సీఐఏ (అమెరికా గూఢచార సంస్థ) ప్రధాన కార్యాలయంపై ఇరాన్ చేసిన దాడిగా చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు
PTI SHORTS | PTI Fact Check: Old 2014 hospital photo of Ayatollah Ali Khamenei falsely shared as image after his death amid recent Iran strike
— PTI Fact Check (@ptifactcheck) March 3, 2026
WATCH: https://t.co/4XMoAllwhe
Subscribe to PTI's YouTube channel for in-depth reports and special visual stories.#PTIFactCheck
ईरान द्वारा इजरायल के शहर तेल अवीव पर किए गए हमले का वीडियो। #PTIFACTCHECK की जांच में सामने आया कि यह वीडियो मेक्सिको के एक कसीनो में लगी आग की घटना का है। pic.twitter.com/Ui203X5Wk1
— PTI Fact Check (@ptifactcheck) March 3, 2026
दुबई के बुर्ज खलीफा पर हुए हमले का वीडियो। #PTIFACTCHECK की जांच में सामने आया कि वायरल वीडियो असली नहीं, AI जनरेटेड है। pic.twitter.com/dnaLcL7bgv
— PTI Fact Check (@ptifactcheck) March 3, 2026
एक वीडियो में ईरान के सुप्रीम लीडर अयातुल्ला अली खोमेनेई को यह कहते हुए सुना जा सकता है, “मैं जीवित हूं, फेक न्यूज न फैलाएं।” #PTIFACTCHECK की जांच में पता चला कि अयातुल्ला अली खोमेनेई के एक पुराने वीडियो की आवाज को एआई की मदद से बदल दिया गया है। pic.twitter.com/akjDGMcdfE
— PTI Fact Check (@ptifactcheck) March 3, 2026
PTI Fact Check: July 2024 Yemen port explosion video falsely shared as recent attack on Saudi Arabia
— PTI Fact Check (@ptifactcheck) March 1, 2026
READ MORE: https://t.co/mt3ZQQ6gW9
Follow #PTIFactCheck on WhatsApp Channel https://t.co/yFNHsOCaQU pic.twitter.com/qcnH7HKZyd
PTI Fact Check: October 2024 fire video falsely shared as Iranian strike on Tel Aviv amid escalating Israel–Iran tensions
— PTI Fact Check (@ptifactcheck) March 1, 2026
READ MORE: https://t.co/EZkIKf60Tt
Follow #PTIFactCheck on WhatsApp Channel https://t.co/yFNHsOCaQU pic.twitter.com/qh4GRx78xa
ఫాల్స్ వీడియోలను ఇలా గుర్తించారు
ఫ్యాక్ట్ చెకింగ్‌లో భాగంగా పైన ప్రస్తావించిన ప్రతీ వీడియో/ఫొటో ఒరిజినల్ సోర్స్ కోసం ఇంటర్నెట్‌ను, సోషల్ మీడియాను పీటీఐ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ జల్లెడ పట్టింది. రివర్స్ ఇమేజ్ సెర్చ్, మెటాడేటా అనాలిసిస్, వేరిఫైడ్ వార్తా నివేదికలు, ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థలను ప్రాతిపదికలుగా తీసుకొని అసలైన వీడియో/ఫొటో సోర్స్‌లను గుర్తించింది. దీంతో ఈ వీడియోలు/ఫొటోలలో కొన్ని రీసైకిల్ చేసినవని తేలింది. ఇంకొన్ని ఏఐ టూల్స్ ద్వారా క్రియేట్ చేసినవని బహిర్గతమైంది.
యుద్ధం వేళ ప్రజల్లో ఏర్పడే ఆతుర్తను ఆసరాగా చేసుకొని, కంటెంట్‌ను వైరల్ చేసుకునేందుకే ఇలాంటి ఫొటోలు, వీడియోలను వినియోగించినట్లు పీటీఐ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ గుర్తించింది. ఏఐ ఫేక్ వీడియోలు చాలా వేగంగా లక్షలాది వ్యూస్, లైక్‌లను పొందాయి. అవి నిజమే అనుకొని చాలామంది నెటిజన్లు నమ్మారు. వాటిని మరెంతో మందికి షేర్ చేశారు. యుద్ధాలు, సైనిక ఘర్షణలు జరిగినప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, వాస్తవాలను దాచడానికి, భయాన్ని పెంచడానికి ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తుంటారని పీటీఐ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్‌ల ఒరిజినల్ సోర్స్‌లను తాము నిశితంగా ట్రాక్ చేస్తున్నామని పేర్కొంది.

