ETV Bharat / health

చలిలో 'నడక' ఆరోగ్యానికి మంచిదేనా? - నిపుణులు ఏమంటున్నారంటే!

చలిలో నడకతో కొందరికి సమస్యలు - ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుందంటున్న నిపుణులు!

Winter Morning Walk
Winter Morning Walk (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : December 25, 2025 at 9:23 AM IST

3 Min Read
Choose ETV Bharat

Winter Morning Walk And Health Problems : నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనటంలో సందేహం లేదు. క్రమం తప్పకుండా నడిస్తే డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కానీ, చలిగాలిలో నడక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. మరి, తెల్లవారక ముందే నడక అలవాటున్న వారు పొద్దెక్కినా తగ్గని చలిలో ఎలా నడవాలో ఇప్పుడు తెలుసుకుందాం!

నిర్లక్ష్యం వద్దు :

  • చలిగాలులు 50 ఏళ్లు దాటిన వారి గుండెపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి అనేక సమస్యలకు కారణమవుతాయి.
  • ఎండ వచ్చాక బయటకు వెళ్లడం మంచిది. నడకకు ముందు ఇంట్లో కొన్ని శ్వాస వ్యాయామాలు చేస్తే మేలు.
  • నడిచేటప్పుడు ఛాతీలో అసౌకర్యం, ఎక్కువ చెమట పట్టడం, విశ్రాంతి సమయంలోనూ శ్వాస ఇబ్బందులు, అలసట, మత్తు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్​ని సంప్రదించాలి.
  • చలి ప్రభావం పడకుండా మాస్కు, టోపీ, కాళ్లకు సాక్స్‌, చేతులకు గ్లౌవ్స్‌ ధరిస్తే మంచిది. అలాగే, మందమైన జర్కిన్ల వంటివి వేసుకోవడం ఉత్తమం.

బహుళభాషా నైపుణ్యంతో మెదడుకెంతో మేలు! - తాజా పరిశోధనలో కీలక విషయాలు!

ఊపిరితిత్తులపై ఒత్తిడి :

  • దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి చలికాలం కష్టతరమైంది. ఉదయం నిద్రలేవగానే చల్లటి గాలి పీల్చడం వల్ల శ్వాస వ్యవస్థ పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది.
  • ఆస్తమా (Asthma) ఉన్న వారికి ఊపిరితిత్తులపై ఒత్తిడితో పాటు శ్ల్మేషం పెరుగుతుంది.
  • జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వారికి కూడా చల్ల గాలి అంత మంచిది కాదు.
  • తక్కువ ఉష్ణోగ్రతలు వాయునాళాలను కుంచించుకుపోయేలా చేస్తాయి.
  • చల్లగాలి వల్ల శ్వాసనాళాల వాపు, ఇన్​ఫెక్షన్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • బ్రోంకో హైపర్ రియాక్టివిటీ (bronchial hyperreactivity) ఉన్న వారికి బ్రోంకోస్పాస్మ్ వచ్చే ప్రమాదం ఉంది.
  • క్రమం తప్పకుండా చలిగాలిలో బయటకు వెళ్లే చికాకు, మంట, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

చలికాలంలో వైరల్ ఇన్​ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు చలిలో బయటకు వెళ్తే సమస్య తీవ్రమై హాస్పిటల్​లో చేరాల్సి వస్తుంది. తప్పనిసరిగా వెళ్లాలనుకుంటే మాత్రం చెవిలో దూది, ముక్కుకు మాస్కు పెట్టుకోవాలి. వీలైనంత వరకు గోరువెచ్చటి నీరు తాగాలి. తీపి పదార్థాలు తగ్గించాలి. గ్రామీణ ప్రాంతాల్లో తెల్లవారుజామున చలి మంట కాగుతుంటారు. ఆరోగ్య సమస్యలున్న వారు ఆ పొగ వద్దకు వెళ్లకూడదు. దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలున్న వారు డాక్టర్లు సూచన మేరకు ఇన్​ఫ్లయెంజా, న్యూమోకోకల్ టీకాలు తీసుకోవాలి- డాక్టర్ వెంకటేశ్, పల్మనాలజిస్ట్

  • చలికాల ఉదయాలు హృదయనాళ వ్యవస్థకు సవాళ్లు విసురుతుంటాయి
  • ఊపిరి ఆడకపోవడం, ఛాతీ పట్టేయడం, చలి వల్ల కలిగే అలసటని తేలిగ్గా తీసుకోకూడదు.
  • చలికి రక్తనాళాలు సంకోచించి, రక్తపోటును పెంచడంతో పాటు గుండె పని చేయడం కష్టమవుతుంది.
  • సాధారణంగా ఉదయపు వేళల్లో గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ చల్లటి వాతావరణం ఈ రిస్క్​ను మరింత పెంచుతుంది.
  • తక్కువ ఉష్ణోగ్రతలు గుండె రక్తనాళాలు కుచించుకుపోయేలా చేసి రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే, గుండెకు వెళ్లే ఆక్సిజన్​ను తగ్గిస్తాయి. దీంతో గుండె మరింత శ్రమించాల్సి వచ్చి, హార్ట్ ఎటాక్ ప్రమాదం పెరుగుతుంది.
  • చలికాలంలో స్ట్రోక్, గొంతువాపు వ్యాధులు వచ్చే అవకాశమూ ఎక్కువని పరిశోధనలు చెబుతున్నాయి.
  • వేగంగా నడవడం, మెట్లెక్కడం వంటి రోజువారీ అలవాట్లు గుండెపై ఒత్తిడిని కలిగిస్తాయి.
  • రక్తపోటు, డయాబెటిస్, ఒబెసిటీ, గుండె సమస్యలున్న వారికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది
  • చలి కారణంగా రక్త నాళాలు కుచించుకుపోయి కీళ్లు, మోకాళ్ల నొప్పులు మరింత పెరుగుతాయి.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

విటమిన్ 'D' లోపంతో ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయో తెలుసా? - ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటున్న నిపుణులు!

తరచూ "తలనొప్పి" ఎందుకు వస్తుందో తెలుసా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!