"ఉప్పు" విషయంలో ఆ తప్పు చేయకండి! - మోతాదుకు మించి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?
పదే పదే మూత్ర విసర్జన సమస్యకూ ఉప్పు కారణం కావచ్చు - నిపుణులు ఏమంటున్నారంటే!

Published : October 23, 2025 at 3:45 PM IST
Warning Signs of Consuming Too Much Salt : ఏ వంటకాల్లోనైనా సరే! ఉప్పు, కారం సరిగ్గా ఉంటేనే దాని రుచి పెరుగుతుంది. కానీ, ఉప్పు మితిమీరితే మాత్రం ఆరోగ్యానికి ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీతో పాటు గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అయితే, మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటున్నారని ఎలా తెలుస్తుంది? అంటే, కొన్ని శారీరక మార్పుల వల్ల ఈ విషయాన్ని సులభంగా గ్రహించవచ్చని సూచిస్తున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
పదే పదే మూత్ర విసర్జన : డయాబెటిస్ సమస్య లేనప్పటికీ తరచూ మూత్ర విసర్జనకు వెళ్తున్నట్లయితే, మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటున్నారేమో చెక్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా, రాత్రిపూట యూరిన్‌కి వెళుతుంటే మాత్రం ఆహారంలో ఉప్పు వాడకంపై నియంత్రణ పాటించాల్సిందేని చెబుతున్నారు. అధిక రక్తపోటు ఉన్న రోగులలో అధిక ఉప్పు తీసుకోవడం వల్ల మూత్ర లక్షణాలు తరచుగా మూత్రవిసర్జన చేయాలనే కోరిక కలుగుతుందని international Continence society అధ్యయనం పేర్కొంది.
"BP" ఎప్పుడు చెక్ చేసుకోవాలో తెలుసా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!
ఎక్కువగా దాహం వేస్తోందా? : ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో శరీరంలో నీటి స్థాయిల సమతుల్యతపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరిస్తున్నారు. ఫలితంగా, ఎక్కువ దాహం వేస్తుందని చెప్తున్నారు.
శరీర భాగాల్లో వాపు : శరీర భాగాల్లో వాపు రావడమనేది సాధారణంగా హైబీపీ బాధితుల్లో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఉప్పు అధికంగా తీసుకునే వారి శరీరంలో అక్కడక్కడా వాపు రావడం గమినించవచ్చని పేర్కొంటున్నారు. ముఖ్యంగా, పాదాల్లో నీటి నిల్వ పెరిగిపోయి ఉబ్బుతాయని, ఆహారంలో ఉప్పు తగ్గిస్తే ఇలాంటి సమస్యల నుంచి క్రమంగా బయటపడవచ్చని సూచిస్తున్నారు.
వాటి పైనే ఆసక్తి : ఉప్పు ఎక్కువగా తీసుకుంటే నాలుకపై ఉండే రుచి మొగ్గలపై ప్రభావం చూపిస్తుందంటున్నారు. దీంతో ఏం తిన్నా నోటికి అంతగా నచ్చదని చెబుతున్నారు. అలాంటివారు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల పైనే ఎక్కువగా ఆసక్తి చూపుతారని తెలియజేస్తున్నారు.
తిమ్మిర్లు, నొప్పులు : మోతాదుకు మించి ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగిపోతాయని, ఇది క్యాల్షియం స్థాయిలపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు నిపుణులు. దీంతో ఎముకలు బలహీనమవుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా, తిమ్మిర్లు, నొప్పులు ఎక్కువగా వేధిస్తాయని పేర్కొంటున్నారు. సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది, ఇది గుండె జబ్బులు, స్ట్రోక్‌కు ప్రధాన కారణమని US Food &Drug Administration అధ్యయనం పేర్కొంది.
ఇలా తగ్గించుకోవచ్చు : మనం తీసుకునే ఆహారంలో భాగంగా ఉప్పును తగ్గించుకోవాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
- మాంసం వంటివి కొనుగోలు చేసేటప్పుడు ప్యాక్ చేసిన వాటికంటే తాజాగా కట్ చేసిన వాటినే ఎంచుకోవడం మంచిదంటున్నారు. ఎందుకంటే, ప్యాక్ చేసిన వాటిలో పాడవకుండా ఉండేందుకు ఎక్కువగా ఉప్పును కలుపుతుంటారని చెబుతున్నారు. అలాగే, బయట సూపర్ మార్కెట్లో మనం ఏ పదార్థం కొన్నా, అందులో సోడియం స్థాయిలు ఎంత మేర ఉన్నాయో ఫుడ్ లేబుల్ చూసి తీసుకోవాలని సూచిస్తున్నారు.
- కొన్ని రసాల మసాలాలు లేదా సీజనింగ్స్ని ఎంచుకునే క్రమంలో సోడియం లేనివి సెలక్ట్ చేసుకోవడం మంచిదంటున్నారు. అలాగే, రెస్టరంట్లలో భోజనం చేసినా, ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా, ఉప్పు తక్కువగా వాడే పదార్థాలకే ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు. అంతగా కావాలనుకుంటే, తమ కోసం తయారుచేసే పదార్థాల్లో ఉప్పు తగ్గించాలని కూడా చెప్పచ్చని సూచిస్తున్నారు.
- అంతేకాకుండా, సాసుల్లో కూడా సోడియం స్థాయిలు అమితంగానే ఉంటాయంటున్నారు నిపుణులు. కాబట్టి, ఇలాంటి వాటిని పూర్తిగా దూరం పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. కావాలంటే వాటికి బదులుగా, బ్రెడ్‌పై పీనట్ బటర్ రాసుకోవడం వంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలని తెలియజేస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
చెవిలో 'గులిమి' తీయాల్సిందేనా? - నిపుణులు ఏమంటున్నారంటే!
ఎర్రని పెదాల కోసం "లిప్‌స్టిక్" వాడుతున్నారా? - రోజూ పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

