ఊరికే 'నీరసంగా' అనిపిస్తోందా? - అయితే మీలో 'ఆ సమస్య' ఉండొచ్చంటున్న నిపుణులు!
బి12 లోపిస్తే శరీరంలో ఏం జరుగుతుంది? - డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి?

Published : March 3, 2026 at 5:03 PM IST
B12 Deficiency Symptoms : ఎలాంటి కారణం లేకుండానే మూడ్ అంతా డల్‌గా మారడం, ఊరికే నీరసంగా పడిపోవడం లాంటివి మనకు చిన్న విషయాలే అనిపిస్తాయి. అలాంటప్పుడు మనం సరిగ్గా నిద్రపోలేదు, పని ఎక్కువైందని అనుకుంటాం. కానీ బి12 తగ్గినా ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో శరీరంలో B12 విటమిన్ తక్కువగా ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం!
ప్రస్తుతం చిన్నారులు, యువత, వృద్ధులు అనే తేడా లేకుండా చాలా మంది విటమిన్ బి12 లోపంతో బాధ పడుతున్నారు. శరీరానికి ఇది చాలా తక్కువ పరిమాణంలో అవసరమైనప్పటికీ అత్యంత కీలకమని చెప్పొచ్చు. నిజానికి ఇది మన బాడీకి ఎనర్జీ పవర్ హౌజ్లా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విటమిన్ వల్ల రక్తహీనత దరిచేరదని, మెదడు, నాడీ కణాలు, నరాల ఆరోగ్యానికి సహయపడుతుందని వివరిస్తున్నారు. సాధారణంగా న్యూరోసైకియాట్రిక్ ఆరోగ్యానికి తగినంత మొత్తంలో విటమిన్ B12 చాలా కీలకమని National Library of Medicine అధ్యయనం పేర్కొంది.
SMA ఒక ప్రాణాంతక వ్యాధి - ఎవరికి వస్తుందో తెలుసా?
బి12 లోపం ఎందుకు పెరుగుతోంది? : B12 లోపం శాకాహారులకే కాకుండా మాంసాహారుల్లో కూడా కనిపిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. వంట చేసేటప్పుడు ఆహారాన్ని ఎక్కువ సేపు వేయించడం లేదా వేడి చేయడం వల్ల పదార్థాల్లో ఉండే విటమిన్ బి12 నశిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఉత్తర భారతదేశంలో సుమారు 47 శాతం మంది ఈ లోపంతో బాధపడుతున్నారని National Library of Medicine అధ్యయనం పేర్కొంది. తద్వారా శరీరంలో 'హోమోసిస్టీన్' స్థాయిలు పెరిగి, గుండె, నరాల సంబంధిత సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు వివరించారు.
clevelandclinic అధ్యయనం ప్రకారం, లక్షణాలు :
- నిరంతర అలసట లేదా బలహీనత
- నిరాశ, చిరాకుగా అనిపించడం
- వికారం, వాంతులు
- చర్మం పాలిపోవడం
- మతిమరుపు
- చేతులు, కాళ్లలో మొద్దుబారడం లేదా తిమ్మిర్లు
- కారణం లేకుండా కోపం
- ఆకలి లేకపోవడం
- పిల్లల్లో పెరుగుదల లోపాలు
- నోటి పూత, నాలుక వాపు
- బరువు తగ్గడం
- నడవడానికి లేదా మాట్లాడటానికి ఇబ్బంది పడటం. విటమిన్ బి12 లోపం ఉన్నవారు నడుస్తున్నప్పుడు తడబడతారని Harvard Health Publishing అధ్యయనం పేర్కొంది.
ఆహారం : ఉప్పులో అయోడిన్ కలిపినట్లుగానే, మనం రోజూ తినే ఆహార పదార్థాలలో బి12 ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బి12 కలిపిన గోధుమ పిండి, తృణధాన్యాలు, సోయా లేదా బాదం పాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటున్నారు. అలాగే, ఆవుపాలు, ఆరటి పండ్లు, లివర్, గుడ్లు, యోగర్ట్, చీజ్ వంటి వాటిల్లో ఇది ఎక్కువగా లభిస్తుందన్నారు.
చికిత్స : అలసట లేదా మతిమరుపును వయస్సు వల్ల వచ్చే సమస్యగా లేదా పని ఒత్తిడిగా భావించి నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు నిపుణులు. ఈ సమస్యలకు విటమిన్ B12 లోపం కూడా కారణం కావచ్చని చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, రక్త పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ B12 లోపం ఉన్నట్లు నిర్ధారణయితే, డాక్టర్లు సలహా మేరకు సప్లిమెంట్స్ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
'కళ్లు తిరగడం, తలనొప్పి'గా ఉంటోందా? - మీరూ ఈ తప్పు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి!
కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? - ఈ చిట్కాలు పాటిస్తే మేలంటున్న నిపుణులు!

