రోజంతా 'నీరసంగా' అనిపిస్తోందా? - అయితే మీలో 'ఆ సమస్య' ఉండొచ్చంటున్న నిపుణులు!
బి12 లోపంతో బాధపడుతున్నారా? - వీటిని ఆహారంగా తీసుకోవాలని నిపుణుల సూచన!

Published : January 4, 2026 at 5:02 PM IST
Vitamin B12 Deficiency: నీరసంగా అనిపించడం, కారణం లేకుండా మూడ్ అంతా డల్‌గా మారిపోవడం, చిన్న విషయాలే కానీ ఓ పట్టాన గుర్తుకురాకపోవడం.. ఇలా పలు సమస్యలకు నిద్ర తగ్గింది, పని ఎక్కువైంది అనుకుంటూ కారణాలు వెతుక్కుంటూ ఉంటాం. కానీ, అసలు కారణం ఇది కాదంటున్నారు నిపుణులు. శరీరంలో B12 తగ్గినా ఈ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఈ క్రమంలో విటమిన్ బి12 ప్రాముఖ్యత, దీని లోపం వల్ల ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం!.
బి12.. మన శరీరానికి ఎనర్జీ పవర్హౌజ్లా పనిచేస్తుంది. ఇది రక్తహీనతను దరిచేయనీయదు, నాడీ కణాల ఆరోగ్యానికి సాయపడుతుందంటున్నారు నిపుణులు. అలాగే, మన శరీరంలోని డీఎన్ఏ తయారీ, శక్తి ఉత్పత్తి, కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు వంటి ముఖ్యమైన పనులకు ఈ పోషకం చాలా అవసరమని చెబుతున్నారు. అందుకే, మనం తినే ఆహారం ద్వారా ఇది సరిగా అందేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తర భారతదేశ జనాభాలో సుమారు 47% మంది విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారని National Library of Medicine అధ్యయనం పేర్కొంది.
కాబోయే అమ్మకు పురిటి నొప్పుల భయం - సిజేరియన్ ప్రసవాలు పెరగడానికి కారణాలివే!
విటమిన్ బి12 లభించే వనరులు : విటమిన్ B12 సహజంగా జంతు సంబంధిత ఆహారాలలో లభిస్తుంది. అయితే, మొక్కల ఆధారిత ఆహారంలో ఇది తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే, శాఖాహారులు తరచుగా B12 లోపంతో ఇబ్బంది పడుతుంటారని అంటున్నారు. ఈ క్రమంలో చేపలు, మాంసం, గుడ్లు, పాలు, ఇతర పాల ఉత్పత్తులలో విటమిన్ B12 సహజంగా ఉంటుందని National Institutes of Health అధ్యయనం పేర్కొంది. కొన్ని రకాల తృణధాన్యాలు, న్యూట్రిషనల్ ఈస్ట్, ఇతర ఆహార పదార్థాలలో విటమిన్ B12ను అదనంగా కలుపుతారని తెలిపింది.
విటమిన్ బి12 ఎందుకు అవసరం:
ఎర్ర రక్త కణాలు : ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి B12 తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు, ఎనీమియాను దరిచేయనీయదట.
నాడీ వ్యవస్థ ఆరోగ్యం : మెదడు, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఈ విటమిన్ తోడ్పడుతుందని చెబుతున్నారు. నాడుల చుట్టూ ఉండే రక్షణ పొరను ఇది కాపాడుతుందని తెలియజేస్తున్నారు.
మెదడు ఆరోగ్యం : జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుందని పేర్కొంటున్నారు. అలాగే, మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని వివరిస్తున్నారు.
గుండె ఆరోగ్యం : రక్తంలో హోమోసిస్టీన్ స్థాయిలను నియంత్రించడం ద్వారా గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుందని వెల్లడిస్తున్నారు.
ఇతర ప్రయోజనాలు : మానసిక స్థితిని మెరుగుపరచడం, ఎముకలు, చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి తోడ్పడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుందంటున్నారు.
clevelandclinic అధ్యయనం ప్రకారం, బి12 లోపం లక్షణాలు:
- అలసట
- పాలిపోయిన లేదా పసుపు రంగు చర్మం
- తలనొప్పి
- కుంగుబాటు లక్షణాలు
- జీర్ణక్రియ సమస్యలు
- ఏకాగ్రత లోపించడం
- నోటి పూత, నాలుక వాపు
- బరువు తగ్గడం
- నీరసంగా అనిపించడం
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రేగుపండ్లు అంటే ఇష్టమా? - వీటిని తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
పప్పుధాన్యాలతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?

