వేసవిలో ఏం తినాలి? ఎలా తినాలి? - పోషకాహార నిపుణుల సూచనలివే!
మండే ఎండలకు - ఆహారంలో వీటిని చేర్చుకుంటే మేలంటున్న నిపుణులు!

Published : April 13, 2026 at 3:32 PM IST
Food Habits During Summer : వేసవిలో ఎండల ధాటికి మనలో చాలామందికి తరచూ నీరసం, నిస్సత్తువ ఆవహిస్తూ ఉంటాయి. ఈ పరిస్థితికి బయట వేడి, ఉక్కపోతల వాతావరణంతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా కొంత వరకు కారణం కావచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎండల తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టే వరకు రోజువారీ ఆహారంలో మంచి పోషకాలు, నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే డీ హైడ్రేషన్, వడదెబ్బ వంటి సమస్యలను చక్కగా ఎదుర్కోవచ్చని అంటున్నారు. మరి, వేసవి సీజన్లో రోజువారీ ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం!
హైడ్రేట్‌గా ఉండటానికి : వేసవికాలంలో ఉష్ణోగ్రతల వల్ల వాతావరణంలోని మార్పులు రేయింబవళ్లు ఇబ్బందిగా ఉంటుంది. ఎండల తీవ్రతకు మనలో చాలామంది తీవ్ర నిస్సత్తువులోకి జారుకుంటున్నారు. దీనికి వేడితో పాటు తీసుకునే ఆహారం కొంత ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు పోషకాహార నిపుణులు. ఈ క్రమంలో వేసవిలో మంచి పోషకాలు నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం కంటే నీటిశాతం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలతో చేసుకునే పదార్థాలు తీసుకోవటం, ఈ కాలంలో వచ్చే పండ్లు తినటం మంచిదట.
అతిగా తేన్పులు వస్తున్నాయా? - కారణాలతో పాటు తగ్గడానికి టిప్స్ చెబుతోన్న నిపుణులు!
ఆహారం : కీరదోస, క్యారెట్, క్యాబేజీ, ఉల్లి, టమోటా ముక్కలు పెరుగుతో కలిపి సలాడ్లు ఎక్కువగా తీసుకుంటే శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే, అన్నంతో పాటు లెమన్ రైస్, కొత్తి మీర రైస్, పుదీనా రైస్, పాలక్ రైస్ తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం మాంసాహారం తినకపోవటమే మంచిదట. సాయంత్రం మసాలాలు, నూనె లేకుండా ఉడికించిన లేదా కాల్చిన ఆహార పదార్థాలు తీసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. చిరుతిండి కోసం చూస్తున్నప్పుడు పండ్లు, తక్కువ కొవ్వు గల పెరుగు, తృణధాన్యాల పదార్థాలు, లేదా కూరగాయలు ఎంచుకోమని mayoclinichealthsystem పేర్కొంది.
నీళ్లు ఒక్కటే సరిపోదు : భోజనం చేసిన తర్వాత ఏదైన ఒక పండు తప్పనిసరిగా తీసుకోవాలని hss.edu పేర్కొంది. భోజనం చివర్లో పెరుగన్నం లేదంటే తీసుకోవడం వల్ల శరీరంలో నీటిశాతం సమతుల్యం అవుతుందంటున్నారు నిపుణులు. అలాగే, క్యారెట్, మునగకాయ, సొరకాయ, పొట్లకాయ ఇలా అన్ని రకాల కూరగాయల ముక్కలు వేసి చేసే సాంబారు మంచిదని పేర్కొంటున్నారు. ఇందులో పప్పు ఉండటం వల్ల ప్రొటీన్ల రూపంలో శక్తి అందుతుందని తెలియజేస్తున్నారు. ఎండలో పనిచేసేవారు ఐదు నుంచి ఆరు లీటర్లకు తక్కువ కాకుండా ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నీళ్లు ఒక్కటే తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు నిపుణులు. ఉప్పు కలిపిన మజ్జిగ, ఉప్పు, పంచదార కలిపిన నిమ్మరసం రోజులో అప్పుడప్పుడు తాగుతూ ఉండాలట. ఈ సీజన్లో ఆహారపరంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో వల్ల ఇబ్బందులను మనం చాలా వరకు నివారించుకోవచ్చని తెలియజేస్తున్నారు
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య, మానసిక నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఆరోగ్యానికి అమ్మలాంటి "అవకాడో" - రోజూ తినడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే వదలరు!
నోటి ఆరోగ్యం కీలకం - దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లివే!

