ETV Bharat / health

ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టే ఒత్తిడి - ఎలా అధిగమించాలంటే?

- రోగనిరోధక వ్యవస్థపై ఒత్తిడి ప్రభావం - ఇలా చేస్తే మేలంటున్న నిపుణులు!

Stress
Stress (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : July 16, 2026 at 4:56 PM IST

3 Min Read
Choose ETV Bharat

Stress and Immune System : ఒత్తిడి వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. ఉద్యోగ విధుల్లో ఒత్తిడి, కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు, నిద్రలేమి వంటి వాటి వల్ల చాలామందిలో ఒత్తిడి పెరిగిపోతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా మానసిక ఒత్తిడితో ఎంతో మంది బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శరీరంపై ఎలాంటి పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం!

ప్రస్తుతం చాలామంది టార్గెట్స్, డెడ్​లైన్స్, మీటింగ్స్​ లాంటి కారణాల వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. ఇలా ఒత్తిడి ఎక్కువగా ఉంటే శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు. ఈ క్రమంలో ఒత్తిడి ఎంత పెరిగితే శరీరం అంత సులువుగా అనేక ఇన్ఫెక్షన్ల బారిన పడుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే, ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.

మనం ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కొన్ని హార్మోన్లు మార్పులు వస్తుంటాయి. దీనిలో అడ్రినల్, కార్టిసాల్ అనే స్టీరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా విడుదలవుతాయి. ఇవి దీర్ఘకాలం కొనసాగితే.. తెల్ల రక్తకణాల పనితీరు క్షీణిస్తూ ఉంటుంది. దీంతో మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు, ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడతాం- డా. గిల్లా నవోదయ్, జనరల్ ఫిజీషియన్

బీపీకే కాదు, షుగర్‌ నియంత్రణకు ‘డ్యాష్’ డైట్! - కానీ, ఈ మార్పులు తప్పనిసరంటున్న నిపుణులు!

ఇమ్యూనిటీపై ప్రభావం : మన శరీరాన్ని వైరస్​లు, బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్లు నుంచి రోగనిరోధక శక్తి కాపాడుతుందని అందరికీ తెలిసిందే. కానీ, ఒత్తిడి ఎక్కువగా ఉంటే శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ అధికంగా విడుదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రోగ నిరోధక వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తుందంటున్నారు. దీంతో శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోతుందని పేర్కొంటున్నారు. దీనివల్ల జలుబు, దగ్గు, జ్వరం, అలసట, తలనొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటాయని తెలియజేస్తున్నారు. కొంతమందిలో గాయాలు త్వరగా మానకపోవడం, నిద్ర సరిగా పట్టదట. అంతేకాదు, ఆకలి తగ్గడం, జీర్ణ సమస్యలు వంటివి కనిపిస్తాయని వివరిస్తున్నారు.

ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, అది దేనివల్ల వస్తుందో దాన్ని సరిగ్గా గుర్తించి, ట్రీట్ చేయాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచాలంటే.. ముఖ్యంగా, మన ఆహారపు అలవాట్లు పాటించాలి. వ్యాయామం చేయాలి. తాజా పండ్లు, ఆకుకూరలు, ధాన్యాలు, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. రాత్రిపూట భోజనం త్వరగా ముగించుకోవాలి. అలాగే, తొందరగా నిద్రపోవాలి-డా. గిల్లా నవోదయ్, జనరల్ ఫిజిషియన్

ఎలాంటి సమస్యలు వస్తాయంటే : దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల శరీరంలో ఇన్​ఫ్లమేషన్ పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల గుండె జబ్బులు, డయాబెటిస్, బీపీ వంటి సమస్యలు వస్తాయంటున్నారు. ఇక పొట్ట ఆరోగ్యం దెబ్బతింటే మంచి బ్యాక్టీరియా కూడా తగ్గిపోతుందని పేర్కొంటున్నారు. దీంతో రోగనిరోధక శక్తి మరింతగా బలహీన పడుతుందని తెలియజేస్తున్నారు. కాబట్టి ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.

ఒత్తిడిని తగ్గించే టిప్స్ : ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలంటున్నారు నిపుణులు. రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటలు పాటు ప్రశాంతంగా నిద్రపోవాలని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు, ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక మొబైల్, సోషల్ మీడియా వినియోగాన్ని వీలైనంత తగ్గిస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. ఒత్తిడి నియంత్రించగలిగితేనే రోగ నిరోధక శక్తి బలంగా మారుతుందని తెలియజేస్తున్నారు. అప్పుడే శరీరం వ్యాధుల నుంచి తనను తానుగా కాపాడుకోగలదని పేర్కొంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

గోరుచుట్టు వేధిస్తోందా? - ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలా? - ఈ మార్పులు తప్పనిసరంటున్న నిపుణులు!