సైనసైటిస్‌తో బాధపడుతున్నారా? - ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్న నిపుణులు!
-సైనసైటిస్ కారణాలు, చికిత్స - ఈ టిప్స్ పాటిస్తే బెటర్ అంటున్న నిపుణులు!

Published : November 9, 2025 at 12:10 PM IST
Sinusitis Symptoms and Treatment: ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో సైనసైటిస్ ఒకటి. సాధారణంగా వాతావరణంలో మార్పులతో పాటు చలి పెరిగినా సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ సోకి ఇబ్బంది అవుతుందని.. రెండు ముక్కులు బిగుసుకొని పోయి, తరచుగా జలుబు చేస్తుందంటున్నారు నిపుణులు. అలాగే, తలంతా బరువుగా, ముఖమంతా ఉబ్బరంగా ఉంటుందని చెబుతున్నారు. కనుబొమ్మలు జివ్వుమని లాగుతుంటాయని తెలియజేస్తున్నారు. కొంతమందికి సైనసైటిస్ దీర్ఘకాలంగా ఉంటుందని వివరిస్తున్నారు. ఈ క్రమంలో సైనసైటిస్కి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
సైనస్ అంటే : ముక్కుతో గాలిని పీల్చుకుంటాం, వాటినే సైనస్ అంటాం. ఇవి ముఖంలోని కళ్లు దగ్గర, ముక్కు పక్కన ఎముకలలో ఉండే గాలితో నిండిన ఖాళీ ప్రదేశాలు. వీటిలో ఇన్ఫెక్షన్ వచ్చి వాపు ఏర్పడటాన్ని 'సైనసైటిస్' అంటారు. ఈ ఇన్ఫెక్షన్ వల్ల ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, తలనొప్పి, ముఖంలో నొప్పి, దగ్గు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు.
క్రానిక్ సైనసైటిస్ : ఏళ్ల తరబడి వేధించే సైనస్ బాధలను క్రానిక్ సైనసైటిస్‌గా పేర్కొంటాం. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వాతావరణంలో మార్పులతో ఈ సమస్య వస్తుందని నిపుణులు అంటున్నారు. సైనసైటిస్ తీవ్రంగా ఉంటే గాలి ఆడకపోవడమే కాకుండా కంటిచూపుపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా, కళ్లు బైర్లు కమ్ముతాయని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో తీవ్రమైన సైనసైటిస్ ఉన్నవారిలో 70% వరకు ఎటువంటి మందులు లేకుండానే కోలుకుంటారని American Academy of Allergy asthma and Immunology అధ్యయనం పేర్కొంది. కొంతమందికి మాత్రం నాసల్ ఎండోస్కోపీ, సిటీ స్కాన్‌తో తీవ్రత తెలుస్తుందంటున్నారు నిపుణులు. ఆపై మందులు వాడితే మంచి ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.
బీపీ, షుగర్ లేకున్నా మూత్రపిండాల వ్యాధి - షాకింగ్ ఫలితాలు వెల్లడించిన 'లాన్సెట్' నివేదిక!
లక్షణాలు : పెద్దవారిలో తీవ్రమైన సైనసైటిస్ లక్షణాలు చాలా తరచుగా జలుబు తగ్గకపోతే లేదా 7 నుంచి 10 రోజుల తర్వాత అధ్వాన్నంగా మారిన తర్వాతే కనిపిస్తాయని medlineplus అధ్యయనం పేర్కొంది.
సైనసిటిస్ రకాలు :
- తీవ్రమైన సైనసైటిస్ : ఒక నెల లేదా అంతకంటే తక్కువ కాలం ఉంటుంది. ఇది సైనస్‌లలో పెరిగే వైరస్‌లు లేదా బ్యాక్టీరియా వల్ల వస్తుంది.
- సబాక్యూట్ సైనసైటిస్ : 1- 3 నెలల వరకు లక్షణాలు, వాపు ఉంటుంది.
- దీర్ఘకాలిక సైనసిటిస్ : సైనస్‌ల లక్షణాలు, వాపు 3 నెలల కంటే ఎక్కువ కాలం ఉండటం. ఇది బ్యాక్టీరియా లేదా ఫంగస్ వల్ల సంభవించవచ్చు.
జాగ్రత్తలు, చికిత్స ఇలా : చల్లని గాలి, చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. అన్నం, ఫలహారాలూ ఏవైనా వేడిగా తీసుకోవాలని చెబుుతున్నారు. ఈ క్రమంలో సూప్, పాలు, టీ ఇలా ఏదైనా వెచ్చగా తాగుతుంటే, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు నుంచి ఉపశమనం కలుగుతుందని వివరిస్తున్నారు. అలాగే, విటమిన్ సి ఎక్కువగా ఉన్న నారింజ, నిమ్మ, ద్రాక్ష, కివి లాంటివి ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటిలో ఉంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నందున జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయని పేర్కొంటున్నారు. తలస్నానం తరచుగా చేయొద్దని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా, తరచుగా ఆవిరి పట్టుకున్న ఇబ్బందులు తగ్గిపోతాయని వెల్లడిస్తున్నారు. సైనస్ బాధల్ని పెంచే అలర్జీ కారకాలైన దుమ్ము ధూళి, కాలుష్యం ఉన్న చోట నుంచి దూరంగా ఉండాలని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా, ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
Nhs.uk ప్రకారం, :
- తగినంత విశ్రాంతి తీసుకోవడం.
- పుష్కలంగా నీరు తాగడం.
- ఉప్పు నీటి ద్రావణంతో ముక్కును శుభ్రం చేసుకోవడం.
- ధూమపానం చేయవద్దు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత నీరు తాగాలి? - నిపుణుల సమాధానమిదే!
డాక్సీసైక్లిన్‌తో 'స్కిజోఫ్రీనియా' ముప్పు తగ్గుతుందా? - తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

