ETV Bharat / health

రక్తం, హిమోగ్లోబిన్ పెరగాలంటే - ఏ పండ్లు తినాలో తెలుసా?

- హిమోగ్లోబిన్ స్థాయిని సహజంగా పెంచే అద్భుతమైన పండ్లు!

Fruits that Help Increase Hemoglobin
Fruits that Help Increase Hemoglobin (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : July 8, 2026 at 3:18 PM IST

|

Updated : July 8, 2026 at 4:16 PM IST

3 Min Read
Choose ETV Bharat

Top Fruits that Help Increase Hemoglobin Fast : మానవ శరీరంలో ప్రతీ భాగానికి ఆక్సిజన్​ చేరవేసే కీలకమైన బాధ్యత రక్తంలోని హిమోగ్లోబిన్​దే. ప్రస్తుతం జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం వల్ల చాలామందిలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తహీనత, తీవ్రమైన అలసట వంటి సమస్యలు తలెత్తుతాయట. అయితే, శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరగాలంటే మందులు వేసుకోవాలని అనుకుంటారు. కానీ, మనకు ప్రకృతి ప్రసాదించిన కొన్ని పండ్లను తినడం వల్ల చాలా వేగంగా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

దానిమ్మ : రక్తాన్ని మెరుగుపరచే ఉత్తమమైన పండ్లలో దానిమ్మను ఒకటిగా పరిగణిస్తారు. ఇందులో ఐరన్, విటమన్ సి, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మలోని విటమిన్ సి అనేది ఆహారంలోని ఐరన్​ను శరీరం త్వరగా గ్రహించుకోవడానికి అవసరమంటున్నారు. అలాగే ఫోలేట్ అనేది శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచి హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడతాయని పేర్కొంటున్నారు. దీనివల్ల రక్తహీనత నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు. దానిమ్మను స్వల్ప కాలం పాటు తీసుకోవడం వల్ల ఎరిత్రోపోయిసిస్ పెరగవచ్చని National Library of Medicine పేర్కొంది.

ఆపిల్స్ : 'రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు' అని అందరికీ తెలిసిందే. ఇందులో ఐరన్, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి హిమోగ్లోబిన్ ఉత్పత్తికి మద్ధతు ఇస్తాయంటున్నారు. వీటిలోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుందని తెలియజేస్తున్నారు.

అరటిపండ్లు : అరటిపండ్లు రక్తహీనతను తగ్గించడంలో, రక్తాన్ని పెంచడంలో అద్భుతంగా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఐరన్​తో పాటు ఎర్రరక్త కణాల ఉత్పత్తికి అవసరమైన విటమిన్లు బి6, సి, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయంటున్నారు. అరటిపండులోని ఐరన్ కంటెండ్ శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి ప్రేరేస్తుందని తెలియజేస్తున్నారు. ఇందులో విటమిన్ B6 అనేది శరీరంలో కొత్త ఎర్ర రక్తకణాలు, యాంటీబాడీల తయారీలో కీలక పాత్ర పోషిస్తుందని వివరిస్తున్నారు. ఫోలేట్ యాసిడ్ రక్తహీనత రాకుండా నిరోధిస్తుందని పేర్కొంటున్నారు.

ఉదయపు అలవాట్లతో "క్యాన్సర్ ముప్పు"కు చెక్ పెట్టొచ్చట? - అవేంటో తెలుసా?

నారింజ : ఇందులో ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఉండకపోవచ్చు. కానీ, వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీరం ఐరన్​ను మరింత సమర్ధవంతంగా గ్రహిస్తుందని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో నారింజ పండ్లును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల ప్రయోజనాలు మరింత పెరుగుతాయంటున్నారు. నారింజ లేదా ఆపిల్ రసం ఐరన్​ను బాగా గ్రహిస్తాయని National Library of Medicine పేర్కొంది.

పుచ్చకాయ : ఇందులో విటమిన్ సితో పాటు ఐరన్ కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్త ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని అంటున్నారు. ఇది శరీరాన్ని హైడ్రేడెడ్​గా ఉంచడంతో పాటు మొత్తం రక్త ప్రసరణకు తోడ్పడుతుందని తెలియజేస్తున్నారు.

ఖర్జూరాలు : ఇందులో సహజంగానే ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు. ఖర్జూరాలలోని గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు తక్షణ శక్తిని అందిస్తాయని అంటున్నారు. ఖర్జూరపు సారం గుండె ద్వారా ఎరిథ్రోపోయిటిన్ సంశ్లేషణను పెంచడానికి, తద్వారా ఎముక మజ్జను ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి/హెమోపోయిసిస్‌కు ప్రేరేపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని sciencedirect పేర్కొంది.

కిస్‌మిస్‌ : పరిమాణంలో చిన్నవైనప్పటికీ, కిస్​మిస్​లో ఐరన్, కాపర్ పుష్కలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎర్రరక్త కణాల ఉత్పత్తికి చాలా అవసరమంటున్నారు. అయితే, వీటిని నేరుగా కంటే నానబెట్టుకొని తీసుకుంటే.. ఇందులోని ఐరన్‌ని శరీరం మరింత సులభంగా గ్రహిస్తుందంటున్నారు. తద్వారా రక్తం పెరగడంతో పాటు అలసట, నీరసం దూరమై శరీరానికి తక్షణ శక్తి కూడా వస్తుందని పేర్కొంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

తినడానికీ ఓ లెక్కుందట! - ఎప్పుడు? ఎలా తినాలో తెలుసా?

పిల్లల్ని కనడం 'వాయిదా' వేస్తున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందేనట!

Last Updated : July 8, 2026 at 4:16 PM IST