ETV Bharat / health

ఒత్తిడి వల్ల శరీరం విశ్రాంతి కోల్పోతుందా? - నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచే మార్గాలు ఇవేనట!

నాడులను శాంత పరచుకోవడానికి మార్గాలున్నాయట - వాటిని ట్రై చేస్తే మేలు జరుగుతుందని నిపుణుల సూచన!

Representational image
Representational image (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : July 20, 2026 at 3:44 PM IST

3 Min Read
Choose ETV Bharat

Stress Affects Your Nervous System : ఒత్తిడి తీవ్రమైతే నాడీ వ్యవస్థ అతిగా స్పందిస్తుంది. దీంతో మనసు ఉద్రిక్తంగా మారుతుంది. శరీరం విశ్రాంతిని కోల్పోతుంది. ఈ క్రమంలో నాడుల స్పందనను నెమ్మదింపజేయడానికి ఎన్నో పరిష్కారాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

ఆలోచనల నుంచి వర్తమానంలోకి : ఒత్తిడి, ఆందోళన తరచూ శరీరంలో మొదలవుతుంది కానీ, మనసులో కాదు. ఇది నాడీ వ్యవస్థను శాంతపరచడం ద్వారా జరుగుతుంది. కాబట్టి, మన ఆలోచనల్ని దానిపై మళ్లించడం, శ్వాసను గమనించాలి. అలాగే, నేలపై మన పాదాలను అనుభూతి చెందడం, చుట్టూ ఉన్న పరిసరాలపై శ్రద్ధ పెట్టాలి. ఇది మిమ్మల్ని ఆలోచనల నుంచి బయటకు తీసుకువచ్చి, వర్తమానంలోకి తీసుకురావడానికి సహాయపడుతాయని నిపుణులు చెబుతున్నారు. తద్వారా, ఒత్తిడి తగ్గుతుందంటున్నారు.

మానసిక స్థితిని అర్థం చేసుకోవడం : నాడీ వ్యవస్థ ఎప్పుడు ఉత్తేజితమవుతుందో మొట్టమొదట గుర్తించాలి. 'ఇప్పుడు నా శరీరంలో ఏం జరుగుతోంది? నేను కోపంగా, అశాంతితో లేదా ఆందోళనగా ఉన్నానా? అని మనల్ని మనం ఆత్మావలోకనం చేసుకోవాలి. ఇలా చేస్తే ప్రతిచర్య, ప్రతిస్పందన మధ్య ఓ విరామాన్ని సృష్టించి ఒత్తిడిని దూరం చేస్తుందంటున్నారు నిపుణులు

"ప్రెగ్నెన్సీ"లో నిద్ర పట్టడం లేదా? - ఇలా చేస్తే మంచిదట!

వేగాన్ని తగ్గించుకోవడం : ఒత్తిడి, ఆందోళన అత్యవసరాన్ని సృష్టిస్తాయి. ప్రతి పని ముఖ్యమైనదిగా అనిపిస్తుందట. మన నాడీ వ్యవస్థ వేగానికి ప్రతిస్పందిస్తుంది. కాబట్టి, కదలికలు, మాటలు, శ్వాసను నెమ్మదిగా చేయడం ద్వారా మనం సురక్షితంగా ఉన్నామని శరీరానికి సంకేతం పంపొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మనం తరచూ ఒత్తిడి, ఆందోళనకు గురైనట్లు లేదా విశ్రాంతి లేనట్లుగా కనిపిస్తే, ఈ స్థితిలో ఎక్కువ సేపు గడిపామని దానర్థం. ఇలాంటప్పుడు ఒత్తిడి, ఆందోళన ఎక్కడ మొదలైందో ఆలోచించాలి. నాడీవ్యవస్థ స్తంభించడానికి కారణాలను తెలుసుకోవాలి. నాడీవ్యవస్థను నియంత్రించుకోవాలి. అంటే, మన శరీరం ప్రశాంతంగా ఉండటానికి తగినంత సురక్షితంగా భావించేలా సహాయపడాలి. - ఒవెన్ ఓ కెన్, బ్రిటన్​కు చెందిన సుప్రసిద్ధ మనోవైద్య నిపుణుడు

అంతర్గత సంఘర్షణకు చెక్ : ఒత్తిడి భావనను ప్రతిఘటించడానికి బదులుగా దాన్ని అనుమతించాలట. మన భావాలతో పోరాడినప్పుడు మరో పొర ఉద్రిక్తతను జోడించినట్లు లెక్క. ఆందోళనకు అడ్డుపడకుండా ఉండే అది అంతర్గత సంఘర్షణను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నాడీ వ్యవస్థ కుదుటపడటానికి సహాయపడుతుందని అంటున్నారు.

బ్రేక్ తీసుకోవడం : ఒత్తిడి వలయంను ముందుగానే నిలువరించాలట. మనం తీసుకునే చిన్న బ్రేక్ కూడా ఈ వలయం తీవ్రం కాకుండా ఆపగలదు. ఈ క్రమంలో ఒత్తిడి సంకేతాలను ఎంత ముందుగా గమనిస్తే, స్పందన అంత సులవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

రోజువారీ అలవాట్లలో మార్పులు : రోజులో సురక్షితమైన క్షణాలను సృష్టించుకోండి. మన నాడీవ్యవస్థ నిరంతరం సంకేతాల కోసం వెతుకుతూ ఉంటుంది. ఏ విధమైన ఆటంకాలు లేకుండా కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం, కొద్దిసేపు నడవడం, నిరంతర సమాచార ప్రసారానికి దూరంగా ఉండటం క్రమం తప్పకుండా చేసినప్పుడు, చిన్న విరామాలు కూడా ఆందోళన నుంచి ఉపశమనానికి తోడ్పడతాయని నిపుణులు సలహా ఇస్తున్నారు.

  • ఒత్తిడిలో ఓ సాధారణ ధోరణ ఏమిటంటే, మనం అనుకున్న రీతిలో దాన్ని పరిష్కరించాలనుకోవడం. కానీ ఇది తరచుగా మరింత ఒత్తిడిని సృష్టించగలదని నిపుణులు చెబుతున్నారు. ఆందోళన అనేది మానవ సహజమని, దాన్ని పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.

శరీరం సహజ ప్రతిస్పందన : ముప్పును పసిగట్టినపుడు శరీరం సహజంగానే పోరాటమైనా చేస్తుంది లేదా పలాయన మార్గాన్ని ఎంచుకుంటుంది. ఆ సమయంలో వేగవంతమైన శ్వాస, కండరాలు బిగువుగా మారడం, గుండె వేగంగా కొట్టుకోవడం, అప్రమత్తం కావడం లాంటివి ఉండొచ్చంటున్నారు నిపుణులు. ఇవన్నీ మనల్ని మనం రక్షించుకోవడానికి ఉద్దేశించినవట. కానీ, మన నాడీ వ్యవస్థ వాస్తవ ప్రమాదానికి, ఆందోళనకరమైన ఆలోచనలకు మధ్య తేడాను ఎల్లప్పుడూ గుర్తించదు. కాబట్టి, రోజువారీ ఒత్తిడి కూడా పోరాటం లేదా పలాయనం ప్రతిస్పందనను ప్రేరేపించొచ్చట. మనం పోరాటం లేదా పలాయన స్థితిలో చిక్కుకుపోయినట్లు భావిస్తే, దాని నుంచి బలవంతంగా బయటకు రావడం లక్ష్యం కాకూడదని నిపుణులు చెబుతున్నారు. దానికి బదులుగా, శరీరానికి సున్నితంగా భద్రతా సంకేతాలు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.

పరిశోధన మూలాలు :

https://www.ncbi.nlm.nih.gov/books/NBK541120/

https://www.health.harvard.edu/healthy-aging-and-longevity/understanding-the-stress-response

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పోషకాహార లోపం - మహిళలు తెలుసుకోవాల్సిన ఆరోగ్య రహస్యాలు ఇవేనట!

'సైలెంట్ కిల్లర్స్' - మనశ్శాంతిని దెబ్బతీసే చిన్న అలవాట్లు ఇవేనట!