ETV Bharat / health

గంజాయి వల్ల 'ఆ రోగాలకు' ఐదురెట్ల అవకాశాలు! - లక్షలాది రికార్డులను పరిశోధించిన నిపుణులు!

గంజాయి అలవాటున్న వారిలో తల, మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం - హెచ్చరిస్తున్న తాజా పరిశోధనలు!

cannabis_impact_on_health
cannabis_impact_on_health (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 18, 2026 at 11:03 AM IST

3 Min Read
Choose ETV Bharat

Impact of cannabis on health : ఏళ్ల తరబడి గంజాయి సేవిస్తున్న వారిలో తల, మెడ క్యాన్సర్ వచ్చే అవకాశాలు మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా ఉంటుందని కొత్త పరిశోధనలో వెల్లడైంది. లక్షలాది వైద్య రికార్డులను విశ్లేషించిన వైద్య నిపుణుల బృందం ఈ ప్రమాదాన్ని గుర్తించి హెచ్చరించింది. గంజాయి వాడకం వల్ల తల, మెడ క్యాన్సర్ వచ్చే మొత్తం ప్రమాదం పెరుగుతుందని సీనియర్ డాక్టర్ నీల్స్ కోకోట్ తెలిపారు.

'ప్రివెంటివ్ మెడిసిన్ రిపోర్ట్స్‌'లో ప్రచురితమైన ఈ కొత్త అధ్యయనం ప్రకారం గంజాయి వాడకం రుగ్మత (CUD) ఉన్నవారికి ఐదేళ్లలోపు నోటి క్యాన్సర్ (ముఖ్యంగా పెదవులు లేదా నాలుక క్యాన్సర్) వచ్చే ప్రమాదం మూడు రెట్ల కంటే ఎక్కువగా ఉందని తేలింది. ఈ అధ్యయనంలో గంజాయి వాడకంలోని వివిధ పద్ధతుల మధ్య తేడాను చూపనప్పటికీ 'ధూమపానం' ప్రామాణికంగా తీసుకున్నారు. గంజాయిని పొగ రూపంలో పీల్చిన వారిపై పరిశోధనలు జరిపారు.

"డయాబెటిస్" కంటి చూపును ప్రభావితం చేస్తుందా? - పరిశోధనలు ఏం చెప్తున్నాయి?

దాదాపు 45వేల మందికి పైగా రోగులపై జరిపిన అధ్యయనంలో గంజాయి వాడకం రుగ్మత (CUD) ఉన్నవారిలో నోటి క్యాన్సర్ రేటు 0.74 శాతంగా ఉందని, CUD లేనివారిలో ఇది కేవలం 0.23 మాత్రమే అని డాక్టర్ నీల్స కోకోట్ వివరించారు. గంజాయు వాడకం, ఇతర జీవనశైలి కారకాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా ప్రమాదంలో ఈ సుమారు 3.25 రెట్ల పెరుగుదలను గుర్తించారు. ఇతరులతో పోలిస్తే గంజాయి సేవించే వారిలో నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం 6.24 రెట్లు ఎక్కువగా ఉందని కూడా ఈ పరిశోధనలో తేలింది.

'యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' ప్రకారం గంజాయి వాడకం రుగ్మత (CUD) అంటే

  • గంజాయి తీసుకోవాలన్న కోరిక
  • గంజాయి ప్రభావాలకు (మత్తు, రుచి)కి అలవాటు పడటం
  • ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మితిమీరిన వాడకం
  • దానిని మానుకోలేకపోవడం

క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి. నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం, నోరు లేదా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న వారిలో సుమారు 69 శాతం మంది, వ్యాధి నిర్ధారణ తర్వాత ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవిస్తారు. అయితే, క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తే (మెటాస్టాసిస్), ఈ రేటు 14 శాతానికి పడిపోతుంది. అదేవిధంగా, స్వరపేటిక (లారింజియల్) క్యాన్సర్‌తో బాధపడుతున్న వారిలో సుమారు 61 శాతం మంది ఐదేళ్లు జీవిస్తారు, కానీ క్యాన్సర్ వ్యాపిస్తే ఈ రేటు 16 శాతానికి పడిపోతుంది.

తల, మెడ క్యాన్సర్ లక్షణాలు

  • తల, మెడ క్యాన్సర్ లక్షణాలు సాధారణంగా అనిపిస్తాయి. జలుబు లేదా గొంతు నొప్పి వంటి తక్కువ తీవ్రమైన అనారోగ్యాలను పోలి ఉంటాయి. దీర్ఘకాలంగా గొంతు నొప్పి అత్యంత సాధారణ సంకేతం.
  • దీర్ఘకాలిక గొంతు నొప్పి
  • నిరంతర చెవి నొప్పి లేదా చెవి ఇన్ఫెక్షన్ లక్షణాలు
  • తరచుగా తలనొప్పి
  • ముఖం లేదా మెడలో తగ్గని నొప్పి
  • పై దంతాలలో నొప్పి
  • నమిలేటప్పుడు లేదా మింగేటప్పుడు నొప్పి
  • గొంతు బొంగురుపోవడం లేదా స్వరంలో మార్పు
  • శ్వాస తీసుకోవడంలో లేదా మాట్లాడటంలో ఇబ్బంది

ఇలా అనిపించవచ్చు

  • గొంతు, నోరు లేదా మెడలో గడ్డలు
  • నోరు లేదా నాలుకపై మానని పుండ్లు
  • తరచుగా ముక్కు నుంచి రక్తం కారడం, లాలాజలంలో రక్తం పడటం, లేదా కఫం
  • చిగుళ్లు, నాలుకపై లేదా, నోటి లోపల తెల్లటి లేదా ఎర్రటి మచ్చలు
  • దవడ, మెడ లేదా ముఖం ఒక వైపు వాపు (దీనివల్ల కట్టుడు పళ్లు సరిగ్గా కుదరకపోవచ్చు)
  • పైన పేర్కొన్న లక్షణాలు ఏవైనా మీకు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. నిర్ధారణ చేసుకోవడానికి పూర్తిస్థాయి పరీక్ష అవసరం.

ముఖ్య గమనిక : గంజాయి వాడకం-దుష్పరిణామాలపై ఇక్కడ అందించిన ఆరోగ్య సమాచారం చిట్కాలు కేవలం అవగాహన కోసమే. శాస్త్రీయ పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. ఏవైనా సందేహాలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.

ఈ పండ్లు కాలేయాన్ని "డిటాక్స్" చేస్తాయట! - అవేంటో తెలుసా?

మీ ఆరోగ్యాన్ని "పాదాలు" చెప్పేస్తాయట - ఎలాగో తెలుసా?